భాష - మూల్యాంకన మార్గదర్శకాలు
ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (FLS) SCERT వెబ్‌సైట్
ITEM BANK ఇవ్వబడినది. దీనితో పాటు పిల్లలు సాధించిన సామర్థ్యాలను మదింపు చేయుట కోసం మాదిరి ప్రశ్న పత్రము కూడా ఇవ్వబడినది.
ఇందులో రెండు రకాలుగా పరీక్షిస్తారు.
1) మౌఖిక పరీక్ష (oral test);
ఒక్కొక్క విద్యార్థిని పిలిచి పరీక్షించేది.
2) రాత పరీక్ష(written test);
ఒక్కొక్క విద్యార్థికి ప్రశ్నాపత్రం ఇచ్చి పేపర్ పై సమాధానాలు రాయించవచ్చు. లేదా బోర్డు పై ప్రశ్నలు రాసి తరగతిలోని పేపర్ పై విద్యార్థులచే ఒకే సారి రాయించవచ్చు.
(తరగతిలో ఒక్కొక్క విద్యార్థిని పరీక్షిస్తూ విద్యార్థులను చేయగలిగే వారు ఇంకా చేయలేని వారు గా రెండు రకాలుగా గుర్తించి తిరిగి లోప నివారణ అభ్యాసం చేయించవలసి వుంటుంది.)
ఈ ప్రశ్నా పత్రం ద్వారా మూల్యాంకనం చేయుటకై కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి.
> ప్రశ్నా పత్రం లో మొత్తం 9 ప్రశ్నలు ఇచ్చారు.అవి
1. మౌఖిక భాషావగాహన :
- ఇందులో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి (చిత్రములతో, వాక్యాలతో కూడినవి)
- ఉపాధ్యాయుడు వాక్యాన్ని చదువాలి. విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన వాక్యాన్ని విని అర్ధం చేసుకొని దానికి సరిపడు చిత్రాన్ని ఎన్నుకొని వేలితో చూపాలి. దీనికి గరిష్టంగా 1 నిముషం సమయం ఇవ్వబడినది.
- ఒక వేళ 1 నిముషంలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక చిత్రానికి వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి కనీసం 4 వాక్యాలను సరైన చిత్రాలతో జతపరిచినట్లయితే చేయగలిగే వారుగా లేనిచో చేయలేనివారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
2. ధ్వని గుర్తింపు :
- ఇందులో మొత్తం 12 పదాలు ఉంటాయి (1-6 పదాల కు మొదటి అక్షరం ధ్వనిని, 7-12 పదాలకు చివరి అక్షరం యొక్క ధ్వనిని గుర్తించడం)
- ఉపాధ్యాయుడు పదాలను చదువాలి. విద్యార్థి, ఉపాధ్యాయుడు చెప్పిన పదాలను విని అడిగిన అక్షరం యొక్క ధ్వనిని గుర్తించి చెప్పాలి.. దీనికి గరిష్టంగా 5 సెకండ్లు సమయం ఇవ్వబడినది.
- ఒక వేళ 5 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక పదానికి వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి కనీసం 10 పదాలకు సరైన సమాధానాలు ఇస్తే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
3. ధ్వని గుర్తింపు ద్వారా అక్షరాలను చదువడం :
- ఇందులో మొత్తం 100 అక్షరాలు ఉంటాయి
- విద్యార్థి అక్షరాలను చదువాలి.
- ఒక వేళ 5 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక అక్షరానికి వెళ్లాల్సివుంటుంది.
- కనీసం 80 అక్షరాలు సరిగా చదివితే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
- విద్యార్థి వరుసగా 10అక్షరాలు సరిగా చదువలేకపోయినా చేయలేనివారుగా గుర్తించాలి.
4. డీకోడింగ్ ( పదాలు సరిగ్గా చదువడం)
- ఇందులో మొత్తం 50 పదాలు ఉంటాయి
- విద్యార్థి పదాలను చేతి వేలితో చూపుతూ చదువాలి.
- ఒక వేళ 5 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక పదానికి వెళ్లాల్సివుంటుంది.
- కనీసం 40 పదాలను సరిగా చదివితే చేయగలిగే వారుగా గుర్తించాలి.
- కనీసం 40 పదాలను సరిగా చదువ లేనిచో చేయలేని వారుగా గుర్తించాలి. వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
- విద్యార్థి వరుసగా 5 పదాలు సరిగా చదువలేకపోయినా చేయలేనివారుగా గుర్తించాలి.
5. డీకోడింగ్ (అర్థ రహిత పదాలు సరిగ్గా చదువడం)
- ఇందులో మొత్తం 50 పదాలు ఉంటాయి.
- విద్యార్థి పదాలను చేతి వేలితో చూపుతూ చదువాలి.
- ఒక వేళ 5 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక పదానికి వెళ్లాల్సివుంటుంది.
- కనీసం 40 పదాలను సరిగా చదివితే చేయగలిగే వారుగా గుర్తించాలి.
- కనీసం 40 పదాలను సరిగా చదువ లేనిచో చేయలేని వారుగా గుర్తించాలి. వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
- విద్యార్థి వరుసగా 5 పదాలు సరిగా చదువలేకపోయినా చేయలేనివారుగా గుర్తించాలి.
6. చదువడం -అవగాహన చేసుకోవడం
- ఇందులో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి (చిత్రములతో, వాక్యాలతో కూడినవి )
- విద్యార్థి చిత్రం పై ఉన్న వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దానికి సరిపడు చిత్రాన్ని ఎన్నుకొని వేలితో చూపాలి. దీనికి గరిష్టంగా 1 నిముషం సమయం ఇవ్వబడినది.
- ఒక వేళ 1 నిముషంలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక చిత్రానికి వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి కనీసం 4 వాక్యాలను సరైన చిత్రాలతో జతపరిచినట్లయితే చేయగలిగే వారుగా గుర్తించాలి .
- విద్యార్థి కనీసం 4 వాక్యాలను సరైన చిత్రాలతో జతపరచ లేనిచో చేయలేనివారుగా గుర్తించాలి. వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
7. ధారాళంగా చదువడం మరియు అవగాహన చేసుకోవడం
భాగం-7 A
- ఇందులో ఒక చిన్న కథ ఇవ్వబడినది.
- విద్యార్థి కథలో నున్న వాక్యాలను ధారాళంగా చదువాలి. వాక్యాలలోని పదాలను వేలితో చూపుతూ వినపడేలా చదువాలి.
- ఏదైనా ఒక పదం చదువలేకపోతే ముందు పదానికి వెళ్ళి చదువవచ్చు.. దీనికి గరిష్టంగా 1 నిముషం సమయం ఇవ్వబడినది. 1 నిముషంలో ఎక్కడి వరకు చదివారో మార్కు తో గుర్తించండి.
- ఒకవేళ 1 నిముషంలో విద్యార్థి చదువలేకపోయినా (మార్కు చేసిన తరారువాత ) కూడా విద్యార్థికి ఆ కథను పూర్తిగా చదువడానికి అవకాశం ఇవ్వాలి. (కథను అవగాహన చేసుకొనే అవకాశం ఇవ్వాలి కాబట్టి)
- విద్యార్థి 1 నిముషంలో ఏయే పదాలను చదువలేకపోయారో వాటిని గుర్తించి మార్కు చేయండి.
- దోషాలు 4 కు మించకుండా కథను 1 నిముషంలో చదివితే ఆ విద్యార్థిని చదువగలిగే వారుగా గుర్తించాలి.
- విద్యార్థి సరిగ్గా పదాలను చదువలేకపోయినా ఆ పదా లలోని అక్షరాలను విడగొడుతూ మెల్లిగా చదివినా కూడా ఆ విద్యార్థిని చదువలేనివారుగా గుర్తించాలి.
- వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
భాగం-7 B
- విద్యార్థి పైన ఇచ్చిన మొత్తం కథను చదువాలి.
- ఉపాధ్యాయుడు ఆ కథను ఆధారంగా విద్యార్థి అవగాహనను పరీక్షిస్తాడు.
- ఇందులో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి.
- విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నను అర్ధం చేసుకొని దానికి సరిపడు సమాధానాన్ని చెప్పాలి. దీనికి గరిష్టంగా 15 సెకండ్లు సమయం ఇవ్వబడినది.
- ఒక వేళ 15 సెకండ్లు సమయం లో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక ప్రశ్నకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి కనీసం 4 ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తే చేయగలిగే వారుగా గుర్తించాలి.
- విద్యార్థి కనీసం 4 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేక పోయినచో చేయలేనివారుగా గుర్తించాలి. వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
8. ధారాళంగా చదువడం మరియు అవగాహన చేసుకోవడం
భాగం-8A
- ఇందులో ఒక చిన్న కథ ఇవ్వబడినది.
- విద్యార్థి కథలో నున్న వాక్యాలను ధారాళంగా చదువాలి. వాక్యాలలోని పదాలను వేలితో చూపుతూ వినపడేలా చదువాలి.
- ఏదైనా ఒక పదం చదువలేకపోతే ముందు పదానికి వెళ్ళి చదువవచ్చు.. దీనికి గరిష్టంగా 1 నిముషం సమయం ఇవ్వబడినది. 1 నిముషంలో ఎక్కడి వరకు చదివారో మార్కు తో గుర్తించండి.
- ఒకవేళ 1 నిముషంలో విద్యార్థి చదువలేకపోయినా (మార్కు చేసిన తరారువాత ) కూడా విద్యార్థికి ఆ కథను పూర్తిగా చదువడానికి అవకాశం ఇవ్వాలి. (కథను అవగాహన చేసుకొనే అవకాశం ఇవ్వాలి కాబట్టి)
- విద్యార్థి 1 నిముషంలో ఏయే పదాలను చదువలేకపోయారో వాటిని గుర్తించి మార్కు చేయండి.
- దోషాలు 4 కు మించకుండా కథను 1 నిముషంలో చదివితే ఆ విద్యార్థిని చదువగలిగే వారుగా గుర్తించాలి.
- విద్యార్థి సరిగ్గా పదాలను చదువలేకపోయినా ఆ పదా లలోని అక్షరాలను విడగొడుతూ మెల్లిగా చదివినా కూడా ఆ విద్యార్థిని చదువలేనివారుగా గుర్తించాలి.
- వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
భాగం-8B
- విద్యార్థి పైన ఇచ్చిన మొత్తం కథను చదువాలి.
- ఉపాధ్యాయుడు ఆ కథను ఆధారంగా విద్యార్థి అవగాహనను పరీక్షిస్తాడు.
- ఇందులో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి.
- విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నను అర్థం చేసుకొని దానికి సరిపడు సమాధానాన్ని చెప్పాలి. దీనికి గరిష్టంగా 15 సెకండ్లు సమయం ఇవ్వబడినది.
- ఒక వేళ 15 సెకండ్లు సమయం లో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక ప్రశ్నకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి కనీసం 4 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే చేయగలిగే వారుగా గుర్తించాలి. అలా 4 సరైన సమాధానాలు ఇవ్వలేక పోయినచో చేయలేనివారుగా గుర్తించాలి. వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
9. రాయడం
- ఇందులో ఒక చిత్రం ఇవ్వబడినది. ఆ చిత్రాన్ని విద్యార్థి కి చూపించాలి.
- విద్యార్థి ఆ చిత్రాన్ని అవగాహన చేసుకొని అందులో గమనించిన అంశాల ఆధారంగా కనీసం మూడు సరైన వాక్యాలు రాయాలి.
- విద్యార్థి వాక్యాలను పూర్తిగా అర్ధవంతంగా, దోషాలు లేకుండా, విరామ చిహ్నాలను ఉపయోగించి రాస్తే చేయగలిగేవారుగా గుర్తించాలి. లేనిచో చేయలేనివారుగా గుర్తించి వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.

Please give your comments....!!!