TET DSC Telugu Proverbs సామెతలు
నిర్వచనాలు
- సామెతలకు జనస్తుతి, నానుడి, లోకోక్తి, శాస్త్రం ఈ పేర్లు ఉన్నాయి.
- 1869 M.W.కార్ అనే ఆంగ్లేయుడు “ఆంధ్రలోకోక్తి చంద్రిక” పేరుతో సామెతలను ప్రచురించారు.
- సామెతలను ఆంగ్లంలో “Proverbs" అంటారు.
- సామెతలను సంస్కృతంలో “లోకోక్తి” అంటారు.
- సామ్య శబ్ధం సామ్యతగా మారి సామెత అయిందని చిలుకూరి నారాయణరావు పేర్కొన్నారు.
- సమత అంటే సామ్యం. సామ్యం అంటే పోలిక, దృష్టాంతం.
- ఇవి కళ్ళకు కట్టినట్లుగా ఉండే ఉదాహరణలు.
- ఇవి వాక్యరూపంలో ఉంటాయి.
సామెతకు ఇతర భాషలలో పేర్లు
- సామెతలు - 90.
- సంస్కృతం - లోకోక్తి, సూక్తి, సుభాషితం.
- కన్నడం, తుళు - గాదె, నాణ్ణుడి, సామెత.
- తమిళం, మళయాళం - పళమళి, పళచొల్లు.
- హిందీ - కహావత్.
* సామెతకు పర్యాయపదాలు
నానుడి, జనశ్రుతి, సుద్దులు, శాస్తాలు (రాయలసీమ, ఉత్తర కర్ణాటక), సాటువ (నెల్లూరు)
సామెతలు
- ఏటి ఆవలి ముత్యాలు తాటికాయలంత అన్నట్లు.
- కాకర చెట్టుకు పానకం పోసినట్టు.
- కనంది బిడ్డాకాదు కట్టనిది చీరాకాదు.
- ఆరు నెలలు, సావాసం చేస్తే వారు వీరవుతారు.
- చదువుకున్న వాడికన్నా చాకలి వాడు మేలు.
- అంబలి తాగే వారు కొందరైతే మీసాలు ఎగబట్టేవారు మరి కొందరు.
- అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి.
- ఇంటి పేరు కస్తూరి, ఇంట్లో గబ్బిలాల కంపు.
- నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు.
- గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు.
- దూరపు కొండలు నునుపు.
- నిండిన కడుపు, నీతి ఎరుగదు.
- పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ కొరికింది.
- తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు.
- చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు.
- తన దీపమని ముద్దు పెట్టుకొన్నట్టు.
- తన బలం కన్నా స్థాన బలం మిన్న.
- సంకన పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు.
- కాలే కడుపుకు మాడే గంజి
- పంది బలిసినా నందితో సమానమా.
- రౌతు కొద్ది గుఱ్ఱం, పిండి కొలది రొట్టె.
- శంఖంలో పోస్తేగాని తీర్థం కాదు.
- తాటి చెట్టు కింద పాలు తాగినట్టు.
- గొర్రె ఏడిస్తే తోడేలుకు విచారమా !
- ఆకలి రుచెరుగదు. నిద్ర సుఖమెరుగదు
- ఇల్లు ఇరకాటం ఆలు మర్కటం.
- అంతంత బీరకాయకద్దసేరు మసాల
- దరిద్రునికి మాటలెక్కువ, తద్దినానికి కూరలెక్కువ.
- మాటకు మాయింటికి కూటికి మీ ఇంటికి
- అతి రహస్యం బట్టబయలు
- నక్క నదిల కొట్టుకుపోతూ ప్రపంచమంత మునుగు తుందన్నదట.
- మావోనికి ముప్పై రెండు గుణాలు మంచియే రెండే రెండు
- పాడు తనకు దెలది ఒకడు చెపితే వినడు.
- చెరువులు పడ్డాన్ని తీసి బావిలేసినట్లు.
- చిల్లికి చింతపండొత్తినట్లు
- గుమ్మినిండ గింజలుండాలె గూటాలో
- గుట్టకు కట్టెలు మోసినట్లు
- గాలికి గడ్డపారలు కొట్టుకపోయినయట.
- కట్టకు పుట్టచేటు చెట్టుకు తొర్రచేటు.
- ఏనుగు కూసున్నా గుర్రమంతెత్తు.
- ఊరుదూరమైంది కాదు దగ్గరైంది.
- ఉరికురికి కొట్టినా మోటపారలేదు.
- ఈతకు లోతులేదు.
- ఉడుకేసుకుని తిని తడకేసుకుని పన్నట్లు.
- అక్కచుట్టమైతే లెక్కచుట్టమా.
- కొన్నది బింకెడు కొసిరేది లొట్టెడు
- ఎనుగర్ర (వెన్ను కర్ర) బలముంటే ఎన్ని వాసాలైనా ఎక్కియ్యచ్చు.
- అన్నం లేక కోతిరూపు బట్టల్లేక బాంచ రూపు
- దొప్పెడంబలి కోసం దోసిట్లంబలి ఒలుకపోసె
- తోచని పనికి తక్కులాటెక్కువ
- రొట్టెలోనికంటె తునుకలోడే నయం
- కన్ను పెద్ద కడుపుచిన్న
- ఎన్నేషాలేసినా కూటికే ఎన్నేండ్లు బతికినా కాటికే
- అయినోళ్ళకు ఆకుల్ల కానోళ్ళకు
- కంచాల్ల అంతట నానినా అరికాలుకింద నానది
- అంగణంపట్టి గొడ్డు వంగడం పట్టి బిడ్డ
- అంతంత బీరకాయ కద్దసేరు మసాల.
- దంచిందానికి బుక్కిందే కూలి.
- ఉపాసముంటే అప్పుదీరది. ఊపిరితో బొర్ర పెరగది.
- ఎంగిలికెగ్గులేదు తాగుబోతుకు సిగ్గులేదు.
- పొత్తులపని సుఖం. ఒంటిగ తిండి సుఖం.
- పగటిముచ్చట పనికిచేటు. రాత్రి ముచ్చట నిద్రకు చేటు.
- నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియ్యచ్చు.
- నాలుకమీద కాదు కడుపులుండాలె.
- నాగుబామంత కోపం జెర్రిపోతంత పిరికి.
- ధైర్యం దండిది చేయి మొండిది.
- గవ్వ అందానిలేదు. గడియ పురుసతు లేదు.
- పండుగైనంక అల్లుడచ్చినట్లు.
- పందికొక్కు తనకిందికే దోసుకుంటది.
- పండిన చెట్టు మీదనే బండలు పడేది.
- నాయకుడు లేక నాటకమాడినట్లు.
- నడిచే ఎద్దును పొడిచినట్లు.
- తెగిన బొక్కెన నూతిల్దాక.
- తిట్లకునీవు తిడికినేను.
- గొర్రెలు దినెటోడు పోతె బర్రెలు తినెడ
- సంకల పిల్లను పెట్టుకొని అంగడంత వెదికినట్లు.
- ఉండనీడిస్తే పండ మంచమడిగినట్లు.
- మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట.
- అడుతని నెత్తి బుడతడు గొడ్డె బుడతని నెత్తి.
- ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
- ఇటేటురమ్మంటే ఇల్లంతా నాదే అన్నడట.
- మింగ మెతుకులేదు కాని మీసాలకు సంపెంగ నూనె.
- దుష్టువాళ్ళకు పోచమ్మ భయపడతదట.
- పట్టిపట్టి పంగనామాలు బెడితే గోడసాటుకు వోయి తుడుసుకున్నట్లు.
- గోరుచుట్టమీద రోకటిపోటు
- పెనం మీంచి పొయిలో పడ్డట్లు.
- ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు
- ఊరందరిదో దారి ఉలిపికట్టదో దారి
- సందిట్లో సడేమియా అన్నట్లు
- గుమ్మడికాయలదొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు
- అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు
- పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు
- తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలె
- ఇంటింటికో మంటిపొయ్యి
- అడిగినట్లిస్తే కడిగినట్లవుతది
- కిందపడ్డా మీదికాలు నాదే
- ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
- కుండ పలిగినా కుక్క గుణం తెలిసె
- చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు
- పోచమ్మ కుండపెడ్తా మైసమ్మ మాయం చేసె
- పిల్ల పయిలం ముల్లె పయిలం
- విత్తు చిన్న విచారం పెద్ద
- సుఖమొస్తే మొహంకడుగ తీరికలేదన్నట్లు
- ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం
- చుట్టమై వచ్చి దయ్యమై పట్టె
- ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు


Please give your comments....!!!