Official Stamps Rules and Procedures in Telugu

👉 Official Stamps Rules and Procedures in Telugu

👉 వివిధ పత్రాలు, రిజిష్టర్ లు, రిపోర్ట్ లు, సర్టిఫికేట్ ల వేసే అధికారిక ముద్రల వివరాలు

1. పాఠశాల లో ఉండే ముద్రలు a. Round Seal, b. School Stamp, c. Headmaster Stamp, d. SMC Chairman Stamp, e. Complex Headmaster, f. Gaz. Headmaster Gr - 1, g. Gaz. Headmaster Gr - 2.

2. ఈ ముద్రలు తెలుగులో/ఉర్దూ కంటే ఇంగ్లీష్ లో ఉండడం మంచిది. ఏ భాషలో ఉన్న పర్వాలేదు కానీ ఇతర భాషల వార్కి అర్థమైయ్యే విధంగా ఉంటే మంచిది కదా.

3. రౌండ్ సీల్ ముద్ర: ఈ ముద్ర ను కొంత మంది అన్నింటి పైన వేస్తారు కానీ ఇలా వెయ్యకూడదు. Round Seal Stamp అనునది ఒక పత్రం ను ధృవ పరచడానికి వాడాలి. ఇది ధృవ పత్రాల పై మాత్రమే వేయాలి. అనగా Bonafide Certificate , Date of Birth Certificate , Service Certificate, Attendance Certificate, Servise Certificate, Study and Conduct Certificate, Caste Certificate, Last Pay Certificate, Salary Certificate etc...

4. Round Seal Stamp అనునది రాష్ట్ర ప్రభుత్వం పరిధి లో ఉన్న ఆఫీస్ లు అయితే తమ రాష్ట్ర అధికార చిహ్నం వాడాలి, ఉదా రాష్ట్ర ప్రభుత్వ బడులు ఉదా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ఆఫీస్ లు అయితే కేంద్ర ప్రభుత్వ అధికార చిహ్నం ఉన్న ముద్ర వాడాలి.ఉదా నాలుగు సింహాలు ఉన్న ముద్ర

5. Round Seal Stamp ముద్ర ను పేపర్ మీద పైన సరిగ్గా మధ్యలో ఉండేలా, ముద్రలోని అక్షరాలు కనపడే విధంగా సరైన క్రమంలో ఉండే విధంగా వేయాలి. ధృవ పత్రం లోని అక్షరాలు క్లియర్ గా కనిపించేలా ఉండాలి. 

6. మనం వేసే ముద్ర సరిగ్గా ఉంటే అధికారి మీద సరైన గౌరవాన్నీ ఇస్తాయి. ముద్ర తో పాటు అధికారి సంతకం వంకర గా కాకుండా లైన్ లో ఉండే విధంగా చేయాలి.

7. రౌండ్ సీల్ ముద్ర ను వివిధ రకాల రిపోర్ట్ ల మీద వేయకూడదు. ఉదా మధ్యాహ్న భోజన రిపోర్ట్, నెలవారీ రిపోర్ట్ లు

8. మనం వేసే ముద్ర సరిగ్గా ఉండేందుకు ముద్ర పై భాగాన శాశ్వత ఇంక్ పెన్ తో మార్క్ చేయవచ్చు, లేదా ముద్ర పైన మాదిరి ముద్ర ను వేయించుకోవాలి.

9. ముద్ర లు మార్చడం సరికాదు. అందుకే ముద్రలు తయారు చేసే సమయంలో సరిగ్గా ఉంది లేనిది చూసుకోవాలి. ముద్రలో ఆఫీస్ పేరు, మండలం, జిల్లా తప్పనిసరి గా ఉండాలి.ముద్ర వేయడానికి సులభంగా ఉండే విధంగా మాదిరి ముద్ర ను ముద్ర పై వేయించాలి.

10. School Stamp లేదా ఆఫీస్ ముద్ర: ఇది ఆఫీస్ పేరు కు ప్రత్యామ్నాయమంగా వాడే ముద్ర. అనగా వివిధ రకాల రిపోర్ట్ లు, పత్రాల మీద ఆఫీస్ పేరు రాయడానికి బదులుగా వాడవచ్చు. అనగా ఒక పత్రం రిపోర్ట్ ఏ ఆఫీస్ నుండి వచ్చింది తెలుపుతుంది.

11. ఈ ముద్రలో ఆఫీస్ పేరు, మండలం, జిల్లా తప్పనిసరి గా ఉండాలి. 

12. ఈ ముద్ర ను పైన చెప్పిన సర్టిఫికేట్ లపై ధృవ పత్రం ల మీద వేయకూడదు.

13. ఈ ముద్ర ను పేపర్ మీదా పై భాగాన ఎడమ వైపు గాని కుడి వైపు గాని వేయాలి. కుడి వైపు వేస్తే చూసే వారికి అనుకూలంగా ఉంటుంది.

14. Headmaster Stamp: హెడ్ మాస్టర్ గారు గెజిటెడ్ అయిన , నాన్ గెజిటెడ్ అయిన ఒకే రకమైన ముద్ర వాడాలి. వారు వాడే పెన్ ఇంక్ ను బట్టి వారి స్థాయి నిర్ధారణ అవుతుంది. అంతే గాని ముద్రలో Gaz. HEADMASTER, LFL HEADMASTER, PS HEADMASTER ఉండడం వల్ల అధికారి స్థాయి తెలియడం సరి కాదు. వేరే ఏ dept లో ఇలా ఉండదు.

15. ఒక వేళ హెడ్మాస్టర్ అందుబాటులో లేని ఎడల తదుపరి సీనియర్ సంతకం చేయునప్పుడు ఈ స్టాంప్ ఉపయోగపడుతుంది.

16. SMC Chairman Stamp: ఈ స్టాంప్ ను గ్రాంట్ UC ల మీద వేస్తారు. 

17. బడి కాంప్లెక్స్ అయితే HM గారికి మూడు స్టాంప్ లు ఉండాలి. A. HEADMASTER Stamp, B. COMPLEX HEADMASTER Stamp, Gaz Headmaster Stamp. బడికి రెండు స్టాంప్ లు ఉండాలి. A. Complex Stamp, School Stamp

18. Headmaster స్టాంప్ ను తమ బడిలో ను పత్రాలకు వాడాలి. ఉదా ZPHS రాంసాగర్

19. Complex Headmaster స్టాంప్ ను తమ కాంప్లెక్స్ లోని ఉపాధ్యాయుల కు వాడాలి. ఉదా CRC రాంసాగర్

20. Gaz. Headmaster స్టాంప్ ను వేరే ఎవరికైనా Attestation చేయుటకు వాడాలి.

21. Complex Stamp లో కాంప్లెక్స్ అని ఉండాలి. కొంత మంది ఇంకా తమ బడి పేరునే ఉంచుతున్నారు. అనగా ZPHS రాంసాగర్ అని కాకుండా CRC రాంసాగార్ అని ఉండాలి.

22. అన్ని రకాల ధృవ పత్రలు పై సంబంధిత అధికారి మాత్రమే సంతకం చేయాలి. రిపోర్ట్ ల పై ఇంచార్జీ సంతకం. చేయవచ్చు.

23. అధికారి గెజిటెడ్ అయితే తమ స్టాంప్ మరియు అక్షరాలు కనపడే విధంగా చిన్నగా ఉంటే చాలా మంచిది ఎందుకంటే వారు తమ ఉద్యోగుల సర్వీస్ పుస్తకాలలో ఈ ముద్ర వేయడానికి అనుకూలంగా అందంగా ఉంటుంది.

24. ఆఫీస్/అధికారి రకం పేరు లో Short Form అని ఉండకూడదు. అనగా MEO/CHM/CRC/MRC/HM అని కాకుండా పూర్తి పేరు ఉండాలి. అక్షరాల సైజ్ చిన్నగా ఉంటే మంచిది.

మీ అభిప్రాయాలు ఈ క్రింద కామెంట్ బాక్స్ లో రాయండి

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

1 Comments

  1. మీరు సూచించిన వివరాలు చాల బాగున్నాయి. 14 వ అంశంలో Gazetted Headmaster ను కూడా మామూలుగా Headmaster అనే చూపిస్తే బాగుంటుందన్నారు కాని ఆ పోస్టే Gazetted Headmaster ఐనప్పుడు అలా సగం పేరు ఎలా చూపిస్తాం?

    ReplyDelete

Please give your comments....!!!

Recent Posts