LATEST UPDATES ...

Allocation Under Spouse Information in Telugu and Readymade Forms

Search and get any information at below Google box
Related Posts ...

🧑‍💻 *స్పౌజ్ బదిలీల సమాచారం, రెడీ మెడ్ ఫారం లు.*

 *👉స్పౌజ్ అప్పీల్స్ ఉమ్మడి జిల్లా డిఈఓ కి ఇవ్వాలి. ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తూ PO-2018 కారణంగా వేర్వేరు జిల్లాలకు కెటాయించబడిన స్పౌజ్ లను మాత్రమే కన్సిడర్ చేస్తారు. స్పౌజ్ ఇరువురు వారికి కెటాయించబడిన జిల్లాలో రిపోర్ట్ చేసి, జాయినింగ్ పర్మిషన్ లెటర్ అప్పీల్ తో జతచేయాలి.

*👉స్పౌజ్ లో ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే PO-2018 ప్రకారం ఎవరు ఎక్కడికి బదిలీ అయ్యారో తెలియజేయాలి. జాయినింగ్ రిపోర్టు జతచేయాలి.*

*👉స్పౌజ్ లో ఒకరు PO-2018 పరిధిలోకి రానివారు(కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు etc) ఉంటే అప్పీల్ లో ఆ విషయం వ్రాయాలి.*

👉 *స్పౌజ్ అప్పీల్స్ కావాల్సిన ఫారం లు 1. స్పౌజ్ సర్టిఫికెట్, 2. ఇరువురి అలోకేశన్ ఆర్డర్స్, 3. అప్లికేషన్ ఫారం, 4. స్పౌజ్ డిక్లరేషన్ ఫారం, ఈ క్రింద క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయగానే మీ వివరాలు నమోదు నింపిన ఈ ఫారం లు pdf, ప్రింట్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు*



*Spouce కేటగిరీ వాళ్లు ఉమ్మడి జిల్లా విద్యాధికారి దగ్గర కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లా లోని విద్యాధికారుల కు అప్లై చేసుకోవాలి అని నిజామాబాద్ జిల్లా విద్యాధికారి గారు తెలిపారు అలాగే కామారెడ్డి జిల్లా విద్యాధికారి గారు కూడా అప్లై చేసుకోమని తెలిపారు కానీ వారికి కూడా విద్య శాఖ నుండి సరి అయిన సమాచారం లేదు* 

  *👉ఎలా అప్లై చేయాలి ? ఎవరికి అప్లై చేయాలి ?*

*👉 spouse certificate ఎవరు ఇవ్వాలి ..?*

*👉 జోన్ మల్టీ జోన్ లో ఆలోకేషన్ కాలేదు... వారు ఎలా చేసుకోవాలి ?*

*👉 అలోకేశన్ అయిన ఉపాధ్యాయుల spouse వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ( same dist లో పనిచేసే central employes) చేసుకోవాలా ...?*

*👉 అప్లికేషన్ తో పాటుగా ఏం జత చేయాలి..?*

*ఇలా అనేక ప్రశ్నలు ఉన్నవి వీటి పై పూర్తి గా సమాచారం తెలుసుకొని మీకు మెసేజ్ ద్వారా తెలియ చేస్తాము*
*జిల్లా శాఖ ఎప్పుడు అందరికన్నా ముందుగానే సమాచారం అందిస్తుంది కావున పూర్తి సమాచారం అందగానే జిల్లా శాఖ తెలియజేస్తుంది*

భర్త. బార్య అనేది ముఖ్యము కాదు ఎవరు ఎవరి దగ్గరకు వెళతారు అనేది ముఖ్యము బార్య దగ్గరకు భర్త పోవచ్చు భర్త దగ్గరకు బార్య పోవొచ్చు వారి ఇష్టం

ఖాళీ లభ్యతను బట్టి భార్యాభర్తలకు జిల్లాలు కేటాయిస్తారు. భార్య, భర్త వేరు వేరు జిల్లాలో పని చేస్తే ఎవరి జిల్లాలో ఖాళీలు ఉంటే అక్కడికి వారిని పంపిస్తారు ఇద్దరూ ఒకే చోట ఎక్కడైనా పని చేయాలని ప్రభుత్వ లక్ష్యం

 ఈ ఉత్తర్వుల ప్రకారం వేర్వేరు జిల్లాలకు ఆలోకెట్ అయిన భార్యాభర్తలు ఒకే జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం కల్పించబడినది.
దీనికోసం వేర్వేరు జిల్లాల్లో జాయిన్ అయిన ప్రతులు, డిస్ట్రిక్ట్ ఆలోకేషన్ ప్రొసీడింగ్ జత చేసి పైన తెలిపిన నిర్ణీత ప్రొఫార్మలో జిల్లా HoD దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా , జోనల్ , మల్టి జోనల్ ఉద్యోగుల కేటాయింపులో జీవిత భాగస్వామి ( Spouse ) అప్షన్ పై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సాధారణ పరిపాలన శాఖ మెమో No . 1655 /SPF 1 /2021 తేదీ 22 .12 .2021 ద్వారా ఈ వివరణ ఇచ్చారు . మొదట జిల్లా , జోనల్, మల్టి జోనల్ కేటాయించబడ్డ ఉద్యోగులు వారికీ కేటాయించిన విధంగా విధుల్లో చేరాలి. అనంతరం spouse వివరాలు పేర్కొంటూ నిర్ణిత ప్రొఫార్మా లో , జిల్లా ఉన్నతాధికారికి లేదా జోనల్ / మల్టి జోనల్ హెడ్ కు దరకాస్తు చేసుకోవాలి. వాటిని జిల్లా HoD లేదా HoD పరిశీలించి సంబంధిత శాఖ కార్యదర్శికి నివేదించాలి . సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని పరిశీలించి తగిన ఆదేశాలు జారీచేయవలసి ఉంటుంది.

భర్తకు మేడ్చెల్ /రంగారెడ్డి , భార్యకు వికారాబాద్ ....భార్య దగ్గరకి భర్తను పంపడం న్యాయం కదా ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకో వచ్చు

*స్పౌజ్ అప్లికేషన్ విషయంలో చాలా మంది తర్జన భర్జన పడుతున్నారు. ఆ విషయమై చిన్న క్లారిఫికేషన్.*

*స్పౌజ్ అప్లికేషన్ ను ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయం లో ఇవ్వవలసి ఉంటుంది. అలాగే స్పౌజ్ పరిధి ఉమ్మడి జిల్లాతో అనుబంధించబడి వేరైన జిల్లాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర జిల్లాలకు అనగా వేరు వేరు జిల్లాలకు వర్తించదు. (ఉదా: హైదరాబాదు, నల్గొండ / వరంగల్, ఖమ్మం.) కావున గమనించగలరు.*

*లోకల్ కేడర్ లో మీరు ఇచ్చిన అప్పీల్ వలన ఒకవేళ న్యాయం జరగలేదని అనిపిస్తే మీరు క్రొత్తగా కేటాయించిన జిల్లాలో రిపోర్ట్ చేసిన తరువాత మాత్రమే మరల అప్పీల్ ఇవ్వవలసి ఉంటుంది. దీనిని కూడా గమనించగలరు.* 🙏🙏
Click here to Join Our Telegram Group

0 comments:

Post a Comment

Please give your comments....!!!