Frequently Asked Questions Sandehaalu Samaadhaanaalu on Service Rules

*సందేహాలు - సమాధానాలు*

ప్రశ్న:
*నమస్తే సర్. నేను సెప్టెంబర్ లో హాఫ్ పే లీవ్ మీద 20 రోజులు మెడికల్ కారణాల వల్ల తీసుకున్నాను. HRA ఫుల్ గా ఇస్తారా లేక సగమా?*

జవాబు:
*HRA full upto 180 days వరకు ఇస్తారు.*


ప్రశ్న:
*Compasinate appointment ఇవ్వాలి అంటే local non local చూడాలా? భర్త నల్గొండ. భార్య వేరే జిల్లా. ప్రస్తుతం నల్గొండలో స్థిర పడ్డారు. భార్య కు నల్గొండలో ఉద్యోగం ఇవ్వవచ్చునా?*

జవాబు:
*తప్పకుండా చూడాలి. జిల్లా స్థాయి పోస్టులన్నీ Presidential Order కు లోబడే ఉంటాయి. ఇందులో 20 శాతం నాన్ లోకల్స్ కు కూడా ఇవ్వవచ్చు. ఆఫీసు రికార్డు పరిశీలించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.*

*పిల్లలకు ఇవ్వాలంటే తప్పనిసరిగా వారి ఎడ్యుకేషన్ ని బట్టి ఏ ప్రాంటానికి లోకల్ అవుతారో అక్కడే ఇవ్వాలి.*
*ఒకవేళ భార్యకి ఇచ్చేటట్లయితే వారు కోరుకునే దానిని బట్టి భర్త చివరగా పని చేసిన యూనిట్ లో లేదా ఎడ్యుకేషన్ ని బట్టి లోకల్ లో ఎక్కడైనా ఇవ్వవచ్చు.*


ప్రశ్న:
*సర్, LIC అనేది కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందినది కదా ! ఇటీవల కాలంలో AP ప్రభుత్వం కొంత ఎమౌంట్ డ్రా చేసిందని వింటున్నాము. ఇది ఎలా సాధ్యం?*

జవాబు:
*అది ఒక ఇన్సూరెన్స్ కంపనీ. అందులో ప్రస్తుతం 100% కేంద్ర ప్రభుత్వం వాటాని కలిగి ఉంది.*
*ఇటీవల మెజారిటీ షేర్ ప్రభుత్వం ఉంచుకుని మిగిలినది IPO కి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 లో IPO కి వచ్చే అవకాశం ఉంది. 10% షేర్లు LIC పాలసీ దార్లకి కేటాయించాలని నిర్ణయించుకుంది. కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తో పాటు ప్రైవేట్ కంపనీలు, వ్యక్తులు, పాలసీదార్లు కూడా LIC లో వాటాని కలిగి ఉంటారు.*


ప్రశ్న:
*RTC వారు 2019 లో సమ్మె చేశారు కదా ! మరి ప్రభుత్వ ఉద్యోగులగా మన సమస్యల పరిష్కారానికి మనం ఎందుకు సమ్మె చేయడానికి వెనకడుగు వేస్తున్నాం?*

జవాబు:
*RTC ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారు కార్మిక చట్టాల పరిధిలో ఉంటారు. వారు సమ్మె చేసే హక్కును కలిగి ఉంటారు.*

*ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణా నియమావళి ప్రకారం సమ్మె చేసే హక్కుని కలిగి ఉండరు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి అంత తేలికగా వెళ్లలేరు. అనేక దశల తరువాత చివరి అస్త్రంగా మాత్రమే ఈ స్థాయికి చేరగలరు.*

*ఎప్పుడో NTR గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉద్యోగులు సమ్మె కు వెళ్లారు. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ/ సమైక్యాంధ్ర కోసం చేసిన సమ్మె మాత్రమే, సమ్మె చేసిన సందర్భాలు ఉన్నాయి*

*సందేహాలు - సమాధానాలు*

 ప్రశ్న:
*APGLI నుండి పొందిన ఋణానికి వడ్డీ చెల్లించాలా?*

జవాబు:
*ఋణం మంజూరు చేసే సమయంలోనే వడ్డీ కూడా అంచనా వేసి సమాన నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు.*


 ప్రశ్న:
*నేను 13.6.16 న విధులలో చేరాను. ట్రైనింగ్ లేదు. కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు. ఇపుడు జాయినింగ్ తేదీగా ఏది SR లో రాయాలి?*

జవాబు:
*జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 రే అవుతుంది.*


ప్రశ్న:
*నేను cps ఉద్యోగిని. సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. Cps మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ ఫారం లో ఎలా చూపాలి?*

జవాబు:
*30,000/- వరకు 80ccd(1) కింద, మిగిలిన 23,000/- ను 80ccd(1బి)కింద చూయించి పన్ను మినహాయింపు పొందవచ్చు.*


ప్రశ్న:
*ఈ సంవత్సరం రెండు da లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది. 20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు da లు గత సంవత్సరం ఆదాయంలో చూయించుకోవచ్చా?*

జవాబు:
*చూపించుకోవచ్చు. గత సంవత్సరంనకు చెందిన బకాయిలను ఆయా సంవత్సరాలలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 10-E సమర్పించాలి.*


 ప్రశ్న:
*నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను. నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను. నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా?*

జవాబు:
*ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హత లతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.*

*💥ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు. గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి.*
👇
 *(Memo.No.16965/77/A&L/185 Dt:13-02-1987)*

*👉🏻ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం(AAS) ఇంక్రిమెంట్ల మంజూరుకు మాత్రం ఉద్యోగి వ్యక్తిగతంగా దరఖాస్తు పెట్టుకోవాలి.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

1 Comments

  1. సార్ ప్రస్తుతం నేను, ఖమ్మం జిల్లాలోని, నాలుగో తరగతి ఉద్యోగిగా 8 సంవత్సరాలుగా పని చేస్తున్నాను.. నా సొంత జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేను నా సొంత జిల్లాకు అనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆప్షన్ పెట్టుకుంటే, సర్వీస్ రూల్స్ ప్రకారం నా 8 సంవత్సరాల సీనియార్టీ, పోతుందా???? అని సందేహంగా ఉంది... దయచేసి వివరించగలరు

    ReplyDelete

Please give your comments....!!!

Recent Posts