Type Here to Get Search Results !

School Complex Meetings for the month of August 2026 Schedule

📢 ఆగస్టు 2026 – స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

High School Complex Meetings Agenda


Primary School Complex Meetings Agenda 


పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆగస్టు నెలలో ఒకరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు.

🔹 ప్రాథమిక పాఠశాలలు (1–5 తరగతులు):
19.08.2026 – 50% ఉపాధ్యాయులు
20.08.2026 – మిగిలిన 50% ఉపాధ్యాయులు

🔹 6–10 తరగతుల సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలు:
25.08.2026 – తెలుగు/ఉర్దూ, గణితం, ఫిజికల్ ఎడ్యుకేషన్
27.08.2026 – హిందీ, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం
29.08.2026 – ఇంగ్లీష్, సోషల్

⏰ సమయం: ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.15 గంటల వరకు.

సమావేశాల్లో FLN/LIP బేస్‌లైన్ ఫలితాల సమీక్ష, PGI, HPC, Remediation, STEM/Khan Academy, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, INSPIRE MANAK, ECO Club తదితర అంశాలపై చర్చలు ఉంటాయి.

👉 సంబంధిత ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా హాజరై, సమావేశాలను విజయవంతం చేయగలరు. హాజరు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయబడుతుంది.

Selfie Stand


*💠స్కూళ్లలో ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ స్టాండీలు*

*📢ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఏర్పాటుకు విద్యాశాఖ ఆదేశం*

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చేపట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాములో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడానికి వినూత్న ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్కూళ్లలో ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ స్టాండీలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూ ళ్లలో సెల్ఫీ స్టాండీలను అందరికీ కనిపించేలా ప్రముఖంగా ఉంచాలని డీఈఓలు, ఎంఈఓల ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశించింది. కేవలం స్కూళ్లలోనే కాకుండా మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి ఎఫ్ఎల్ఎన్ బ్రాండింగ్ ను పెంచాలని సూచించింది.

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.