Vi th Class Telugu All Lessons Kavi Parichayaalu - Vari Rachanalu తెలుగు పాఠాలు - కవి పరిచయాలు - వారి రచనలు6వ తరగతి

తెలుగు పాఠాలు - కవి పరిచయాలు - వారి రచనలు

6వ తరగతి


1. అభినందన:


ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన 'స్వరభారతి' అనే గేయసంకలనం నుండి తీసుకోబడింది.

కవి పరిచయం

శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణభారతహిందీప్రచారసభవారి 'స్రవంతి' పత్రికలో ప్రచురించబడ్డాయి.

2. స్నేహ బంధం 


ఈ పాఠం 'కథ' అనే ప్రక్రియకు చెందినది. విష్ణుశర్మ 'పంచతంత్రం' ఆధారంగా చిన్నయసూరి తెలుగులోనికి అనువదించిన 'మిత్రలాభం'లోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం.

3. వర్షం


ఈ పాఠ్యభాగం 'ఖండకావ్యం' ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యభాగం డా|| పల్లా దుర్గయ్య రచించిన 'పాలవెల్లి' అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది.

కవి పరిచయం

డా॥ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాఙ్మయం తద్వికాసం' అనే అంశంపైను పరిశోధన చేశాడు. 

4. లేఖ

 ఈ పాఠం లేఖ రచన ప్రక్రియ కు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది 

5. శతకాలు


1) సుమతి శతకం - బద్దెన (13వ శతాబ్దం)
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన సుమతి శతకంతోపాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు.

2. శ్రీకాళహస్తీశ్వర శతకం - ధూర్జటి

మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల అస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడ ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతోపాటు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు. 'అతులిత మాధురీమహిమ' కలిగినవాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు.

3. కుమారి శతకం- పక్కి వేంకట నరసింహకవి (17వ శతాబ్దం)

4. సుభాషిత రత్నావళి- ఏనుగు లక్ష్మణకవి (18వ శతాబ్దం)

సంస్కృతంలో భర్తృహరి రాసిన 'సుభాషిత త్రిశతి'ని తెలుగులో అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణకవి ఒకడు. రామేశ్వర మాహాత్యము విశ్వామిత్ర చరిత్రము, గంగామాహాత్మ్యము మొదలైన రచనలు చేశాడు.

5. ప్రభుతనయ శతకం కొకుంట్ల నారాయణరావు 1883-1953

 తనయా! అనే మకుటంతో ఈయన రాసిన 'ప్రభుతనయ శతకం' చాలా ప్రసిద్ధి చెందింది.

6. గాంధీతాత శతకం - శిరశినహల్ కృష్ణమాచార్యులు 13.08.1905 15.04.1992

శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా 'మోర్తాడ్' లో జన్మించాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతోపాటు 'రత్నమాల' అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన 'అభినవ కాళిదాసు' అనే బిరుదుపొందాడు.

7. భరతసింహ శతకం - సూరోజు బాలనరసింహాచారి 9.5.1946 2.2.2014

సూరోజు బాలనరసింహాచారి నల్లగొండజిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందిన డు. కవితాకేతనం, బాలనృసింహశతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజకవి' గా ప్రసిద్ధుడు.

8. భవ్యచరిత శతకం - డాక్టర్ టి.వి. నారాయణ

డా|| టి.వి. నారాయణ హైద్రాబాద్ జిల్లాకు చెందినవాడు. 26.07.1925 లో జన్మించిన ఈయన జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితానంపుటి) అమరవాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాససంపుటి) మొదలైనవి ఈయన రచనలు.

6. పోతన బాల్యం 

ఈ పాఠం 'కావ్య' ప్రక్రియకు చెందినది. మహాకవి పోతన జీవితం ఆధారంగా డా॥వానమామలై వరదాచార్యులు రచించిన 'పోతన చరిత్రము' అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది.

కవి పరిచయం

డా॥ వానమామలై వరదాచార్యులు. అభినవపోతన, అభినవకాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తివైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయేకొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి) మొదలైన గ్రంథాలు రచించాడు. 

7. ఉడుత సాయం


పార్యభాగ వివరాలు

ఈ పాఠం 'ద్విపద' ప్రక్రియకు చెందినది. ఈ పాఠం 'రంగనాథ రామాయణం' లోని 'యుద్ధకాండ' లోనిది

కవి పరిచయం

గోన బుద్దారెడ్డ 13వ శతాబ్దివాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు. తన తండ్రిపేరిట 'రంగనాథ రామాయణం' యుద్దకాండ వరకు ఇతడు రాయగామిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు పూర్తిచేశారు. ఇదితెలుగులో తొలి రామాయణం. 

8. చెరువు


ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందినది. ఇది ఉత్తమపురుష కథనంలో ఉంటుంది.

9. చీమల బారు


ఈ పాఠ్యభాగం 'గేయ కవిత' అనే సాహిత్య ప్రక్రియకు చెందినది ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన 'ఆత్మవేదన' కవితాసంపుటి లోనిది.

కవి పరిచయం

పొట్లపల్లి రామారావు . ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైనకవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం (ఖండికలు), పగ మున్నగు రచనలు
చేశాడు. ఈయన రచించిన 'జైలు' కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది

11. పల్లెటూరి పిల్ల గాడా ఈ పాఠం 'పాట' అనే ప్రక్రియకు సంబంధించినది. 'పల్లెటూరి పిల్లగాడ' అనే పాటల సంకలనం లోనిది.


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts