Type Here to Get Search Results !

AP Telugu 6th Class All Lessons ఇతివృత్తం, ప్రక్రియ, కవులు

ఆరో తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల నుండి 
1️⃣అమ్మవడి.. బాడిగ వెంకట నరసింహారావు.. కౌతారం కృష్ణా జిల్లా జననం.. అనార్కలి నరసింహారావు గా పేరు.. బిరుదు బాలబంధు.. బాల రసాలు, ఆవు హరిచంద్ర, చిన్నారిలోకం, బాల సాహిత్యం
 ఉద్యమ స్ఫూర్తి... గేయ ప్రక్రియ.. ఇతివృత్తం తల్లి ప్రేమ

2️⃣ తృప్తి.. సత్యం శంకరమంచి.. అమరావతి జన్మస్థలం.. అమరావతి కథలు, కార్తీక దీపాలు, రేపటి దారి, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు, హరిహర మహాదేవ నాటకం రచనలతో ,1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు... ప్రక్రియ కథ... ఇతివృత్తం మానవ విలువలు... ఈ పాఠంలో పూర్ణయ్య పాత్ర బావగాడు

3️⃣ మాకొద్దీ తెల్ల దొరతనం 
గరిమెళ్ళ సత్యనారాయణ.. గోనెపాడు శ్రీకాకుళం జిల్లా జననం.. స్వరాజ్ గీతములు హరిజనుల పాటలు ఖండకావ్యాలు భక్తి గీతాలు బాల గీతాలు.. దేశభక్తి పాటలు రాసి మొదట జైలు శిక్ష అనుభవించినది... ఇతివృత్తం 
 దేశభక్తి

4️⃣ సమయస్ఫూర్తి 
కందుకూరి వీరేశలింగం రాజమండ్రి.. రాజశేఖర్ చరిత్ర.. హాస్య సంజీవని. సత్యరాజ పూర్వదేశ యాత్రలు.. బిరుదు గద్యతిక్కన.. సంఘసంస్కర్త నవయుగ వైతాళికులు.. దీని ప్రక్రియ కథ ... ఇతివృత్తం ..వ్యక్తిత్వ వికాసం.. ఈ పాఠం పంచతంత్ర అనువాద కథల నుంచి గ్రహింపబడింది.. రోమేసుడు (పిల్లి) పలితుడు (ఎలుక )చంద్రకుడు గుడ్లగూబ

5️⃣ మన మహనీయులు 
ప్రక్రియ..వ్యాసం ...
ఇతివృత్తం దేశభక్తి 
శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం కొరకు 1952 అక్టోబర్ 19 నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15వ తేదీ 1952లో ప్రాణాలు వదిలారు..
జాతీయ జెండా.. రూపశిల్పి పింగళి వెంకయ్య.. బట్ల పెనుబర్రు కృష్ణాజిల్లాలో జననం 
భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ రచయిత ...పైడిమర్రి వెంకట సుబ్బారావు... వీరి రచనలు గృహస్థ జీవితం స్త్రీ ధర్మం 
మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి  తిరుపతిలో జననం    రచనలు సుందర్ రామాయణం, సుందర భాగవతం, బుద్ధ గీత..

 6️⃣ ఆరో తరగతి తెలుగు సుభాషితాలు 
ప్రక్రియ పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు 
1.గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు.. తెలుగు బాల శతకం నార్ల చిరంజీవి 
2. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు తెలుగు బాల శతకం 
3. పుస్తకములు చదువు పూర్ణత్వం అబ్బదు...   కాళికాంబ... పోతులూరి వీరబ్రహ్మం
4. నోచిన తల్లిదండ్రికి ధనుభవుడొక్కడే చాలు మేటిచే ...దాశరధి శతకం 
5. సిరిగల వానియెడల చేసిన మేలుది నిష్ఫలం మగున్.. భాస్కర శతకం

 7️⃣ పాఠం పేరు మమకారం 
ప్రక్రియ కథ... ఇతివృత్తం 
భాషాభిరుచి... చిలుకూరి దేవపుత్ర రచయిత... అనంతపురం జిల్లా కాల్వపల్లె. జననం *పంచమం* నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం.. గుర్రం జాషువా పురస్కారం.. ఏకాకి నౌక చప్పుడు.. చివరి మనుషులు, బందీ, వంకర టింకర ,ఆరు గ్లాసులు ,కథలు అద్దంలో చందమామ, పంచమం నవలలు వీరి రచనలు
అవసరం కోసం ఆంగ్ల భాష నేర్చుకోవాలి. దానిమీద వ్యామోహంతో మాతృభాష తెలుగు భాష నిరాదరించడం సరికాదు. ప్రతి చోటా మాతృభాష వాడాలి అనేది ఈ పాఠం ఉద్దేశం

8️⃣ మేలుకొలుపు 
ప్రక్రియ ..పద్యం 
ఇతివృత్తం.. సమానత్వం 
రచయిత కుసుమ ధర్మన్న రాజమండ్రిలో జననం.. తొలి దళిత కవి.. కందుకూరి వీరేశలింగం  గారి చే ప్రభావితులైనారు.. అంటరానితనం నిర్మూలనకి విశేషంగా కృషి చేసినది కుసుమ ధర్మన్న
గీతాంజలి... రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి... నోబుల్ సాహిత్య బహుమానం

9️⃣ ధర్మ నిర్ణయం 
చారిత్రాత్మక కథ... ఇతివృత్తం స్దల పురాణం 
పాత్రలు ..మాధవర్మ, దుర్గాదేవి ,రాకుమారుడు,.. ధర్మం కోసం కన్న కొడుకుకి మరణశిక్ష విధించిన రాజు మాధవర్మ 
సంయుక్త వాక్యాలు 
1. మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు 
సంయుక్త వాక్యం 
మధు రహీం బడికి వెళ్లారు 
2. శీతా అక్క ,గీత చెల్లెలు 
సీత గీత అక్క చెల్లెలు 
3. మాధవి పరిగెత్తింది బస్సు అంద లేదు 
మాధవి పరుగెత్తింది కానీ బస్సు అంద లేదు..
వర్షాలు వచ్చాయి చెరువులు నిండ లేదు 
వర్షాలు వచ్చాయి కానీ చెరువులో నిండలేదు

1️⃣0️⃣ త్రిజట స్వప్నం 
ప్రక్రియ ...పద్యం 
ఇతివృత్తం.. సహానుభూతి 
కవి ...ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దం.. కడప జిల్లా గోపవరం .. రచనలు మొల్ల రామాయణం.. మొల్ల రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి.. ప్రస్తుత పాఠం మొల్ల రామాయణంలో సుందరకాండ లోనిది..

భాషాంశాలు 
సవర్ణదీర్ఘ సంధి 
1రామా + ఆలయం= రామాలయం 
2రవి + ఇంద్రుడు= రవీంద్రుడు 
3గురు +ఉపదేశం గురూపదేశం 
 4పితృ + రుణం =పితౄణం. 
5.విద్యా + అర్ధి= విద్యార్థి

1️⃣1️⃣వ పాఠం
 డూడూ బసవన్న 
ప్రక్రియ.. జీవిత చిత్రం 
ఇతివ్రతం.. సంస్కృతి 
కవి... రావూరి భరద్వాజ 
గుంటూరు జిల్లా తాడికొండ జననం... 
విమల తొలి కథ.. అపరిచితులు, కథా సాగరం, ఉడుతమ్మ ఉపదేశం, కీలు గుర్రం, పిల్లల కథలు 

జలప్రళయం, కర్రి మిరింగిన వెలగపండు, పాకుడు రాళ్లు, నవలలు.. పాకుడు రాళ్లు నవలకు *జ్ఞానపీఠం* పురస్కారం,,, కళా ప్రపూర్ణ కేంద్రసాహిత్య పురస్కారం, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న లభించాయి.. ఈ పాఠం  జీవన సమరం అనే వీరి కథల పుస్తకం నుంచి సేకరింపబడింది...

1️⃣2️⃣ ఇదే చివరి పాఠం ఎంత మంచి వారమ్మా 
ప్రక్రియ ..వ్యాసం 
ఇతి వృత్తం.. జీవన వైవిధ్యం
కవి ...వెన్నెలకంటి.రాఘవ
య్య... బిరుదు. నెల్లూరు గాంధీ... తెలుగులో అడవి పూలు నాగులు చెంచులు, సంచార జాతులు యానాదులు ఆదివాసులు వంటి పుస్తకాలు రచించారు.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.