శతకాలు - శతక కర్త లు
శతకాలు నైతికవిలువలను పెంపొందింప జేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ, విద్యార్థు లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ శతకాలు ఉద్దేశం.
శతక ప్రక్రియకు చెందినది. శతకం నూరు/నూటికిపైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతకపద్యాలలో పద్యానికి 'మకుటం' ఉంటుంది. ఇవి 'ముక్తకాలు'. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.
1. దాశరథి శతకం -
కంచెర్ల గోపన్న. రామదాసుగా పేరుపొందిన కంచెర్ల గోపన్న 'దాశరథీ కరుణాపయోనిధీ' అన్న మకుటంతో శతకాన్ని రాసి, భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మంజిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.
2. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం-
కాకుత్సం శేషప్పకవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం, ఈయన రచనలు
3. వేమన శతకం
- వేమన, సహజకవిగా ప్రసిద్ధిపొందాడు. కడపజిల్లాకు చెందిన ఈయన పద్యాలలో - నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత.
4. నగ్నసత్యాలు శతకం-
రావికంటి రామయ్యగుప్త. 'కవిరత్న' ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు, వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.
5. శ్రీశ్రీనివాస బొమ్మల శతకం
డా॥ అదెపు చంద్రమౌళి. ఈయన బిరుదు 'కవిశశాంక'. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం (పద్యకావ్యం) రచించాడు.
6. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం -
శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య. ఈయన 'యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!' అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు.
9. సుమతి శతకం - బద్దెన (13వ శతాబ్దం)
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన సుమతి శతకంతోపాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు.
10. శ్రీకాళహస్తీశ్వర శతకం - ధూర్జటి
మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల అస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడ ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతోపాటు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు. 'అతులిత మాధురీమహిమ' కలిగినవాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు.
11. కుమారి శతకం-
పక్కి వేంకట నరసింహకవి (17వ శతాబ్దం)
12. సుభాషిత రత్నావళి- ఏనుగు లక్ష్మణకవి (18వ శతాబ్దం)
సంస్కృతంలో భర్తృహరి రాసిన 'సుభాషిత త్రిశతి'ని తెలుగులో అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణకవి ఒకడు. రామేశ్వర మాహాత్యము విశ్వామిత్ర చరిత్రము, గంగామాహాత్మ్యము మొదలైన రచనలు చేశాడు.
13. ప్రభుతనయ శతకం
కొకుంట్ల నారాయణరావు 1883-1953
తనయా! అనే మకుటంతో ఈయన రాసిన 'ప్రభుతనయ శతకం' చాలా ప్రసిద్ధి చెందింది.
14. గాంధీతాత శతకం -
శిరశినహల్ కృష్ణమాచార్యులు 13.08.1905 15.04.1992
శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా 'మోర్తాడ్' లో జన్మించాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతోపాటు 'రత్నమాల' అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన 'అభినవ కాళిదాసు' అనే బిరుదుపొందాడు.
15. భరతసింహ శతకం -
సూరోజు బాలనరసింహాచారి 9.5.1946 2.2.2014
సూరోజు బాలనరసింహాచారి నల్లగొండజిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందిన డు. కవితాకేతనం, బాలనృసింహశతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజకవి' గా ప్రసిద్ధుడు.
16. భవ్యచరిత శతకం
డా|| టి.వి. నారాయణ హైద్రాబాద్ జిల్లాకు చెందినవాడు. 26.07.1925 లో జన్మించిన ఈయన జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితానంపుటి) అమరవాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాససంపుటి) మొదలైనవి ఈయన రచనలు.
17. నారాయణ శతకం :
'నారాయణా!' అన్నమకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నలి. దీనిని ప్రోతస్త్రీ రాశాడు. ఇతడు వరంగట జిల్లా బమ్మెరవాసి, ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం రాశాడు.
18. చిత్త శతకం
శ్రీవతిఖాస్కర కవి 'చిత్తమా!' అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒక్కరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం.
19. భాస్కర శతకం :
(మారద వెంకయ్య) భాస్కరా!' అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.
20. విశ్వకర్మ శతకం : 'విశ్వపాలన ధర్మ! శ్రీ విశ్వకర్మ!' అనే మకుటంతో పండిత రామసింహకవి 'విశ్వకర్మ' శతకాన్ని రాశాడు. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘనపట్నం నాని. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రను ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు,
21 . శ్రీవేంకటేశ్వర శతకం :
నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు 'వేంకటేశ్వరా!- అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన 'విద్వత్ కవి'గా ప్రసిద్ధి పొందాడు.
22. శ్రీ బాకవరాంజనేయ శతకం :
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసియైన వేంకటరావు పంతులు, తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై 'బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!' అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు.
0 Comments
Please give your comments....!!!