Type Here to Get Search Results !

RTE విద్య హక్కు చట్టం 2009 Right To Education Notes, Bits, Practice Test

ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం -2009 (RTE-2009)


  • 2009 జులై 20 - రాజ్యసభ ఆమోదం

  • 2009 ఆగస్టు 4 - లోక్ సభ ఆమోదం

  • 2009 ఆగస్టు 26 - రాష్ట్రపతి ఆమోదం

  • 2009 ఆగస్టు 27 కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదల

  • చట్టం అమల్లోకి వచ్చిన తేదీ: 2010, ఏప్రిల్ 1.

  • విద్యాహక్కు చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి.


ముఖ్యాంశాలు


  • బడి వయసు పిల్లలందరినీ తమ వయసుకు తగిన తరగతిలో ఉండేలా చూడాలి.

  • ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. పరిధిలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి.

  • విద్యకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి.

  • పిల్లల నుంచి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయకూడదు.

  • ఏ కారణంతో అయినా ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

  • ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలోనూ ఒక సంవత్సరం కంటే ఎక్కువగా నిలిపి ఉంచకూడదు.

  • ప్రాథమిక తరగతులకు ఎంపిక పరీక్ష నిర్వహించకూడదు.

  • ఏ విద్యార్థిని కూడా శారీరకంగా, మానసికంగా హింసించకూడదు.

  • ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడి నిర్వహించకూడదు.

  • పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేయాలి.

  • నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) ని ప్రతి విద్యార్థికీ ఏర్పాటు చేయాలి.

  • ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదు.

  • బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేయాలి.

  • విద్యా విధాన ఆధునిక ధోరణుల్లో మార్పులు, సలహాలకు జాతీయ స్థాయిలో 'జాతీయ సలహా సంఘం', రాష్ట్ర స్థాయిలో 'రాష్ట్ర సలహా మండలి'ని ఏర్పాటుచేయాలి.

  • రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా చట్టంలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

  • జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.

  • 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు ఉచిత నిర్బంధ విద్య 

  • ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు

  • తీవ్రమైన వైకల్యంతో బాధపడే బాలలకు రవాణా సౌకర్యా లు ఏర్పాటుచేయాలి. లేకపోతే ఇంటివద్దే విద్యనందించాలి

  • రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే టీచర్లందరికీ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి.

  • వయసు ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు

  • బడిలో ప్రవేశ గడువు తర్వాత ప్రవేశం కోరినా తిరస్కరించకూడదు.

  • బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు బడి నుంచి తొలగించకూడదు.

  • బాలలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించరాదు. అలాంటి చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

  • విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటుచేయాలి. కమిటీ మొత్తం సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలి. ఈ కమిటీకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా ఉండాలి

  • ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

  • విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  • జనాభా గణన, ఎన్నికల విధులకు తప్ప ఉపాధ్యాయులను ఏ విద్యేతర పనులకు వినియోగించరాదు.

  • ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్స్, ప్రైవేటు బోధన పనులు చేయరాదు.


చట్టం అతిక్రమిస్తే విధించే జరిమానాలు


  1. సెక్షన్ 18 ప్రకారం ప్రభుత్వ నిర్ణీత గడువు తర్వాత కూడా గుర్తింపులేని పాఠశాలను నడిపితే ఒక లక్ష జరిమానా విధిస్తారు.

  2. ఒకవేళ జరిమానా తర్వాత కూడా గుర్తింపు లేకుండా మళ్లీ పాఠశాలను నిర్వహిస్తే రోజుకు 10 వేలు జరిమానా విధిస్తారు.

  3. సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తే తొలిసారి తప్పుకు రూ.25,000, పునరావృతం అయితే రూ.50,000 జరిమానా విధిస్తారు.

  4. ఏ పాఠశాలలోనూ బోధనా రుసుం కాకుండా ఇతర రూపాల్లో ఎలాంటి ఫీజు (క్యాపిటేషన్ ఫీజు) వసూలు చేయరాదు. అలా వసూలుచేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు.


పాఠశాలల పనిదినాలు

  • ప్రాథమిక పాఠశాలలు 200

  • ప్రాధమికోన్నత పాఠశాలలు 220


పని గంటలు

  • PS 800

  • UPS 1000


ఒక వారానికి బోధనా గంటలు

  • PS 45

  • UPS 45


ప్రతి ప్రైవేటు పాఠశాల ప్రతి విద్యాసంవత్సరంలో 1వ తరగతి ప్రవేశాల్లో 25% సీట్లు బలహీన వర్గాలవారికి కేటాయించాలి. 

  • వికలాంగులు, అనాథలు, హెచ్ఐవీ బాధితులు, వీధి బాలలు 5%

  • ఎస్సీ బాలలకు - 10%

  • ఎస్టీ బాలలకు 4%

  • వెనుకబడిన బలహీన వర్గాలు 6%


విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పతి 

 1 నుంచి 5వ తరగతి వరకు

  • 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు

  • 61 నుంచి 90 మంది బాలల వరకు ముగ్గురు ఉపాధ్యాయులు

  • 91 నుంచి 120 మంది విద్యార్థుల వరకు నలుగురు

  • 121 నుంచి 200 వరకు ఐదుగురు ఉపాధ్యాయులు

  • 150 మించి విద్యార్థులు ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు

  • 200 మించి విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు కాకుండా ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి


6 నుంచి 8వ తరగతి వరకు

  • ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కింది అంశాలకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.

  • విజ్జానశాస్త్రం, లెక్కలు, 2. సామాజిక శాస్త్రం 3.భాషలు

  • ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధాయ్యు డు ఉండాలి.

  • బడిలో చేర్చుకున్న విద్యార్థుల సంఖ్య 100కు మించితే పూర్తికాల ప్రధానోపాధ్యాయుడితోపాటు

  • 1. చిత్రకళ, 2. ఆరోగ్యం, వ్యాయామ విద్య

  • వృత్తి విద్యలకు పార్ట్‌టైం బోధకులు ఉండాలి

  • ప్రతి టీచర్‌కు ఒక తరగతి గది ఉండాలి


మాదిరి ప్రశ్నలు 

1. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు 89 అయితే, విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి?

1) ఆరుగురు 2) ఐదుగురు 3) ముగ్గురు 4) ఇద్దరు


2. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం పాఠశాలలో వారానికి ఉపాధ్యాయుడు పనిచేయాల్సిన పనిగంటలు?

1) సంసిద్ధతా సమయాన్ని కలుపుకొని 40 బోధనా గంటలు

2) సంసిద్ధతా సమయాన్ని కలుపుకొని 45 బోధనా గంటలు

3) సంసిద్ధతా సమయాన్ని మినహాయించుకొని 45 బోధనా గంటలు

4) సంసిద్ధతా సమయాన్ని మినహాయించి 40 బోధనా గంటలు


3. విద్యాహక్కు చట్టం-2009 ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?

1) 2009, మార్చి 10 2) 2009, ఏప్రిల్ 10

3) 2009, ఏప్రిల్ 1 4) 2009, మార్చి 1


4. ఆర్టీఈ-2009 Sec-10 ప్రకారం?

1) తల్లిదండ్రులు 6-14 ఏండ్ల వయస్సున్న తమ పిల్లలను విధిగా బడిలో చేర్పించాలి

2) ఉపాధ్యాయులు చేర్పించాలి

3) స్థానిక సర్పంచ్ చేర్పించాలి 4) అధికారులు చేర్పించాలి


5. ఆర్టీఈ-2009 కింది ఏ సమూహపు పిల్లలకు వర్తిస్తుంది?

1) 0-14 ఏండ్లు 2) 6-14 ఏండ్లు

3) 5-16 ఏండ్లు 4) 1-16 ఏండ్లు


6. ఆర్టీఈ-2009, Sec-29 సూచించేది?

1) విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే పాఠ్య ప్రణాళిక రూపొందించడం

2) నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టడం

3) బాలల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించడం 4) పైవన్నీ


7. ఆర్టీఈ-2009 విధికానిది?

1) జనన ధ్రువీకరణ పత్రం లేకున్నా బడిలో చేర్చుకోవాలి

2) క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు

3) విద్యా సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా చేర్చుకోవాలి

4) హాజరు ఉండి అనుత్తీర్ణుడైతే అదే తరగతిలో కొనసాగించాలి


Practice Test


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.