Family Pension Details in Telugu

*📡ఫ్యామిలీ పెన్షన్ గురించి ముఖ్య సమాచారం✍️*.




 *ఉద్యోగి సర్వీసులో ఉంటూ గానీ, పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతూగానీ మరణించినచో ఆ ఉద్యోగి/పెన్షనర్ కుటుంబము నకు Revised Pension Rules 1980, రూల్ 50 ప్రకారం ఆ కుటుంబ జీవనాధారం నిమిత్తం కుటుంబ పెన్షన్ ( ఫ్యామిలీ పెన్షన్) చెల్లిస్తారు.*

 _*ఉద్యోగి సుదీర్గ కాలంం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏకారణంతో నైన పదవీ విరమణ చేసిన అనంతరం కుటుంబపోషణకు గాను ప్రభుత్వం నుండి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. దీనినే సర్వీసు పెన్షన్ అంటాం . ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షనర్ /ఉద్యోగం చేస్తూ ఉద్యోగి మరణిస్తే వారికుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్ నే కుటుంబ పెన్షన్ అని అంటాం. *_ 

 _సర్వీసులో ఉన్న ప్రతీ ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను తమ డిడివో లకు నిర్ణీత ప్రొఫార్మాలో ఇచ్చి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాలి._ 
 *రిటైర్ అయిన తరువాత కూడా ఈ వివరాలుఉపయోగ పడతాయి.వీటి ఆధారంగా మరియు పింఛనుదారు పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయం లో డిడివో లు కుటుంబ పెన్షన్ దారుల వివరాలుదృవీకరించి పంపగా మన పెన్షన్ మంజూరు (PPO) ఉత్తర్వులలో AG గారు కుటుంబ పెన్షన్ దారు వారికి అర్హతకల చెల్లించదగు పెన్షన్ నిర్ణయించి ఉత్తర్వులలో పొందు పరుస్తారు.* 

 *ఒకవేళ ఫేమలీ పెన్షన్ కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాధన లతో పంపకపోయినా / రిటైర్ అయిన అనంతరం పిల్లలు శారీరక, మానసిక వైకల్యాలకు గురైనా,రిటైర్ అయి చట్టబద్దంగా వివాహం చేసుకొని పిల్లలు కలిగిన అట్టి వివరాలను Rule 50(II)(a)(i)(2) of Revised Pension Rules 1980 and Ruling 3 under Rule4 of family pension rules 1964 ననుసరించి,ఫారంF లో పొందుపరచి సంబందిత STO గారికి అందించి PPOలో నమోదు చేసుకొనే అవకాశం ఉంది.* 
 
 *Rule 50(12) of Revised Pension Rules 1980 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు GOMS No 315 dt 7/10/2010 ప్రకారం కుటుంబ పెన్షన్ పొందుటకు కుంబ సభ్యులుగా ఈ క్రింది వారు వస్తారని పొందు పరచడం జరిగింది.* 
ఉద్యోగి/పెన్షనర్ భార్య/ భర్త.
లీగల్లీ సెపరేటెడ్ స్పవ్జు
కుమారులు
కుమార్తెలు
శరీరక మానసిక వికలాంగులైన పిల్లలు
విడాకులు పొందిన కూతురు
విధవరాలైన కుమార్తె
పైన పేర్కొన్న వారెవరూ లేక పోతే తల్లి దండ్రులు.

కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు?
 *ఉద్యోగి సర్విసులో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి 65 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందయితే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్ గా చెల్లిస్తారు.తదుపరి చివరినెల జీతంలో 30% పెన్షన్ గా చెల్లిస్తారు.* 

 *పెన్షనరుగా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో 50% లేదా ప్రస్తుత పెన్షన్ ఏది తక్కువైతే అది,పదవీ విరమణ తేది నుండి 7 సంవత్సరాల కాలము లేదా ఉద్యోగికి 65 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే తేది వరకూ ఏది ముందు అయితే ఆ తేది వరకు చెల్లించబడును. తదుపరి పెన్షన్ లో 30% పెన్షన్ గా చెల్లిస్తారు.* 

 *పెన్షనర్ల విషయంలో వారి పెన్షన్ AG నుండి మంజూరు సమయంలో PPO లో Family Pension Beneficiary పేరు ,Enhanced Family pension (మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి 65సంవత్సరాలువరకూ) ఆ తరువాత నుండి జీవితాంతం వరకూ Family Pension (30%) వివరాలు కూడా నోట్ చేయబడి ఉంటాయి.* 
 
 *పెన్షనర్ రిటైరైన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్య/భర్తకు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు* .

 *రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది.* 

 *అదృశ్యమైన, ఆచూకి తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తరువాత కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.* 

 *సంపాదనా పరులు కాని అంగవికలురైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది.* 

 *పెన్షనర్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు* .

కుటుంబ పెన్షన్ పై D.R చెల్లిస్తారు.

 *కుటుంబ పెన్షన్ దారులుకూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే అవకాశం ఉంది.* 

 *Rule 50{(5)(I) ప్రకారం ఫ్యామిలీ పెన్షనర్ పునర్వివాహం చేసుకుంటే, ఫ్యామిలీ పెన్షన్ రద్దవుతుంది* .

 *కనీసం 7 సంవత్సరాల సర్వీసు కలిగి ఉంటేనే 50% ఎన్ హన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కాబడుతుంది. 7 సంవత్సరాల లోపు సర్వీసు కలిగిన వారికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు.* 

 *Rule 50(6)(A)(1) ప్రకారం వితంతువులు ఉంటే వారికి కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువు లందరికి సమానవాటాలు చెల్లిస్తారు* .

 *Rule 50(6)(B) ప్రకారం ప్యామిలి పెన్షనర్ గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలుకు , రెండవ భార్యతో పాటు కుటుంబ పెన్షన్ కు అర్హులు.* 

 *Rule 50(12)(B)(I) &G.O.Ms.No. 335 F&P తేది:15.9.1993 ప్రకారం రిటైరైన ప్రభుత్వ ఉద్యోగి చట్టప్రకారం పెళ్ళి చేసుకుంటే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్ కు అర్హురాలే* .

 *Rule 50(10)(b)(c) & G.O.Ms.No.245 F&P తేది:4.9.2012 ప్రకారం ఒకవ్యక్తి రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందు సందర్భంలో రెండిటి మొత్తం రూ.27,830 కు పరిమితం చేయబడును.* 

 *Rule 50(12)(b) Note 2(III) & G.O.Ms.No.236 F&P తేది:28.5.1994 ప్రకారం రిటర్మెంట్ తదుపరి కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్ కు అర్హత కలిగి ఉంటారు.* 

 *Cir.Memo.No.4027/B/26/pension-I/87 Fin తేది:20.8.1991 ప్రకారం మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్ళి చేసుకుంటే, రెండవ భార్య కుటుంబ పెన్షనుకు అర్హురాలు కాదు.* 

 *G.O.Ms.No.20 F&P తేది:24.1.1981 ప్రకారం విడాకులు పొందినప్పటికీ ,విడిగా ఉంటున్నప్పటికీ భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్ లో వాటకు అర్హులే.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts