ఎకో క్లబ్ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ...ఏక్ పెడ్ మాకేనామ్ 2.0 కార్యక్రమం అన్ని పాఠశాలల్లో నిర్వహించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు తదితర సమాచారం ఎకో క్లబ్ పోర్టల్ లో నమోదు చేయవలసి ఉంటుంది.
నమోదు చేయవలసిన అంశాలు రెండు రకాలు.
1. *ఏక్ పెడ్ మాకే నామ్ కు సంబంధించి ప్రతి విద్యార్థి వారి తల్లితో కలిసి జియో టాగ్ ఫోటో తీసి అప్లోడ్ చేయడం.*
ఏక్ పేడ్ మాకే నామ్ విద్యార్థి ఫోటో అప్లోడ్ చేసే విధానం ...
browse ..
ఈ వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత మనకు JOIN THE MOVEMENT EK PED MAA KE NAAM 2.0 PARTICITIPATION
FORM కనబడుతుంది.
అక్కడ విద్యార్థి పేరు,
తల్లి పేరు,
తండ్రి పేరు,
తరగతి,
వయస్సు,
జెండర్,
పాఠశాల యుడైస్ కోడ్
ఎంటర్ చేసి అక్కడ మనం ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ఇందుకుగాను ముందుగానే జియో టాగ్డ్ ఫోటోను కంప్యూటర్లో గాని, ఫోన్ గ్యాలరీలో గాని సిద్ధంగా ఉంచుకోవాలి.
అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న చిన్న బాక్స్ లో క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి. అప్పుడు మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది.
అప్పుడు విద్యార్థి పేరుతో ఉన్న సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇట్లా ప్రతి విద్యార్థికి సంబంధించిన సర్టిఫికెట్ను ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవాలి.
పాఠశాల ఆవరణలో ఉన్న మొక్కల దగ్గర గాని లేదా పాఠశాల సమీపంలో గాని, వారి ఇంటిదగ్గర ఉన్న మొక్కల దగ్గర గాని విద్యార్థులు వారి తల్లితో కలిసి ఫోటో దిగి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
2. *ప్రధానోపాధ్యాయుడు స్కూలు లాగిన్ లోకి వెళ్లి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం*
ఎకో క్లబ్ పోర్టల్ లోకి వెళ్లిన తర్వాత yellow colour లో ecoclub mission life ఉన్న చోట క్లిక్ చేయాలి.
అప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో లాగిన్ ఆప్షన్ వస్తుంది.
ఇందులో మూడు రకాల లాగిన్ ఆప్షన్స్ ఉంటాయి.
1.స్కూలు లాగిన్
2. ఫ్యాకల్టీ లాగిన్
3. స్టూడెంట్ లాగిన్.
ప్రధానోపాధ్యాయులు స్కూలు లాగిన్ ను క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత స్కూల్ యుడైస్ కోడ్ ఎంటర్ చేయాలి.
SEND ఆప్షన్ ను క్లిక్ చేస్తే ప్రధానోపాధ్యాయుడి మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత CAPCHA ఎంటర్ చేసి PROCEED బటన్ నొక్కాలి.
అప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మళ్లీ లాగిన్ అయి ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ నోటిఫికేషన్ పేజీ కు వెళ్లాలి.
అక్కడ డౌన్లోడ్ వర్డ్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి నోటిఫికేషన్ వర్డ్ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి దానిపైన స్కూల్ పేరు, ప్రధాన ఉపాధ్యాయుడు పేరు, ఇంచార్జి టీచర్ పేరు, ప్రతి క్లాస్ నుంచి ఇద్దరు విద్యార్థుల పేర్లు రాసి కింది భాగంలో ఎకో ప్రెసిడెంట్ (విద్యార్థి), ఇన్చార్జి టీచర్ ( సైన్స్ టీచర్), హెడ్మాస్టర్ సంతకం చేసి పిడిఎఫ్ ఫైల్ కంప్యూటర్లో సేవ్ చేసుకుని ఉంచాలి.
తరువాత మళ్లీ నోటిఫికేషన్ పేజీ లోకి వెళ్లి అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఇదివరకు సేవ్ చేసిన మన పాఠశాల నోటిఫికేషన్ పిడిఎఫ్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ఈ రెండు టాస్క్కులను జూలై 15వ తేదీలోగా ప్రతి పాఠశాల పూర్తి చేయవలసి ఉంటుంది.


Please give your comments....!!!