NCF 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం
NCF 2005 విద్యార్థుల పాఠ్యాంశ అభివృద్ధికి 5 మార్గదర్శక సూత్రాలను పేర్కొంది-
పాఠశాల వెలుపల నిజ జీవిత ఉదాహరణలతో అభ్యాసాన్ని అనుసంధానించడం
బట్టీ పట్టే పద్ధతుల కంటే భిన్నమైన అభ్యాస విధానాలను నిర్ధారించడం
పాఠ్యపుస్తకాలకు మించి జ్ఞానం మరియు అనుభవాలను అందించేలా పాఠ్యాంశాలను మెరుగుపరచడం
పరీక్షలు రాసే సౌలభ్యాన్ని మెరుగుపరచడం మరియు వాటిని తరగతి పాఠశాల జీవితంతో అనుసంధానించడం.
దేశ ప్రజాస్వామ్య రాజకీయాల్లోని ఆందోళనల ద్వారా తెలియజేయబడిన ఒక ప్రధాన గుర్తింపును పెంపొందించడం.
నూతన జాతీయ విద్యావిధానం కొత్త విద్యా విధానం-2020.
భారతదేశంలో మొట్ట మొదటి జాతీయ విద్యావిధానం 1968
సిఫారసు చేసిన కమిటి : కొఠారీ కమీషన్
ప్రధానమంత్రి : ఇందిరాగాంధీ
విద్యా విధానం :10+2+3
"1986 " జాతీయ విద్యావిధానం
పునః సమక్ష చేపిన సంవత్సరం -1992
ప్రధాన మంత్రి : P.V- నరసింహారావు
NCF 2020 విద్య విధానం
5+3+3+4
చైర్మన్ కస్తూరి రంగన్
నివేదిక మే 31,2019
విద్య ప్రగతి పర్యవేక్షణ కు జాతీయ విద్య కమిషన్ ఏర్పాటు - చైర్మన్ ప్రధాన మంత్రి
ఉదేశ్యం: 2040 నాటికి విద్య వ్యవస్థ ను మార్చడం
విద్య దశల నిర్మాణం:
5 సం లు -
3- 8 ఇయర్స్ ఫౌండేషన్ కోర్సు
6- 8 ఇయర్స్ 1,2 తరగతులు
3 సం లు:
8- 11 సం ప్రిపరేటరీ పీరియడ్
3,4,5 తరగతులు
3 సం లు
11- 14 సం మిడిల్ స్టేజ్
6,7,8 తరగతులు
4 సం లు
14- 18 సం లు
9,10,11,12 తరగతులు
NCF 2005 విద్య విధానం:
నివేదిక సమర్పణ : 2005 మే 2
స్టీరింగ్ కమిటీ చైర్మన్: ప్రో. యశ్పాల్
సభ్యులు: 35
NCF 2000 ను మార్పులు చేసి దీనిని తయారు చేశారు.
ఇందులో మన రాష్ట్రం నుండి శాంత సిన్హా పాల్గొన్నారు.
ఇది నాల్గవది 1975, 1988, 2000
అంశం: Learning without burden భారం లేని విద్య
నియమించినవారు: కేంద్ర మానవ వనరుల శాఖ
నివేదిక సమర్పణ: NCERT
ఇందులో గల అధ్యాయాలు 5 అవి
దృక్పథం
అభ్యసనం , ఙ్ఞానం
పాఠ్యాంశాలు, మూల్యాంకనం
తరగతి గది వాతావరణం
సంస్కరణలు
శిశువు సహజ సిద్ధ అభ్యసి
స్వీయ కృత్యాలకు, అనుభవాల ద్వారా ఙ్ఞానం పొందాలి
శిశు కేంద్రిత అభ్యసనం జరగాలి
త్రిభాష సూత్రం , బహు భాష వాదం
సాంకేతిక ( ఐటీ ), కంప్యూటర్ విద్య తప్పని సరి
కళ విద్య
ఆరోగ్యం, వ్యాయామం లను ప్రాథమిక స్థాయిలో అనియతంగా ప్రవేశ పెట్టాలి.
పని-విద్య : పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు పని కేంద్రీకృత విద్యగా విద్యా బోదన జరగాలి
గణితం: విద్యార్థుల్లో తార్కిక ఆలోచనలను పెంపొం దించాలి
సైన్స్: విద్యార్థుల్లో పరిశీలనా శక్తిని పెంపొందించాలి
సామాజిక శాస్త్రాలు: విద్యార్థుల్లో మానవ సంబం ధాలను పెంపొందించాలి. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా బోధించాలి.
మూల్యాంకనం
బాల్యారంభ విద్య (1-2 తరగతులు)
1. బాల్యారంభ దశలో ప్రవేశ పెట్టే కృత్యాలు వారి ఆరో గ్యాన్ని, శారీరకాభివృద్ధిని మూల్యాంకనం చేయాలి.
మౌఖిక, లిఖితపూర్వకమైనా ఎలాంటి పరీక్షలు పెట్టగూడదు
3-8 తరగతులు
1. పరిశీలనలు, మౌఖిక లిఖిత పరీక్షలు లాంటి పద్ధతుల్ని ఈ దశలో ఉపయోగించవచ్చు
9-12 తరగతులు
1. స్వీయ మూల్యాంకనంతో పాటు ఈ దశలో ఎక్కువగా పరీక్షల మీద, ప్రాజెక్టుల మీద ఆధారపడి పాఠ్య జ్ఞానాన్ని మూల్యాంకనం చెయ్యాలి
మిగిలిన అంశాన్ని పరిశీలనల ద్వారా అంచనా వెయ్యవచ్చు.
పని అనుభవం, వ్యాయామ విద్య, సంగీతం, కళలు కూడా విద్యా ప్రణాళికాంశాలే. వీటిని కూడా మూల్యాంకనం చేయాలి
పుస్తకాలు చూసి రాసే పరీక్ష పద్ధతిని స్వీకరించాలి. దీన్ని అన్ని దశల్లో అమలు పరచాలి.
పాస్, ఫెయిల్ అనే విధానాల్ని పరీక్ష విధానం నుంచి తొలగించాలి. వాటి స్థానంలో గ్రేడులు ఇచ్చే విధానాన్ని పరిశీలించవచ్చు.
ప్రవేశ పరీక్షలు, బోర్డు పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోను 5,8,11 తరగతులకు జరపకూడదు.
11వ తరగతిలో చేరాలనుకొనేవారికి మాత్రమే పదో తరగతిలో పబ్లిక్ పరీక్ష పెట్టాలి. మిగిలిన వారికి పాఠశాల నుంచి సర్టిఫికేటు ఇవ్వాలి.
విద్యార్థుల మధ్య పోటీ వాతావరణం పెంచడానికి వారిని పరీక్షల్లోని నిష్పాదన ఆధారంగా వివిధ సమూహాలుగా విభజించడం గానీ అత్యధిక మార్కులు సంపాదించిన వారికి బ్యాడ్జీలు కానీ, పట్టాలు కానీ తగిలించడం సరికాదు.
క్లాస్ లీడర్, శిక్ష-బహుమతి అమలు చేయరాదు.
యూనిఫాం, సమయపాలన విషయంలో విద్యార్థులను శిక్షించడం సమంజసం కాదు. అసలు యూనిఫాంకు అభ్యసనకు సంబంధం లేదు.
గ్రంథాలయాలు-వారానికి ఒకసారి ఒక పీరియడ్ గ్రంథాలయం కోసం కేటాయించాలి.
వేసవి సెలవుల్లో కూడా పాఠశాల గ్రంథాలయం తెరచి ఉండాలి.
హోం వర్కుకు సమయం కింది విధంగా ఉండాలి
ప్రాథమిక-వారానికి 2 గంటలు
ప్రాథమికోన్నత-రోజుకు 1 గంట (వారానికి 6 గంటలు)
ఉన్నత, హైయర్ సెకండరీ-రోజుకు 2 గంటలు (వారానికి 10-12)
జాతీయ విద్యా విధానం (NEP-2020) – ముఖ్యమైన One-Liners*
1. NEP-2020 భారతదేశపు మూడవ జాతీయ విద్యా విధానం.
2. NEP-2020 ను 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
3. NEP-2020 డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ డా. కస్తూరిరంగన్.
4. డా. కస్తూరిరంగన్ ఇస్రో మాజీ ఛైర్మన్.
5. కస్తూరిరంగన్ కమిటీ తన నివేదికను 31 మే 2019న సమర్పించింది.
6. NEP-2020లో 10+2 విధానాన్ని 5+3+3+4 విధానంగా మార్చారు.
7. ఫౌండేషన్ స్టేజ్ 5 సంవత్సరాలు ఉంటుంది.
8. ఫౌండేషన్ స్టేజ్‌లో 3 సంవత్సరాల ప్రీ-స్కూల్ + 1, 2 తరగతులు ఉంటాయి.
9. ఫౌండేషన్ స్టేజ్ వయస్సు 3 నుండి 8 సంవత్సరాలు.
10. ప్రిపరేటరీ స్టేజ్ 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉంటుంది.
11. ప్రిపరేటరీ స్టేజ్ వయస్సు 8 నుండి 11 సంవత్సరాలు.
12. మిడిల్ స్టేజ్ 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉంటుంది.
13. మిడిల్ స్టేజ్ వయస్సు 11 నుండి 14 సంవత్సరాలు.
14. సెకండరీ స్టేజ్ 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉంటుంది.
15. సెకండరీ స్టేజ్ వయస్సు 14 నుండి 18 సంవత్సరాలు.
16. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధనకు ప్రాధాన్యత ఇచ్చారు.
17. మాతృభాషా బోధనను 8వ తరగతి వరకు కొనసాగించవచ్చు.
18. 2030 నాటికి 100% GER సాధించడమే లక్ష్యం.
19. GER అంటే Gross Enrolment Ratio.
20. PARAKH సంస్థ విద్యార్థుల మూల్యాంకనం కోసం ఏర్పాటు చేయబడింది.
21. PARAKH పూర్తి రూపం Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development.
22. 6వ తరగతి నుండి వృత్తి విద్యను ప్రవేశపెట్టారు.
23. వృత్తి విద్య కోసం సంవత్సరానికి 10 Bagless Days ఉంటాయి.
24. 2025 నాటికి 50% మంది విద్యార్థులకు వృత్తి విద్య అందించడమే లక్ష్యం.
25. MHRD పేరును Ministry of Education గా మార్చారు.
26. 2030 నాటికి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ B.Ed కనీస అర్హతగా ఉంటుంది.
27. FLN అంటే Foundational Literacy and Numeracy.
28. 3వ తరగతి చివరినాటికి FLN సాధించాలి.
29. ECCE అంటే Early Childhood Care and Education.
30. ECCE వయస్సు 3 నుండి 6 సంవత్సరాలు.
31. భారతదేశపు మొదటి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చింది.
32. 1968 విద్యా విధానం కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది.
33. కొఠారి కమిషన్ 1964లో నియమించబడింది.
34. 1968 విద్యా విధానం ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టబడింది.
35. 1968 విధానంలో 14 సంవత్సరాల వరకు ఉచిత, నిర్బంధ విద్య లక్ష్యం.
36. రెండవ జాతీయ విద్యా విధానం 1986లో వచ్చింది.
37. 1986 విద్యా విధానం రాజీవ్ గాంధీ హయాంలో ప్రవేశపెట్టబడింది.
38. 1992లో 1986 విధానానికి సవరణలు చేశారు.
39. NEP-2020 నరేంద్ర మోదీ హయాంలో అమలులోకి వచ్చింది.
40. MERU అంటే Multidisciplinary Education and Research Universities.
41. MERUలను ప్రపంచ స్థాయి విద్యాసంస్థలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యం.
42. NEP-2020లో 360 డిగ్రీల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ప్రవేశపెట్టారు.
43. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు Cognitive, Affective, Psychomotor అంశాలను కలిగి ఉంటుంది.
44. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో Self Assessment ఉంటుంది.
45. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో Peer Assessment ఉంటుంది.
46. NEP-2020 ప్రకారం విద్యాహక్కు పరిధిని 3–18 సంవత్సరాలకు విస్తరించాలని సూచించారు.
47. విద్యాహక్కు చట్టం (RTE) 2009లో ఆమోదించబడింది.
48. RTE చట్టం 1 ఏప్రిల్ 2010 నుండి అమల్లోకి వచ్చింది.
49. RTE చట్టం మొదట 6–14 సంవత్సరాల పిల్లలకు వర్తించింది.
50. 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారింది.
51. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21-A చేర్చబడింది.
52. భారతదేశం విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన 135వ దేశం.
53. స్కూల్ కాంప్లెక్స్ భావన వనరుల భాగస్వామ్యం కోసం ప్రవేశపెట్టబడింది.
54. NEP-2020లో బోర్డు పరీక్షల్లో Core Competenciesకు ప్రాధాన్యత ఉంటుంది.
55. బోర్డు పరీక్షల్లో భట్టి విధానాన్ని తగ్గించడమే లక్ష్యం.
56. CWSN కోసం Special Education Zones ఏర్పాటు చేయాలని సూచించారు.
57. DIKSHA ప్లాట్‌ఫారం ఉపాధ్యాయుల డిజిటల్ శిక్షణ కోసం రూపొందించబడింది.
58. త్రిభాషా సూత్రంలో సంస్కృతం ఒక ఎంపిక మాత్రమే.
59. సంస్కృత భాషను నిర్బంధం చేయలేదు.
60. వయోజన విద్యలో జీవితకాల అభ్యసనానికి ప్రాధాన్యత ఇచ్చారు.


Please give your comments....!!!