Type Here to Get Search Results !

FLN, LIP End Line Test Question Papers

(toc) ముఖ్యాంశాలు



*🔥End Line Test Question Papers*


*▶️జిల్లాలోని అన్ని ప్రభుత్వ / స్థానిక సంస్థలు / TGMS / TGREIS / KGBV / అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా..!*

*📌 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి FLN (1–5 తరగతులు) మరియు LIP (6–9 తరగతులు) విద్యార్థులకు End Line Test ను 09-03-2026 నుండి 11-03-2026 వరకు (Physical Mode లో) తప్పనిసరిగా నిర్వహించాలి.*

*📌 End line test ప్రశ్నాపత్రాలు మరియు evaluation guidelines ఇప్పటికే పంపబడినవి. వాటిని అనుసరించి పరీక్షలు నిర్వహించాలి.*

*📌 విద్యార్థుల ఫలితాలను 30-03-2026 లోపు Telangana School Education App లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.

*📌 అన్ని పాఠశాలలు తమ విద్యార్థుల ఫలితాలను Baseline & Midline తో పోల్చి విశ్లేషణ చేసి, మెరుగుదల కోసం తగిన చర్యలు తీసుకోవాలి.*

*⚠️ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని, ఎటువంటి తప్పులు లేకుండా పరీక్షలు నిర్వహించగలరు*✍🏼

 నిర్వహణకు మార్గదర్శకాలు (Guidelines for conducting Tests)


పరీక్షలు నిర్వహించడానికి కాలక్రమం

* LIP కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరంలో మూడు సార్లు పరీక్ష నిర్వహించాలి. అవి ప్రారంభ పరీక్ష. మధ్యంతర పరీక్ష, తుది (అంత్య) పరీక్ష. ఈ పరీక్షలని FAలతో సంబంధం లేకుండా నిర్వహించాలి.

* ప్రారంభ పరీక్షను 2025 జూన్ మాసంలో 25వ తేదీ నుండి 30వ తేదీ లోపు నిర్వహించాలి. వీటి ఫలితాలను 15.07.2025 Telangana School Education App లో నమోదు చేయాలి

* మధ్యంతర పరీక్షను 2025 నవంబర్ మాసంలో 25వ తేదీ నుండి 30వ తేదీ లోపు నిర్వహించాలి. వీటి ఫలితాలను 15.12.2025 లోపు Telangana School Education Appలో నమోదు చేయాలి.

* తుది (అంత్య) పరీక్షను మార్చి మాసంలో 5వ తేదీ నుండి 7వ తేదీ లోపు నిర్వహించాలి. వీటి ఫలితాలను 30.03.2026 లోపు Telangana School Education Appలో నమోదు చేయాలి.

II. తెలుగు పరీక్షాంశాలు


1. వ్యక్తి 6 (ORF - మౌఖిక పఠన నైపుణ్యం)

2. చదివిన దానిని అర్థం చేసుకోవడం (RC Reading Comprehension)

3. రాయడం ద్వారా వ్యక్తీకరణ (Expression in Self Writing)

మూల్యాంకన సూచికలు


1. ధారాళంగా చదువడం (ORF Oral Reading Fluency)

తెలుగులో 50 పదాలున్న పేరాను ఒక నిమిషంలో తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత వేగంతో స్పష్టంగా విద్యార్థి చదువాలి. అలా చదివినప్పుడే ఆ విద్యార్థికి ఆ సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించాలి. చదువగలిగినవారికి '' గుర్తుపెట్టాలి, లేకుంటే 'X' పెట్టాలి.

2. చదివినదానిని అర్థం చేసుకోవడం (RC Reading Comprehension)

చదివిన దానిని అర్ధం చేసుకోవడం: ఈ సామర్ధ్యంలో ఇచ్చిన 5 ప్రశ్నలలో 4 ప్రశ్నలకు విద్యార్థి జవాబు రాయగలిగితే అతనికి ఆ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించాలి.

3. రాయడం ద్వారా వ్యక్తీకరణ (Expression in Self Writing)


రాయడం ద్వారా వ్యక్తీకరణ: ఈ సామర్థ్యంలో పిల్లలు తాము చదివి అర్ధం చేసుకున్న, తమకు తెలిసిన అంశాల గురించి సొంత మాటల్లో రాయాలి. ఈ జవాబులను కింది విధంగా మూల్యాంకనం చేయాలి.

1. ఇచ్చిన అంశం/ప్రశ్నకు తగిన సమాధానం ఉన్నదా?

2. వాక్య నిర్మాణం సరిగ్గా ఉన్నదా?

3. సందర్భోచిత పదజాలం ఉపయోగించారా?

4. అక్షర దోషాలు ఉన్నాయా?

అనే నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని మూల్యాంకనం చేయాలి. ఐదు అక్షర దోషాలున్న కూడా పరిగణించవచ్చు. ఒక వేళ వాక్య నిర్మాణం పదజాలం అక్షర దోషాలు లేకుండా రాయడం అనేవి సరిగ్గా ఉన్నా, విషయం సరిగా లేనప్పుడు ఈ మూడు అంశాలు పరిగణనలోకి తీసుకోరాదు.

Guideline in Urdu Click below 


Guidelines in Telugu Click Below 


Guidelines in English Click Below 


FLS III ( I - V Classes ) Question Paper English Medium 


Download (Single Page)

FLS III ( I - V Classes ) Question Paper Telugu Medium 


FLS III ( I - V Classes ) Question paper Urdu Medium Click below 


LIP ( VI - IX Classes ) Question Papers English Medium Click Below 


LIP ( VI - IX Classes ) Question Papers Telugu Medium Click Below 


LIP ( VI - IX Classes ) Question Papers Urdu Medium Click Below 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.