How to Apply Scholarships for Vidyaadhaan Scholarships who are going to study inter and Degree
విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం
సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.
ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి 10,000+ మంది విద్యార్థులు లబ్ధిపొందారు. ఎంపికైనా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. విద్యార్థి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 75,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం (Mentoring) చేయడం జరుగుతుంది.
"దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2025 పై క్లిక్ చేసి వివరాలు చూడగలరు".
2025 కొరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ కార్యక్రమం.
స్కాలర్షిప్ వివరాలు
2025 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2026 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/-రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.
ఎవరు అర్హులు?
విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2024 2025 విద్యాసంవత్సరంలో 10th (SSC) పూర్తి చేసి ఇంటర్/Diploma చదువుతున్న వారు. విద్యార్థి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాదించినవారు అర్హులు.
ఎంపిక విధానం:
విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు, మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 30th June 2025.
Online పరీక్ష తేదీ : 13th July 2025.
Online పరీక్ష పై తేదిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది, పరీక్ష సమయం,హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునే వివరాలు Email ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది.
అవసరమైన పత్రాలు:
దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను
> 10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రొపిషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు.
> ఫోటోగ్రాఫ్ (పాస్పోర్ట్ సైజ్)
> 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి)./
> దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే)
సంప్రదించవలసిన వివరాలు:
ఇమెయిల్: vidyadhan.andhra@sdfoundationindia.com లేదా విద్యాధన్ హెల్ప్ డెస్క్ నంబర్‌కు కాల్ చేయండి:
0806833350/+91806833350. పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.
ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:
1. విద్యార్ది వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడ జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.
2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:
a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి
పేరు ను ఎంటర్ చేయాలి.
b . Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ
సి.పేరును ఎంటర్ చేయాలి.
Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.



Please give your comments....!!!