జిల్లా స్థాయిలో ఇన్-సర్వీస్ శిక్షణ జరగనున్నది.
పాల్గొనేవారికి సూచనలు:
1. శిక్షణ ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:00 వరకు జరుగుతుంది.
2. లంచ్ శిక్షణ జరిగే ప్రదేశంలోనే అందించబడుతుంది.
3. ప్రతి ఒక్కరూ షెడ్యూల్ ప్రకారమే శిక్షణకు హాజరుకావాలి. స్పెల్ లో మార్పులు అంగీకరించబడవు.
4. TG School Education యాప్ ద్వారా ఆన్‌లైన్ హాజరు నమోదు చేయాలి. అందరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
5. హాజరు Geo-tag చేయబడుతుంది. కాబట్టి శిక్షణా ప్రాంగణం నుండే హాజరు నమోదు అవుతుంది.
6. లాగిన్ సమస్యలు ఉంటే మీ వివరాలను UDISE+ మరియు ISMS వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయండి.
*లాగిన్ అయిన తర్వాత మీ రిజస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది .కావున ISMS portal లో ఉన్న teacher info లో ఉన్న మొబైల్ నంబర్ కు మాత్రమే OTP వస్తుంది .కావున ఒకసారి వెరిఫై చేసుకోండి*
7. ప్రతి రోజు Check-in, Check-out యాప్ ద్వారా ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. కాబట్టి ఉదయం 9:30 కంటే ముందే హాజరు నమోదుకు రావాలి.
8. శిక్షణకు సంబధిత సబ్జెక్ట్ యొక్క అన్ని తరగతుల తరగతుల పాఠ్యపుస్తకాలు తీసుకురావాలి. ఒక డెమో పాఠాన్ని తయారు చేయాల్సి ఉంటుంది.
9. ప్రతి ఒక్కరూ ప్రీటెస్ట్, రోజువారీ ఫీడ్బ్యాక్, మరియు పోస్ట్‌టెస్ట్ తప్పనిసరిగా రాయాలి. అప్పుడు మాత్రమే E-సర్టిఫికేట్ పొందగలుగుతారు.
10. సంబంధిత సబ్జెక్ట్‌లోని FAC ప్రధానోపాధ్యాయులు కూడా శిక్షణలో తప్పనిసరిగా పాల్గొనాలి.


Please give your comments....!!!