ఆగస్టు ఒకటో తారీకు 2025 నుండి తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరికీ సెల్ఫోన్లో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది ఇక ప్రతిరోజు స్కూలు వెళ్లినప్పుడు 9 గంటలకు ఆ తర్వాత వదినెప్పుడు నాలుగు గంటలకు సెల్ఫోన్లో ఉన్న ఆప్ ద్వారా రోజుకు రెండుసార్లు హాజరు ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ సెలవు పెట్టినట్లయితే ఆ సెలవును కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సెలవును ఎలా ఆన్లైన్ చేయాలి సంబంధిత ప్రధానోపాధ్యాయులు తమ కిందిస్థాయి ఉపాధ్యాయులు పెట్టిన సెలవును ఎలా ఆమోదించవలెను ఈ తెలుపుచున్నాము.
1. ఉపాధ్యాయులు ఎలా అప్లై చేయాలి ?
ఈ క్రింద గల బటన్ పై క్లిక్ చేసి డీఎస్సీ ఎఫ్ ఆర్ఎస్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి
a. యూజర్ ఐడి అనగా మీ యొక్క ఎంప్లాయ్ ఐడి
b. పాస్వర్డ్ staff@123
పైన చెప్పిన మీయొక్క ఎంప్లాయ మరియు పాస్వర్డ్ నమోదు చేసి స్క్రీన్ షాట్ లో చూపిన విధంగా తెలంగాణ సెలెక్ట్ చేసుకుని లాగిన్ బటన్ నొక్కండి
ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే రెండు ఆప్షన్స్ బ్లూ కలర్ లో కనబడతాయి అవి
బ్యాలెన్స్ లీవు
లీవ్ అప్లై
లీవ్ అప్లై చేయడం కోసం అప్లై లీవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి
క్లిక్ చేయగానే మీరు అప్లై చేసే లీవ్ రకము సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత సెలవు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఒకేరోజు సెలవు తీసుకోవాల్సినప్పుడు రెండిట్లోనూ ఒకే తేదీని సెలెక్ట్ చేసుకుని ఎందుకు సెలవు తీసుకుంటున్నారు కారణాన్ని రాసి అప్లై చేయండి.
సెలవు అప్లై చేసిన తర్వాత మీరు బడికి వెళ్లాల్సి వస్తే అనగా సెలవును క్యాన్సల్ ఎలా చేసుకోవాలి
సెలవు అప్లై చేసిన తర్వాత కూడా మనం బడికి వెళ్లాల్సి వచ్చినప్పుడు పైన చూపించినట్టుగా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ చూడగానే పై విధంగా మీరు అప్లై చేసిన లీవ్ కనబడుతుంది అందులో చివర యాక్షన్ అన్న వాళ్ళ దగ్గర క్యాన్సల్ బటన్ ను నొక్కండి
అప్పుడు మీ సెలవు క్యాన్సల్ అవుతుంది.
ఇలా సెలవును అప్లై చేసిన తర్వాత మీ ప్రధాన ఉపాధ్యాయులు అప్రూవ్ చేస్తేనే మీ సెలవు అప్రూవ్ అవుతుంది లేకపోతే పెండింగ్ లోనే ఉంటుంది.
ఒకవేళ మీరు సెలవు పెట్టుకుని మీరు బడికి వచ్చినట్లయితే మీ సెలవులు క్యాన్సల్ మీ ప్రధానోపాధ్యాయులు కూడా చేయవచ్చు.
ప్రధానోపాధ్యాయులు మీరు పెట్టుకున్న సెలవ ఎలా అప్రూవల చేయాలో ఈ క్రింది పేజీలో కలదు
Related Topics
🔥 *DSE FRS లో ఉపాధ్యాయులు సెలవును ఎలా అప్లై చేయాలో వివరణ తెలుగులో స్క్రీన్ షాట్లతో...*
🔥 *DSE FRS - ఉపాధ్యాయులు సెలవును అప్లై చేసిన తర్వాత ఆ లీవ్ ను ప్రధానోపాధ్యాయులు అప్రూవ్ చేయాలి ఇది ఎలా చేయాలో తెలుగులో వివరణ స్క్రీన్షాట్లతో...*
👉 *DSE FRS - యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమిటి ? పాస్వర్డ్ ను ఎలా మార్చుకోవాలి తెలుగులో వివరణ స్క్రీన్ షాట్లతో...*
🔥 *ఈ రోజు నుండి ఉపాధ్యాయులకు కూడా FRS. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ? హాజరు ఎలా చేయాలో ? వివరణ తెలుగులో...*


Please give your comments....!!!