Some Doubts on Teachers Transfers Clarifications in Telugu

బదిలీలు-పదోన్నతులు-2023 సందేహాలు ..సమాధానాలు..




మిత్రులందరికీ నమస్తే,

*బదిలీలు, పదోన్నతుల వివరణ*

*బదిలీలు:*
*1. GO 5 ప్రకారం NCC ఆఫీసర్స్ కు ముందుగానే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వారికి లాంగ్ స్టాండింగ్ ఖాళీలు చూపడం కుదురదని, బదిలీలు పూర్తి అయి టీచర్లు కొత్త పాఠశాలలో చేరే వరకు ఏమి జరుగుద్దో తెలువదు, కావున వారికి NCC స్కూల్స్ లో existing క్లియర్ ఖాళీలను మాత్రమే చూపిస్తారు.*   
*2. 40% PHC అభ్యర్థులను preferential కేటగిరీగా పరిగణించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. కానీ తీర్పు ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటికైతే 70% ఆపై PHC ఉన్న వారికి మాత్రమే ప్రిఫరెన్సియల్ కేటగిరీ వర్తిస్తుంది.*

*పదోన్నతులు:*

*1. BED అర్హతలు కలిగిన SGT లకు PSHM పోస్టుకు పదోన్నతి ఇచ్చే విషయంలో... NCTE నిబంధనలు SGT post కు D.ED వారు మాత్రమే అర్హులు అని ఉన్నది. కాబట్టి ఆ నిబంధన నియామకాలకు వర్తిస్తుంది. కాబట్టి ఇంతకు ముందే పనిచేస్తున్న B.ED వారికి పదోన్నతులు ఇవ్వనిరాకరించడం కుదురదు. D.ED వారితో పాటు B.ED వారికి కూడా పదోన్నతులు ఇవ్వబడుతాయి.*

*2. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం online లోనే పదోన్నతులు జరుపడానికి నిర్ణయం అయ్యింది. Seniority, roster పక్కాగా అమలు చేసేలా ఆప్ డెవలపర్లకు సూచనలు ఇచ్చాము. వాళ్ళు సకాలంలో పెర్ఫెక్ట్ గా చేయలేని పక్షంలో, ప్రభుత్వానికి నివేదిస్తాము. ప్రభుత్వం online నిర్ణయం మార్చితే పదోన్నతులు ఆఫ్లైన్ లో జరుపబడుతాయి.*

*2023 బదిలీలు ప్రమోషన్ల సమాచారం*

  *గజిటెడ్ హెడ్మాస్టర్స్ ప్రమోషన్స్ సీనియార్టీ లిస్టు వివరణ


*👉ప్రమోషన్ సీనియార్టీలో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తేదీ కామన్ గా తీసుకోవడం జరిగింది ( అనగా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకున్న తేదీ నుండి సుమారు15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ తీసుకోవడం జరిగింది)*

*👉 డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ లో గ్రేస్ పీరియడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఉన్న విధంగా సుమారు నెల రోజుల వరకు తీసుకోవడం జరిగింది*

*👉స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కామన్ తేదీ ఉన్నట్లయితే ఫీడర్ కేడర్ లో తేదీని తీసుకోవడం జరిగింది అది కామన్ గా ఉన్నట్లయితే వారి SGT ర్యాంకుల ( కేవలం మెరిట్ ర్యాంకులు మాత్రమే ) ప్రకారం సీనియార్టీలో కూర్చోబెట్టడం జరిగింది*

*👉డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళలో కామన్ తేదీ ఉన్నట్టయితే వారి ర్యాంకు( కేవలం మెరిట్ ర్యాంకులు మాత్రమే ) ప్రకారం తీసుకోవడం జరిగింది*

*👉ప్రమోషన్ తేదీ ఫీడర్ కేడర్ తేదీ కామన్ గా ఉండి ర్యాంకులు లేని వారివి వారి యొక్క డేట్ అఫ్ బర్త్ తీసుకొని సీనియార్టీ నిర్ణయించడం జరిగింది*

*ర్యాంకు ల వివరణ✍️*


*👉 స్కూల్ అసిస్టెంట్ ర్యాంకులు అన్ని సబ్జెక్టుల మొదటి ర్యాంకులు ( కేవలం మెరిట్ ర్యాంకులు మాత్రమే ) తీసుకుని సీనియారిటీని లెక్కించడం జరుగుతుంది*

*ఇంకా ఉపాధ్యాయులకు ఏవైనా సందేహాలు ఉంటే పై విషయాలను పరిశీలించి సంబంధిత ఆధారాలతో జిల్లా విద్యాశాఖ అధికారికి ఆపిల్ అందించినట్లయితే డీఈవో గారు వెరిఫై చేసి ఆర్జెడి గారికి పంపించి రెట్టిఫికేషన్ చేయించడం జరుగుతుంది*


ఉపాధ్యాయ బదిలీల్లో స్పౌజ్ అంశంపై కొన్ని వివరణలు :


1. 2018 ఉపాధ్యాయ బదిలీలల్లో భార్య/భర్త ఇరువురిలో ఒకరు వాడుకున్నప్పుడు

i). 5 సంవత్సరాలు పూర్తి అయ్యాయి కాబట్టి GHM ఇప్పుడు స్పౌజ్ పాయింట్స్ వాడుకోవడానికి అవకాశం ఉంది.

ii). ఉపాధ్యాయులైతే 8 సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి వారికి ఈ బదిలీలలో స్పౌజ్ పాయింట్స్ వాడుకోవడానికి అవకాశం లేదు.

iii). ఈ నిబంధనలు ఇరువురు టీచర్లైన సందర్భంలోనూ, ఒకరు టీచర్ మరియు మరొకరు ప్రధానోపాధ్యాయులు అయిన సందర్భంలోనూ వర్తిస్తుంది.

2. స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి గత ఫిబ్రవరిలో అనుసరించదలచిన విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారు. 

3. జియో ట్యాగ్ కు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు పరిశీలనలో లేవు.

4. స్పౌజ్ పాయింట్స్ ఆప్ట్ చేసుకుని బదిలీ కోరుకునేవారు స్పౌజ్ ఉన్న జిల్లాలో ఏ అనువైన పాఠశాలకైనా బదిలీ కోరుకునే అవకాశం ఉంటుంది. 

*సందేహాలు - సమాధానాలు:


*ప్ర:* భార్య భర్త ఇద్దరు లాంగ్ స్టాండింగ్ అయినప్పుడు nearest school ఎలా select చేసుకోవాలి?

*జ:* spouse category లో 10 అదనపు points claim చేసుకొని, భార్యా భర్తలు ఇరువురూ వారి వారి serial number ప్రకారం, జిల్లా లోని ఏ school కైనా వెళ్ళవచ్చు.

*ప్ర:* February లో అప్లయ్ చేసిన వారు, ఇప్పుడు Update చేయకుండా application print తీసుకుంటే, cut off date 1.9.23 కు మారి కనబడుతోంది, కానీ points పాతవే వస్తున్నాయి, దీనికి పరిష్కారం?

*జ:* DSE వారి సూచనల ప్రకారం, update అవసరం లేదు. Last date తర్వాత Points update అవుతాయి అంటున్నారు. 
auto update సౌకర్యం ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

*ప్ర:* ఒక టీచర్ 2003లో SGT గా అపాయింట్ అయి, 2005 లో direct school asst గా select అయితే, service points 2003 నుండి count చేయాలా? 2005 నుండి count చేయాలా?

*జ:* Sgt పోస్టుకి resign chesi, Direct గా School Assistant పోస్టులో జాయిన్ అయినవారు School Assistant joining date ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి 
ఒకవేళ ప్రభుత్వ అనుమతితో ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులో జాయిన్ అయితే మాత్రం SGT జాయినింగ్ డేట్ ని పరిగణలోకి తీసుకోవాలి.

1.ఒక టీచర్ 317 ప్రకారం as per సీనియారిటీ అనుసరించి ఒక జిల్లాకు allocated అయినారు ..అక్కడ కొన్ని రోజులు శాలరీ క్లెయిమ్ చేసి తిరిగి..reverse spouce ద్వారా మా జిల్లా కు వచ్చారు.
వారి సర్వీస్ ఎప్పటి నుండి కౌంట్ చేస్తారు ప్రమోషన్ కు, బదిలీకి.?
👉🏿GO 317 సందర్భంగా ఆదిలాబాద్ నుండి జగిత్యాల వచ్చిన spouse టీచర్ కు బదిలీల పాయింట్స్ ఎలా ఇస్తారు.
👉🏿నేను SA 8 ఇయర్స్ నా spouce SGT.. స్పెషల్ పాయింట్స్ నా wife వాడుకుంటే..నాకు near by స్కూల్ పాయింట్ కు ఎలా ట్రాన్సఫర్ చేస్తారు.
👉🏿నేను జగిత్యాల జిల్లా లో 13 ఇయర్స్ పని చేసినా..ప్రస్తుతం JS జిల్లాలో ఉన్న నేను లాంగ్ స్టాండింగ్ అవుతానా..నేను కూడా బదిలీ అప్లికేషన్ పెట్టుకోవాలా.
👉🏿ఒకే క్యాడర్ లో ఇద్దరు టీచర్స్ కు same పోయింట్స్ వస్తే..year of DSC గాని ఒకే dsc అయితే ర్యాంక్ చూస్తారా?ఎవరు ముందు వరస లో ఉంటారు.
👉🏿317 ద్వారా spouce quota లో వచ్చి జిల్లాలో ముందుగా కౌన్సెలింగ్ లో పాల్గొని పోస్టింగ్ పొందిన ఉద్యోగి..ఇప్పుడు మళ్లీ spouce వాడుకోవచ్చా.
ఇంకా చాలా ఉన్నాయి.ప్రశ్నలు

*గతంలో ఉన్న రూల్స్ ప్రకారం సమాధానం ఇస్తున్నాను..*

*1👉🏿ఒక యూనిట్ నుండి మరొక యూనిట్ కు బదిలీ/ఆలోకేషన్ అయి జీతం పొందితే..ఆ ఉద్యోగి ఆ జిల్లా ఉద్యోగి అవుతారు..*
*తిరిగి ఉద్యోగి రిక్వెస్ట్ ద్వారా తిరిగి old యూనిట్ వస్తే.. చేరినా తేదీ నుండి సర్వీస్ ఇస్తారు.*

*Note..317లో చాలా ఓల్డ్ రూల్స్ రిలాక్సేషన్ ఇచ్చారు..*

*దీనికి సరి అయిన సమాధానం JD,hyd నుండి రాత పూర్వక సమాధానాలు DEO's కు రావాలి.*

*2👉🏿ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీ నిబంధనలు ప్రకారం.. పాత జిల్లా సర్వీస్ కోల్పోతారు..*
*ఇది కూడా పై అధికారుల నుండి సమాధానం రావాల్సి ఉన్నది.*
*3👉🏿ప్రస్తుతం geo టాగింగ్ సాధ్యం కాకపోవచ్చు.. SA బదిలీ ముందు* *అవుతుంది.. దాని ఆధారంగా SGT web ఆప్షన్ లో near by స్కూల్స్ కు ప్రియారిటి ఇవ్వండి.*
*4👉🏿జగిత్యాల జిల్లా స్కూల్ లొకేషన్ నుండి పాయింట్స్ పొందుతారు..అంతే.*
*5👉🏿ఒకే క్యాడర్ లో ఇద్దరికి same పాయింట్స్ వస్తే.. పుట్టిన తేదీ ఆధారంగా ముందు వరుసలో ఉంచుతారు.*
*6👉🏿5/8 ఇయర్స్ లోపల వాడుకోరాదు.. కానీ పై అధికారుల నుండి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.*

*317 GO వల్ల చాలా సమస్యలకు రాత పూర్వక సమాధానాలు పై అధికారుల ను DEO's అడగటం లేదు..పై అధికారులు ఇవ్వటం లేదు..*
*కేవలం రోజు జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో మౌఖిక(oral orders) సమాధానాలు మాత్రమే ఇస్తున్నారు.*

ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే పూర్తి వివరాలు కు పై అధికారులకు సంప్రదించండి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

1 Comments

  1. Sir 2008dsc lo sgt ga select aite 2012 dsc marala select ite athaniki sevirce points ekada nundi count chestaru

    ReplyDelete

Please give your comments....!!!

Recent Posts