Instructions to follow in case of elevation of FLN

గౌరవ మండల విద్యాధికారులకు, మండల నోడల్ అధికారులకు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, అన్ని ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు విజ్ఞప్తి......

ఈనెల 13, 14 తేదీలలో రాష్ట్ర పర్యవేక్షక బృందాలు జిల్లాలోని FLN. UNNATHI. LAKSHYA కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించగలరని కోరనైనది. ఈ బృందాలు నేరుగా గౌరవ విద్యాశాఖ సెక్రెటరీ గారికి మాత్రమే రిపోర్ట్ చేస్తారు. కావున ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించగలరు.

FLN, ఉన్నతి, లక్ష్య విషయంలో పాటించవలసిన సూచనలు


> ప్రతి పాఠశాలలో 6-Non-negotiables for FLN in Schools కి సంబంధించన పోస్టర్లు (చార్ట్ రూపంలో) ప్రదర్శించాలి.

> ప్రతి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకం, పీరియడ్ ప్లాన్, వర్క్ బుక్ లను సమాంతరంగా వాడాలి.

> ప్రతి పాఠశాలలో కాలనిర్ణయ పట్టిక (Time Table) తప్పనిసరిగా ఉండాలి. ఆ Time table లో లైబ్రరీ పీరియడ్ తప్పనిసరిగా ఉండాలి.

> విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలు ఇంటికి ఇవ్వడం, లేదా పాఠశాలలో వాడుతున్న వివరాలు నమోదు చేస్తున్న రిజిస్టర్ ఉండాలి.

> ప్రతి వర్క్ షీట్ లో ఉపాధ్యాయులు సంతకం పెట్టి తేదీ వేయాలి. పాఠ్యపుస్తకంలో పిల్లలు రాసిన రాత పనులను కూడా ఉపాధ్యాయులు కరెక్షన్ చేసి తేదీ తో సహా సంతకం పెట్టాలి.

> తరగతి గది లో పాఠ్య బోధన పీరియడ్ ప్లాన్ ప్రకారం జరగాలి.

> బోధనఅభ్యసన సామాగ్రి (ILM) తప్పనిసరిగా వాడాలి.

> విద్యార్థులలో కనీస సామర్ధ్యాలు అనగా చదవడం, రాయడం, మౌలిక గణిత భావనలు ప్రదర్శించేవిధంగా చర్యలు తీసుకోవాలి.

> ప్రారంభ పరీక్ష, నెలవారి విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల స్వీయ మూల్యాంకనం (Teachers self-assessment) లను Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

> పాఠశాలలో best practises ఏవైనా ఉంటే వాటిని ప్రదర్శించాలి.

> ప్రతి ప్రధానోపాధ్యాయులు తరగతి గది పరిశీలనా పత్రాలను పూర్తి చేసి ఆ వివరాలను Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

> పాఠశాల ఆవరణ, టాయిలెట్స్, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

పాఠశాలలో నమోదైన ప్రతి విద్యార్థి వివరాలు U-dise. FRS లలో నమోదై ఉండాలి. ప్రతి రోజు FRS ద్వారా హాజరు నమోదు చేసి ఉండాలి.

> MDM పరిశుభ్రంగా, రుచికరంగా, మెనూ ప్రకారం అందించేటట్లుగా, అలాగే MDM రిజిస్టర్ Updated గా ఉండాలి.

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పాత్ర


> తమ పరిధిలోని ప్రతి పాఠశాలను నెలలో 2 సార్లు సందర్శించి ఆ సందర్శన వివరాలను Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

> స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల మినిట్స్ ప్రతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుని వద్ద అందుబాటులో ఉంచుకోవాలి.

> ఈ రెండు రోజులు ఉపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చెయ్యరాదు.

>కాంప్లెక్స్ స్థాయి సమీక్షా సమావేశ (ప్రతి నెల 28 వ తేదీన జరగవలసినది) వివరాలు Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి.

> మీ మీ పరిధిలోని పాఠశాలలలో best practises ఏవైనా ఉంటే వాటి documentation ప్రదర్శించాలి.

>మీ మీ పరిధిలోని పాఠశాలలలో గ్రంధాలయ సంబంధిత కార్యక్రమాలు ఏమైనా చేపట్టినట్లైతే వాటి వివరాలు దగ్గర ఉంచుకోవాలి.

> ప్రతి పాఠశాలలో 6-Non-negotiables for FLN in Schools కి సంబంధించన పోస్టర్లు (చార్ట్ రూపంలో) ప్రదర్శించేటట్లుగా చూడాలి.

ఉన్నతి (UNNATHI) కార్యక్రమ అమలు లో పాటించవలసిన సూచనలు

ఉపాధ్యాయుల పరంగా పాటించవలసిన సూచనలు:


** ప్రతి ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయిని వారు బోధించే సబ్జెక్ట్స్ కు సంబంధించిన యూనిట్ ప్లాన్స్ తప్పనిసరిగా రాసుకొని ఉండాలి.

* తరగతి బోధన ఉన్నతి మాడ్యూల్ ప్రకారం సూచించిన తరగతి గది బోధన సోపానాల ప్రకారం జరగాలి.

* ఉన్నతి కి సంబంధించిన విద్యార్థుల ప్రారంభ పరీక్ష, ప్రతి నెల విద్యార్ధుల ప్రగతి Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి.

ప్రతి నెల ఉపాధ్యాయుల స్వీయ మూల్యాంకనం (Teachers self-assessment) Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేయాలి. అలాగే స్వీయ మూల్యాంకన పత్రాలను ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి.

* ఉపాధ్యాయులు టీచర్స్ డైరీ తప్పనిసరిగా రాయాలి. దానిపై ప్రతి రోజు ప్రధానోపాధ్యాయుని సంతకం ఉండేటట్లుగా చూసుకోవాలి.

* అర్ధవంతమైన TLM తరగతి గదిలో వాడాలి. అలాగే ICT/ IFP ల వినియోగం ఉండాలి.

* ప్రయోగశాల, గ్రంధాలయం నిరంతరం వాడుతూ ఉండాలి.

* ప్రతి తరగతి గదిలో పీరియడ్ ప్లాస్ సోపానాలు ప్రదర్శించాలి.

* ప్రతి తరగతి గదిలో మీ మీ సబ్జెక్ట్ కు సంబంధించిన అభ్యసన ఫలితాలు (Learning Outcomes) చార్ట్ రూపంలో ప్రదర్శించి ఉండాలి.

ప్రధానోపాధ్యాయులకు సూచనలు:


* ప్రతి పాఠశాలలో కాల నిర్ణయ పట్టిక (Time Table) ఉండాలి. దానిలో గ్రంధాలయ పీరియడ్ తప్పనిసరిగా ఉండేటట్లుగా చూసుకోవాలి.

* ప్రారంభ పరీక్ష పాఠశాల స్థాయి వివరాలు సిద్దంగా ఉంచుకోవాలి.

*** ప్రతి పాఠశాలలో 8- Non -Negotiables for UNNATHI in schools చార్జ్ రూపంలో ప్రదర్శించాలి.

* తరగతి గది పరిశీలనా పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

* ప్రతి ఉపాధ్యాయుని యొక్క యూనిట్ ప్లాన్ పైన ప్రధానోపాధ్యాయుని సంతకం ఉండాలి.

* ఉపాధ్యాయుల టీచింగ్ డైరీ పై ప్రతి రోజు ప్రధానోపాధ్యాయుని సంతకం ఉండాలి.

* పాఠశాల స్థాయి సమీక్షా సమావేశ వివరాలు ప్రతి నెల 27 వ తేదీన జరగవలసినది) మినిట్స్ నమోదు చేసి ఆ వివరాలను Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి.

* విద్యార్థుల హాజరు పెంపుదలకు తీసుకున్న చర్యలు

* తల్లిదండ్రుల సమావేశాల (PTM) మినిట్స్, అందులో తీసుకున్న నిర్ణయాల అమలు వంటి వాటిపై స్పష్టత ఉండాలి. సంబంధిత రిజిస్టర్స్ అందుబాటులో ఉంచుకోవాలి.

* పాఠ్యపుస్తకాల పంపిణీ, గ్రంధాలయ పుస్తకాల వినియోగం, ప్రయోగశాల వినియోగం, ICT/IFP ల వినియోగం మొదలగు వివరాలు అందుబాటులో ఉండాలి.

*** ఈ రెండు రోజులు ఉపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చెయ్యరాదు.

* పిల్లలకు చదవడం, రాయడం, మౌలిక గణిత భావనలు. ఆయా తరగతులకు సంబంధించిన పూర్వ భావనలు, తరగతికి ఆశించిన అభ్యసన ఫలితాలు (Learning Outcomes) వచ్చి ఉండేటట్లుగా చూసుకోవాలి.

* పాఠశాల ఆవరణ, టాయిలెట్స్, తరగతి గదులు, పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి.

* పాఠశాలలో నమోదైన ప్రతి విద్యార్థి వివరాలు U-dise+, FRS లలో నమోదై ఉండాలి. ప్రతి రోజు FRS ద్వారా హాజరు నమోదు చేసి ఉండాలి.

* MDM పరిశుభ్రంగా, రుచికరంగా, మెనూ ప్రకారం అందించేటట్లుగా, అలాగే MDM రిజిస్టర్ Updated గా ఉండాలి.

మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులకు సూచనలు:

మండల పరిధిలోని ప్రతి పాఠశాలను సందర్శించి ఆ సందర్శన వివరాలను Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి.

నెలవారి సమీక్షా వివరాలను Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి.

కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు అందుబాటులో ఉంచుకోవాలి.

వీటితో పాటుగా ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన సూచనలు అమలయ్యేటట్లుగా చూడాలి.

రాష్ట్ర బృందాలు ఆయా మండలాలలో పర్యటిస్తున్న సమయంలో ఆయా మండలాల లోని ప్రధానోపాధ్యాయులకుగాని, ఉపాధ్యాయులకు గాని ఎటువంటి సెలవులు మంజూరు చెయ్యరాదు.

. ఈ పర్యటన సమయంలో రాష్ట్ర బృందాలకు కావలసిన వసతి, మరియు భోజన సదుపాయాలు సమకూర్చాల్సిన బాధ్యత తీసుకోవాలి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts