Psychology Scientist Short Description in Telugu

🎯 *TET/DSC SPECIAL*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*🧑‍🏫మనో విజ్ఞాన శాస్త్రవేత్తల పరిచయం*

*♦️సోక్రటీస్ (Socretes 469-399 B.C)*

అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదట ప్రయత్నం చేసిన వారిలో |సోక్రటీస్ / చెప్పదగినవాడు. ఆత్మలో జ్ఞానం (బుద్ధి) ఇమిడి ఉన్నదనీ, అది అంతర్గతంగా, నిగూఢంగా ఉంటుందనీ, దాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకొని రావచ్చునని తెలిపాడు.

*♦️ప్లాటో (Plato) (427 - 347 BC)*

సోక్రటీస్ శిష్యులలో పేరొందినవాడు ప్లాటో. అతడు 'మనస్సు' మెదడులోనూ, ‘ఇచ్ఛ' హృదయంలోనూ, 'తృష్ణ' లేదా 'వాంఛలు' ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయ పడ్డాడు. ప్లాటో ప్రకారం విద్య అనేది వ్యక్తిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం. తాను నిర్మించుకొన్న "జిమ్నాషియా' అనే పాఠశాలలో మంచి భాష, మంచి అలవాట్లు, మంపై పై అందం, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలు ప్రవేశపెట్టాడు.

*♦️అరిస్టాటిల్ (Aristotle)*

ప్లాటో ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడైతే, అరిస్టాటిల్ దానికి జీవం పోశాడు. అరిస్టాటిల్, మనస్సును రెండు భాగాలుగా గుర్తించాడు. అవి 
1. నిష్క్రియాత్మక మైనది,
 2. క్రియాత్మకమై నది.

నిష్క్రియాత్మకమైన మనస్సు ఏమీ రాయనటువంటి నల్లబల్ల లాంటిది దీన్నే *'టాబ్యులారసా'* (tabularasa) అన్నాడు. చిన్నపిల్లల మనస్సు ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి మనస్సుపై పరిసరాలలోని ఉద్దీపనలవల్ల జ్ఞానేంద్రియాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల గుర్తులు లేదా ముద్రలు ఏర్పడతాయి. ఈ గుర్తులే (impressions) భావాలకు,
ఆలోచనలకు, స్మృతికి (memory) మూలాధారం. మనస్సులోని రెండో భాగం క్రియాత్మక మైంది. ఇది వ్యక్తిని చైతన్యపరుస్తుంది. కృత్యాలు చేయడానికి ప్రేరణను ఇస్తుంది. మానసిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

తన అభిప్రాయాలను, ఆలోచనలను గ్రంథస్థం చేశాడు. అవి- - 
1.డి ఆనిమా (De Anima),
 2. పార్వతురాలియా (Parvathuralia), 
3. ఎథిక్స్ (Ethics), 
4. పాలిటిక్స్ (Politics) మొదలై నవి. 

*♦️సెయింట్ అగస్టీన్ (St. Agustin)*

మనస్సు కొన్ని శక్తుల సముదాయమనీ, మానసిక అనుభవాలను, స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చని సెయింట్ అగస్టీన్ అభిప్రాయపడ్డాడు. ఇతడు రూపొందించిన అంతః పరిశీలనాపద్ధతి (introspection) ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చని వ్యక్తపరచాడు. ఇతని పాండిత్యవాదం- విద్యా విధానంలో కంఠత పెట్టడం, మానసిక, శారీరక విషయాలలో శిక్షణ ఇవ్వడం, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం (Exercise) ద్వారా పెంపొందించడం మొదలైన పద్ధతులకు ఆధారభూతమైంది.

*♦️రూసో (Rousseau)*

ఇతడు విద్యా తత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఫ్రాన్స్ దేశస్థుడు. రూసో ప్రతిపాదించిన ప్రకృతివాదం (Naturalism) విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది.

మానవులంతా జన్మతః మంచివారేనని, నాగరికత, పట్టణవాసం మానవుణ్ణి మలినపరుస్తుందని ఇతని వాదం.

ప్రకృతిలోకి తిరిగి పోదాం (Go back to nature) అనేది ఇతని నినాదం. రూసో రూపొందించిన గ్రంథం పేరు *'ఎమిలీ.* ఈ గ్రంథం ద్వారా విద్యారంగంలో 'స్వయం ప్రేరణ పద్ధతులు', 'అనుభవం ద్వారా విద్య' ఉండాలని ప్రతిపాదించాడు. విద్యాతత్వవేత్తల ప్రయోగాలు (eansy by doing.

మనోవిజ్ఞాన సిద్ధాంతాల రూపకల్పనకు తత్వవేత్తల చింతన, తోడ్పడింది. అదేవిధంగా కొందరు విద్యావేత్తల ప్రయోగాలు, విద్యాబోధన పద్ధతులు, విద్యా మనోవిజ్ఞాన ఆధారాలు రూపొందించడంలో ప్రాధాన్యతను పొందాయి.

*♦️పెస్టాలజి (Pestalazzi)*

ఇతడు స్విట్జర్లాండ్ దేశస్థుడు. తాను నడిపిన యోర్డన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలను జరిపి పక్కన విషయాలను తెలిపాడు.

👉Known to unknown
విద్యార్థులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలి.

 👉స్వీయానుభవం ద్వారా నేర్చుకోవాలి. leavhing by doing.

👉సామూహికంగా కృత్యాలు నిర్వహించాలి.

👉ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం

👉బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్రబిందువు.

 పెస్టాలజీ తనపరిశోధన ఫలితాలను సిద్ధాంతీకరించి "An evening of a Hermit' అనే గ్రంథంలో పొందుపరచాడు. ఇతని సిద్ధాంతాలు వ్యక్తుల్లోని వైయక్తిక భేదాలను, సహజ సామర్థ్యాలను గుర్తించడంలో సహాయపడ్డాయి.

*♦️ఫ్రోబెల్ (Frobel)*

ఇతను జర్మనీ దేశస్తుడు. పెస్టాలజీకి సమకాలికుడు. ఇతడు స్థాపించిన చిన్న పిల్లల పాఠశాల *''కిండర్ గార్టెన్' (Kinder Garten)గా* రూపొందింది. అనేక బోధన పద్ధతులకు దారితీశాయి. అవిః ఇతని ప్రయోగ ఫలితాలు

👉స్వయం వివర్తన (Self unfolding)

👉స్వయం ప్రకాశం (Self expression)

👉స్వయం బోధన (Self teaching)

👉బోధనలో బహుమతులను ప్రవేశపెట్టడం

👉క్రీడల ద్వారా, సంగీతం ద్వారా అభ్యసింపచేయవచ్చు అనేవి.  

*♦️మాంటిస్సోరి (Maria Montessori)*

ఈమె ఇటలీ దేశస్థురాలు, వైద్యవృత్తిలో ప్రవేశించిన ఈమె మానసికంగా మందబుద్ధులైన పిల్లలకు వైద్యం చేస్తూ, బోధనపై అభిరుచి ఏర్పరచుకుంది. మాంటిస్సోరి రూపొందించిన విద్యావిధానంలో జ్ఞానేంద్రియ ప్రత్యక్షం (sense perception), చొరవ (Initiative), స్వేచ్ఛ (Freedom) ఆత్మ ప్రకటన (Self Expression), చోటు చేసుకున్నాయి.

*♦️హెర్బార్ట్ (Herbart)*
 ఇతను జర్మనీ దేశస్థుడు.

ఇతని ప్రకారం అభ్యసనమనేది 'భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ'. teaching steps

హెర్బార్ట్ బోధనా విధానంలో (Teaching methods) సోపానాలను రూపొందించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించడానికి కూడా సోపానాలను తయారు చేశాడు.


*♦️జాన్.యస్.డ్యూయీ (John. S. Dewey)*

వ్యక్తి జీవితాన్ని, అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకొనే కృత్యాలను వివరించే *'వ్యవహారిక సత్తా వాదాన్ని (Pragmatism)* రూపొందించిన అమెరికా తత్వవేత్త జాన్ డ్యూయీ. ఇతను పాఠశాలను చిన్న మోతాదు సమాజం'గా (Miniature Society) తీర్చిదిద్దాలన్నాడు.

*♦️సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ (Sir Francis Galton)*

డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలవల్ల ప్రభావితుడైన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికత ప్రజ్ఞలకు ఉన్న సంబంధాన్ని గురించి అనేక పరిశోధనలు చేశాడు. ఇతను అనువంశకవాది. (Hereditatian). 

*♦️విల్ హాల్మ్ ఊంట్*

ఈయన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో ఈ శాస్త్రానికి ఒక ప్రయోగశాస్త్ర స్థాయి వచ్చింది. ఊంట్ తన పరిశోధన ఫలితాలను విద్యా విషయాలకు అన్వయించాడు.

*♦️స్టాన్లీ హాల్ (Stanley Hall 1884-1924)*

ఊంట్ ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించి అనేక కొత్త శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు.

*♦️విలియం జేమ్స్ (William James)*

ఇతడు స్మృతి-విస్మృతి, అభ్యసన బదలాయింపు అనే విషయాలపై సిద్ధాంతాలను
చేశాడు.

*♦️ఆల్ఫ్రెడ్ బినే (Alfred Binet)*

ప్రజ్ఞా మాపన ఉద్యమానికి ప్రారంభకుడు ఆల్ఫ్రెడ్ బినే. ఇతడు ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు. పిల్లలలో మందమతులెందుకుంటారో తెలుసుకోవడానికి అన్వేషణలు చేశాడు. 

*♦️ఇవాన్ పావ్లోవ్ (Ivan Pavlov)*

ఇతడు రూపొందించిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, బి.ఎఫ్.స్కిన్నర్ (B.F. Skinner) రూపకల్పన ఇచ్చిన కార్యసాధక అభ్యసన సిద్ధాంతం ఇ.ఎల్. థార్న్ డైక్ (EL Thorndike) అందించిన యత్న-దోష అభ్యసన సిద్ధాంతం. గెస్టాల్టు వాదులు అందించిన 'అంతర్దృష్టి అభ్యసనం' (Learning through Insight) అభ్యసన ప్రక్రియలో అనేక ప్రయోగాలకు, నియమాలకు, సూత్రాలకు దారితీసింది.

ఈ విధంగా అనేక శాస్త్రవేత్తల కృషి వల్ల మనోవిజ్ఞానం తత్వవేదాంత శాస్త్రాల నుంచి విడిపోయి ఒక స్వతంత్రశాస్త్రంగా రూపొందింది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts