Type Here to Get Search Results !

Local Body Elections ( MPTC, ZPTC, Surpanch ) Modules


(toc)=Main Topics

1. పోలింగ్ స్టేషను లోనికి ప్రవేశించడానికి అర్హతగల వ్యక్తులు:


1.1. మీ పోలింగ్ స్టేషన్కు కేటాయించిన ఓటర్లతో పాటుగా, పోలింగ్ స్టేషన్ లోనికి ఈ క్రింది వ్యక్తులను మాత్రమే అనుమతించాలి.

2. పోలింగ్ అధికారులు

໖. ప్రతి అభ్యర్థి, అతని ఎన్నికల ఏజెంట్ మరియు ప్రతి అభ్యర్థి యొక్క ఒక్క పోలింగ్ ఏజెంట్ మాత్రమే.

2. ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు.

๕. ఎన్నికల విధులతో సంబంధమున్న ఉద్యోగులు.

२. ఎన్నికల సంఘం నియమించిన పర్యవేక్షకులు.

ఎఫ్. ఓటరుతో పాటు ఎత్తుకున్న చిన్న పిల్లలు.

2. సహాయం లేకుండా కదలలేని కంటి చూపు లేని లేదా అశక్తత గల ఓటరుకు సహాయం చేసే వ్యక్తి.

హెచ్. అవసరమైనపుడు ఓటర్లను గుర్తించే నిమిత్తం లేదా ఎన్నికలలో మీకు సహాయం నిమిత్తం ప్రిసైడింగ్ అధికారి అనుమతితో ఏర్పాటు చేసుకున్న ఇతర వ్యక్తులు.

1.2. "ఎన్నికల విధులపై ఉన్న ఉద్యోగులు" అంటే పోలిస్ అధికారులు అని మాత్రం కాదు. శాంతి భద్రతలు లేదా ఇతర కారణాలతో మీరు పిలిస్తే తప్ప యూనిఫారం లేదా మామూలు దుస్తులు ఉన్న అట్టి పోలిసు అధికారులను పోలింగ్ బూతులోనికి అనుమతించరాదు. బలమైన కారణం లేనిదే పోలింగ్ బూతులోనికి వారిని అనుమతిస్తే అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లపై పోలీసులు అనవసర జులుం చూపారనే ఫిర్యాదులకు ఆస్కారం ఉంటుంది.

1.3. అదే విధంగా, ఓటరు లేదా అభ్యర్థితో పాటు వచ్చే భద్రతా సిబ్బందిని కూడా పోలింగ్ స్టేషన్లోనికి అనుమతించకూడదు. (భద్రత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నికల ఏజెంటు లేదా పోలింగ్ ఏజెంటుగా కూడా నియమించకూడదు).

1.4. # ఎన్నికలతో సంబంధించిన విధిపై ఉన్న ఉద్యోగులు" అనే ఈ వాక్యంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ఉప మంత్రులు చేరి ఉండరు. వారిని ఎన్నికల ఏజెంట్లుగా లేదా పోలింగ్ ఏజెంట్లుగా కూడా భద్రతా కారణాల దృష్ట్యా అనుమతించకూడదు.


పోలింగ్ అధికారుల విధులు:



మొదటి పోలింగ్ అధికారి:-


ఓటరు జాబితా మార్కుడ్ కాపీకి, ఓటర్ల గుర్తింపు కోసం మొదటి పోలింగ్ అధికారి ఇన్ చార్జీగా బాధ్యత కలిగి ఉంటారు. పోలింగ్ స్టేషన్లో ప్రవేశించిన తర్వాత, ఓటరు మొదటి పోలింగ్ అధికారి వద్దకు నేరుగా వెళ్ళాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తూ ఓటరును గుర్తించి అతను సంతృప్తి చెందాలి. ఓటరు జాబితా మార్కుడ్ కాపీ నిర్వహణకు కూడా ఆయన ఇన్ చార్జీగా ఉంటారు.

2.2. రెండవ పోలింగ్ అధికారి:-


(i) రెండవ పోలింగ్ అధికారి చెరగని సిరాకు ఇన్ చార్జిగా ఉంటారు. ఓటరు ఎడమ చూపుడు వ్రేలును ఆయన పరిశీలించి ఏదేని గుర్తు లేదా చెరగని సిరా మరక లేదని నిర్ధారించుకున్న తర్వాత, బ్రెష్ సహాయంతో ఒక రేఖగా ఎడమ చూపుడు వేలు గోరు పై చివరి నుంచి మొదటి కీలు వరకు చెరగని సిరాతో మార్క్ చేయాలి.

(ii) ఓటరు గుర్తింపు జరిగిన వెంటనే, పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి ఓటరుకు బ్యాలెట్ పేపర్ జారీ చేయడం కోసం కూడా రెండవ పోలింగ్ అధికారి ఇన్ చార్జీగా ఉంటారు. బ్యాలెట్ పేపరు కౌంటరాఫాయిల్ పై ప్రతి ఓటరు యొక్కసంతకం లేదా వ్రేలిముద్రను ఆయన తీసుకోవాలి.

2.3. మూడవ పోలింగ్ అధికారి:-


బ్యాలెట్ పేపరును మార్క్ చేయడం కోసం బాణం గుర్తు గల రబ్బర్ స్టాంపులకు మూడవ పోలింగ్ అధికారి ఇన్ చార్జీగా ఉంటారు. ఓటరు నుండి ఆయన బ్యాలెట్ పేపరును తీసుకొని రెండుసార్లు మడవవలసి ఉంటుంది. మొదట పొడవుగా ఆ తర్వాత సమాంతరంగా బ్యాలెట్ పేపరు వెనుక కుడివైపు పై చివరి భాగాన గల గుర్తింపు మార్క్ (డిస్టింగ్యుష్ మార్క్) స్పష్టంగా కనబడే విధంగా మడవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన బ్యాలెట్ పేపర్ మడతలు విడదీసి ఓటరుకు అప్పగించడమవుతుంది. సిరా కలిగిన రబ్బరు స్టాంపును ఆయన ఓటరుకు ఇవ్వడమవుతుంది. ఓటరు ప్రత్యేకించి కోరినట్లయితే, ఖాళీ పేపరుపై ఓటు వేసే పద్దతిని ప్రదర్శించవచ్చును. తదుపరి ఓటింగ్ కంపార్టుమెంటుకు వెళ్ళడానికి ఓటరును కోరడం జరుగుతుంది.

గ్రామ పంచాయతీ ఎన్నికల PO Module 






రిటర్న్ అధికారుల కొరకు ట్రైనింగ్ మాడ్యులర్  ( గ్రామ పంచాయతీ ఎన్నికల )





రిటర్న్ అధికారుల, స్టేజ్ 2 అధికారుల ట్రైనింగ్ మాడ్యులర్ ( MPTC, ZPTC ఎన్నికలు )




Dr తులసి రామ్ రాథోడ్ గారు ప్రిపేర్ చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల లో స్టేజ్ 2 అధికారులకు ఉపయోగ పడే షార్ట్ నోట్స్... 




బ్యాలెట్ బాక్స్ ను తెరవడం, మూయడం, సీల్ చేసే విధానం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.