గణితం - మూల్యాంకన మార్గదర్శకాలు
ఈ ప్రశ్నా పత్రం ద్వారా మూల్యాంకనం చేయుటకై కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి.
ప్రశ్నా పత్రం లో మొత్తం 9 ప్రశ్నలు ఇచ్చారు. అవి
1. సంఖ్యలను గుర్తించి చదువడం: (మౌఖిక పరీక్ష)
- ఇందులో మొత్తం 24 సంఖ్యలు ఉంటాయి. (సంఖ్యలు 0 నుండి 9999 వరకు)
- ఒక్కొక్క విద్యార్థి సంఖ్యలను వేలితో చూపుతూ చదువాలి. దీనికి గరిష్టంగా 5 సకండ్లు సమయం ఇవ్వబడినది.
- ఒక వేళ 5 సెకండ్లు లోపు విద్యార్థి సంఖ్యలను వేలితో చూపుతూ చదువలేకపోతే వెంటనే మరొక సంఖ్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి మొత్తం 24 సంఖ్యలలో 19 నుండి 20 సంఖ్యలు చదువగలిగితే చేయగలిగినవారుగా గుర్తించాలి. 19 సంఖ్యల కన్నా తక్కువ చదివితే చేయలేని వారుగా గుర్తించాలి. వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
- విద్యార్థి వరుసగా 4 సంఖ్యలను సరిగా చదువలేకపోతే చేయలేనినవారుగా గుర్తించాలి. వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
2. సంఖ్యలను పోల్చడం; (మౌఖిక పరీక్ష)
- ఇందులో మొత్తం 14 సంఖ్యల జతలు ఉంటాయి. (0 నుండి 9999 సంఖ్యల వరకు)
- ప్రతీ సంఖ్యల జతలో ఏ సంఖ్య పెద్దది? ఏది చిన్నది? అని ఉపాధ్యాయుడు ఎలా అడిగితే దానికి సరైన సమాధానం విద్యార్థి ఇవ్వాలి.
- దీనికి గరిష్టంగా 5 -10 సెకండ్లు సమయం ఇవ్వబడినది.
- ఒక వేళ 5-10 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సంఖ్యల జత కు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి కనీసం 11 సంఖ్యల జతలకు సరైన సమాధానాలు ఇస్తే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
3. కూడిక మరియు తీసివేత లకు సమబంధించిన సంఖ్యాత్మక సమస్యలు. :
- ఇందులో మొత్తం 8 సమస్యలు ఉంటాయి. (1 నుండి 9999 వరకు ఫలితం వచ్చేవి)
- విద్యార్థి వీటికి మౌఖికంగా లెక్కించి సమాధానాలు ఇవ్వవచ్చు లేదా పేపరు పై సమస్యలు సాధించి చూపవచ్చు.
- ఒక వేళ 15 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- కనీసం 7 సమస్యలు సాధించినట్లయితే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
4. కూడిక మరియు తీసివేత లకు సమబంధించిన నిజ జీవిత (పద సమస్యలు) సమస్యలు. :
- ఇందులో మొత్తం 6 సమస్యలు ఉంటాయి. (1 నుండి 999 వరకు ఫలితం వచ్చేవి)
- విద్యార్థి పేపరు పై సమస్యలు సాధించి చూపవచ్చు. (బోర్డు పై రాసి విద్యార్థులచే పేపర్ పై చేయించవచ్చు).
- విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- కనీసం అన్ని (6) సమస్యలు సాధించినట్లయితే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
5. గుణకారం మరియు భాగాహారం కు సంబంధించిన (సంఖ్యాత్మక మరియు పద సమస్యలు)
సమస్యలు. :
భాగం-5 A
- ఇందులో మొత్తం 4 గుణకార పట్టికలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.
- విద్యార్థి పేపరు పై సమస్యలు సాధించి చూపవచ్చు. (బోర్డు పై రాసి విద్యార్థులచే పేపర్ పై చేయించవచ్చు).
- విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి 4 (అన్నీ )సమస్యలు సాధించినట్లయితే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
భాగం-5 B
- ఇందులో మొత్తం 4 భాగహారమునకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.
- విద్యార్థి పేపరు పై సమస్యలు సాధించి చూపవచ్చు. (బోర్డు పై రాసి విద్యార్థులచే పేపర్ పై చేయించవచ్చు).
- విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి 4 (అన్నీ )సమస్యలు సాధించినట్లయితే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
6. కొలతలు మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు;
భాగం-6 A
- ఇందులో మొత్తం 3 సమస్యలు ఉంటాయి.
- విద్యార్థి మౌఖికంగా /పేపరు పై సమస్యలు సాధించి చూపవచ్చు. (బోర్డు పై రాసి విద్యార్థులచే పేపర్ పై చేయించవచ్చు).
7. భిన్నాలు
- (విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి ) ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి 3 (అన్నీ )సమస్యలు సాధించినట్లయితే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
భాగం-6 B
- ఇందులో మొత్తం 3 సమస్యలు ఉంటాయి.
- విద్యార్థి మౌఖికంగా / పేపరు పై సమస్యలు సాధించి చూపవచ్చు. (బోర్డు పై రాసి విద్యార్థులచే పేపర్ పై చేయించవచ్చు).
- (విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి) ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి 3 (అన్నీ )సమస్యలు సాధించినట్లయితే చేయగలిగే వారుగా, లేనిచో చేయలేని వారుగా గుర్తించి, వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి
భిన్నాలు (సగం 1/2, పావు 1/4, ముప్పావు 3/4 )
భాగం-7 A
- ఇందులో 3 ప్రశ్నలు ఉంటాయి.
- అడిగిన భిన్నమునకు సమానంగా చిత్రం లో భాగమునకు రంగు వేయడం లేదా షేడ్ చేసి చూపాలి.
- (విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి) ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే చేయగలిగినవారుగా గుర్తించాలి. లేనిచో చేయలేనివారుగా గుర్తించి వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
- ఇందులో పై వాటితో పాటు ఇంకా 3 ప్రశ్నలు ఉంటాయి.
- చిత్రములో షేడ్ చేయబడిన భాగమునకు సమానంగా భిన్నము ను రాసి చూపాలి.
- (విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి) ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే చేయగలిగినవారుగా గుర్తించాలి. లేనిచో చేయలేనివారుగా గుర్తించి వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
8. నమూనాలు మరియు అమరికలు (సంఖ్యలు మరియు అకారాలతో అమరికలు)
- ఇందులో 8 ప్రశ్నలు ఉంటాయి.
- సంఖ్యలు మరియు ఆకారాలతో అమరికలను పరిశీలింప చేసి వాటిని కొనసాగించమనాలి.
- (విద్యార్థి ప్రశ్నలు రాసుకున్న తరువాత నుండి ) ఒక్కొక్క సమస్య సాధనకు 15-20 సెకండ్లలో విద్యార్థి సమాధానం ఇవ్వలేకపోతే వెంటనే మరొక సమస్యకు వెళ్లాల్సివుంటుంది.
- విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే చేయగలిగినవారుగా గుర్తించాలి. లేనిచో చేయలేనివారుగా గుర్తించి వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.
9. దత్తాంశ నిర్వహణ
- ఇందులో ఒక పట చిత్రం ( pictograph ) ఇవ్వబడినది. దాని ఆధారంగా 6 ప్రశ్నలు ఉంటాయి.
- పట చిత్రం లోని దత్తాంశమును విద్యార్థి అవగాహన చేసుకొని అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి.
- విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే చేయగలిగినవారుగా గుర్తించాలి. లేనిచో చేయలేనివారుగా గుర్తించి వారికి తిరిగి అభ్యాసం కల్పించాలి.

Please give your comments....!!!