> ప్రతి పాఠశాలలో 6-Non-negotiables for FLN in Schools 3 కి సంబంధించిన పోస్టర్ లు (చార్ట్ రూపంలో) ప్రదర్శించాలి.
> ప్రతి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకం, పీరియడ్ ప్లాన్, వర్క్ బుక్ లను సమాంతరంగా వాడాలి.
> ప్రతి పాఠశాలలో కాలనిర్ణయ పట్టిక (Time Table) తప్పనిసరిగా ఉండాలి. ఆ Time table లో లైబ్రరీ పీరియడ్ తప్పనిసరిగా ఉండాలి.
> విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలు ఇంటికి ఇవ్వడం, లేదా పాఠశాలలో వాడుతున్న వివరాలు నమోదు చేస్తున్న రిజిస్టర్ ఉండాలి.
> ప్రతి వర్క్ షీట్ లో ఉపాధ్యాయులు సంతకం పెట్టి తేదీ వేయాలి. పాఠ్య పుస్తకంలో పిల్లలు రాసిన రాత పనులను కూడా ఉపాధ్యాయులు కరెక్షన్ చేసి తేదీ తో సహా సంతకం పెట్టాలి.
> తరగతి గది లో పాఠ్య బోధన పీరియడ్ ప్లాన్ ప్రకారం జరగాలి.
> బోధనఅభ్యసన సామాగ్రి (TLM) తప్పనిసరిగా వాడాలి.
> విద్యార్థులలో కనీస సామర్ధ్యాలు అనగా చదవడం, రాయడం, మౌలిక గణిత భావనలు ప్రదర్శించేవిధంగా చర్యలు తీసుకోవాలి.
> ప్రారంభ పరీక్ష, నెలవారి విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల స్వీయ మూల్యాంకనం (Teachers self-assessment) Telangana school education app తప్పనిసరిగా నమోదు చేయాలి.
> పాఠశాలలో best practises ఏవైనా ఉంటే వాటిని ప్రదర్శించాలి.
> ప్రతి ప్రధానోపాధ్యాయులు తరగతి గది పరిశీలనా పత్రాలను పూర్తి చేసి ఆ వివరాలను Telangana school education app లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
> పాఠశాల ఆవరణ, టాయిలెట్స్, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పాఠశాలలో నమోదైన ప్రతి విద్యార్థి వివరాలు U-dise. FRS లలో నమోదై ఉండాలి. ప్రతి రోజు FRS ద్వారా హాజరు నమోదు చేసి ఉండాలి.
> MDM పరిశుభ్రంగా, రుచికరంగా, మెనూ ప్రకారం అందించేటట్లుగా, అలాగే MDM రిజిస్టర్ Updated గా ఉండాలి.

Please give your comments....!!!