📚 LIP అమలు మార్గదర్శకాలు – విద్యా సంవత్సరం 2026–27
📢 LIP EXAMS SCHEDULE
*▪️Base LINE:*
07.07.2026 TO 11.07.2026
👉🏻RESULT BY 31.07.2026.
*▪️MID LINE:*
20.11.2026 TO 30.11.2026
👉🏻RESULT BY 10.12.2026.
*▪️END LINE:*
07.03.2027 TO 27.03.2027
👉🏻RESULT BY 31.03.2027.
🔹 LIP అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో LIP సెల్స్ ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర స్థాయిలో – సమగ్ర శిక్ష/SCERT రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో.
జిల్లా స్థాయిలో – జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) కార్యాలయంలో.
🔹 LIP సెల్స్ ప్రధాన బాధ్యతలు:
LIP అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడం.
ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం, మార్గదర్శకాలు అందించడం.
విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం.
🔹 సహాయక పర్యవేక్షణ (Supportive Supervision):
రాష్ట్ర, జిల్లా అధికారులు, DEOs, MEOs, ప్రధానోపాధ్యాయులు, SRPs తదితరులు పాఠశాలలను సందర్శించి తరగతి గది పరిశీలనలు నిర్వహిస్తారు.
ముఖ్యంగా 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు తరగతుల పరిశీలనకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
📌 MEOల సందర్శనల మార్గదర్శకాలు:
✅ ప్రతి వారం కనీసం 3 రోజులు పాఠశాలల సందర్శన.
✅ వారానికి 5–6 పాఠశాలలు (FLN – 4, LIP – 2) పరిశీలన.
✅ నెలకు కనీసం 20 పాఠశాలల సందర్శనలు పూర్తి చేయాలి.
✅ ప్రతి సందర్శనలో కనీసం 3 గంటలు పాఠశాలలో గడపాలి.
✅ 45 నిమిషాల పూర్తి తరగతి బోధన పరిశీలించి ఉపాధ్యాయులకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి.
✅ సిబ్బంది సమావేశం నిర్వహించి, Academic Guidance Register (AGR) లో నమోదు చేయాలి.
✅ AGR ఫోటోతో పాటు సందర్శన వివరాలను Telangana School Education App లో అప్‌లోడ్ చేయాలి.
📖 LIP విజయవంతమైన అమలుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది.

Please give your comments....!!!