Type Here to Get Search Results !

Draft Guidelines on Bifurcation of Employees for AP Public Employment Order

(toc) Main Points 

Draft Guidelines on Bifurcation of Employees for AP Public Employment Order 


*~Bifurcation step by step process*~ 


•24-06-2026 → G.O.s విడుదల
• 27-29 జూన్ → పోస్టులు & సిబ్బంది ధృవీకరణ
• 01-07-2026 → Draft Seniority List
• 06-07-2026 → Final Seniority List
• 07-07-2026 → ఉద్యోగుల Options
• 12-07-2026 → Allocation Orders
• 16-20 జూలై → రిలీవ్ & కొత్త యూనిట్‌లో Joining
• 21-24 జూలై → Spouse Transfer Requests & Disposal
• 01-08-2026 → కొత్త యూనిట్‌లో Temporary Seniority
• 15-08-2026 → Final Seniority

25-08-2026 → *Service Records Transfer*

 **స్టేజ్-1: డేటా & సీనియారిటీ జాబితా సిద్ధం**


* కొత్త జిల్లాలు/జోన్లకు కేటాయించిన పోస్టుల సంఖ్య, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు పరిశీలిస్తారు.
* అన్ని ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం చేసి ధృవీకరిస్తారు.
* డిప్యుటేషన్, సెలవులు, సస్పెన్షన్‌లో ఉన్నవారి వివరాలు కూడా చేర్చబడతాయి. 

 **స్టేజ్-2: సీనియారిటీ జాబితా ప్రచురణ & ఆప్షన్లు**


* డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు.
* తుది సీనియారిటీ జాబితా ప్రకటిస్తారు.
* ప్రతి ఉద్యోగి కొత్త జిల్లా/జోన్/మల్టీ జోన్ కోసం తన ప్రాధాన్యత (Option) ఇస్తారు.
* ఒకసారి ఇచ్చిన Option మార్చుకునే అవకాశం ఉండదు. 

 **స్టేజ్-3: ఉద్యోగుల Allotment**


* ముందుగా పరిపాలనా అవసరాలను పరిశీలిస్తారు.
* ప్రత్యేక కేటగిరీలకు ప్రాధాన్యత ఇస్తారు:
  * 70% పైగా దివ్యాంగులు
  * మానసిక వికలాంగ పిల్లలు ఉన్నవారు
  * పునర్వివాహం చేయని వితంతువులు
  * తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు (క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మొదలైనవి)
* ఆ తర్వాత సీనియారిటీ + ఉద్యోగి ఇచ్చిన Option ఆధారంగా కేటాయింపు చేస్తారు.
* ఒకే స్థానానికి ఎక్కువ మంది Option ఇస్తే సీనియారిటీ ప్రకారం ఎంపిక చేస్తారు.
* SC/ST ఉద్యోగుల నిష్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

 **స్టేజ్-4: Allotment Orders & Joining**


* తుది Allotment List విడుదల చేస్తారు.
* ఉద్యోగులకు అధికారిక Allotment Orders ఇస్తారు.
* ఉద్యోగి 7 రోజుల్లో కొత్త కేడర్‌లో Joining Report ఇవ్వాలి.
* అవసరమైతే Posting Orders జారీ చేస్తారు.

 **స్టేజ్-5: Spouse Cases**


* భార్యాభర్తలు వేర్వేరు కేడర్లకు కేటాయించబడితే, ఇద్దరూ ఒకే కేడర్‌లో ఉండేందుకు తరువాత అవకాశం కల్పించవచ్చు.
* ఇది ఖాళీలు మరియు పరిపాలనా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. 

 **స్టేజ్-6: Appeals / Representations**


* Allotment పై అసంతృప్తి ఉంటే ఉద్యోగి Representation ఇవ్వవచ్చు.
* ప్రభుత్వం కమిటీ అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది.
* అవసరమైతే 30 రోజుల్లో తుది ఉత్తర్వులు జారీ చేస్తారు.

✅ **సారాంశం:**


**సీనియారిటీ + ఉద్యోగి Option + ప్రత్యేక కేటగిరీ ప్రాధాన్యత + పరిపాలనా అవసరాలు** ఆధారంగా ఉద్యోగుల కొత్త జిల్లా/జోన్/మల్టీ జోన్ కేడర్ Allotment జరుగుతుంది.

*🙋‍♂️_Bifurcation of Employees_ SGTF ::*


 *జిల్లాల కేటాయింపు అంటే మన సొంత జిల్లాకు మనల్ని పంపించడం కాదు.*

 మనం ప్రస్తుతం ఏ జిల్లాలో పనిచేస్తున్నామో, ఆ జిల్లా మరియు దాని పూర్వపు జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటారు...

*1. ఎలా విభజన చేపడుతారు...?*


 ఉమ్మడి జిల్లా ఆధారంగా సీనియారిటీ లిస్టులు తయారు చేస్తారు. ఉమ్మడి జిల్లా నుండి ఎన్ని జిల్లాలు అయితే విడిపోయాయో అన్ని జిల్లాల నుండి ఆయా కేడర్లకు సంబంధించిన ఉద్యోగుల అందరి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని జాబితా రూపొందిస్తారు. ఆ జాబితా ఆధారంగానే జిల్లాల కేటాయింపు జరుగుతుంది...

*2. పోస్టుల విభజన ఎలా ఉంటుంది...?*


ఉమ్మడి జిల్లాలోని పోస్టులను ఆయా నూతన జిల్లాలకు కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారు అనేది ఎంపిక ప్రక్రియకు ముందే తెలుస్తుంది...

*3. ఎంపికలో ప్రాధాన్యతలు ఏమైనా ఉంటాయా...?*


ఉత్తర్వులలో సూచించిన ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు మరియు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది...

*4. అందరు ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వాలా...?*


 తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఆప్షన్ ఇవ్వకపోతే పోస్టులు ఖాళీగా ఉన్న ఏదో ఒక జిల్లాకు అలాట్ చేయబడతారు...

*5. పూర్వపు జిల్లాలోని కొన్ని మండలాలు వేరే పూర్వపు జిల్లాలో కలిశాయి. అప్పుడు ఎలా చేస్తారు...?*


 ఏదైతే పూర్వపు జిల్లాలోని మండలాలు ఇంకో పూర్వపు జిల్లాలో కలిసాయో, కలిసిన మండలాలు కలిగిన పూర్వపు జిల్లా వాసులందరికీ ఏ ప్రస్తుత జిల్లాలో అయితే ఆ మండలాలు కలిశాయో ఆ ప్రస్తుత జిల్లాకు రావడానికి అవకాశం ఉంటుంది...

 *6.ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది...?*


 సీనియారిటీ జాబితాల ఆధారంగా మనం ఆప్షన్లు పెట్టుకోవలసి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగి పూర్వపు ఉమ్మడి జిల్లాలో ఎన్ని జిల్లాలుగా విభజన జరిగిందో అన్ని జిల్లాలకు మొదటి, రెండు, మూడు, నాలుగు ఇలా ఐచ్చికాలను పెట్టుకోవలసి ఉంటుంది. సీనియారిటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుంది...

*7. ప్రస్తుతం నేను నా స్థానిక జిల్లాలో పనిచేయడం లేదు. ఉమ్మడి జిల్లాలోని వేరే జిల్లాలో పనిచేస్తున్నాను. నా స్థానిక జిల్లాకు వెళ్లడానికి అవకాశం ఉంటుందా...?*


 ఉంటుంది కానీ సీనియారిటీ ఆధారంగానే ఉంటుంది. దొరికితే దొరకవచ్చు లేదంటే లేదు...

*8. ఒకవేళ నేను ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లాలోని ఇంకో జిల్లాకు ఎంపిక అయితే మళ్లీ అక్కడ పోస్టింగ్ ఇస్తారా...?*


 తప్పనిసరిగా ఇస్తారు...

*9. ఒకవేళ నేను ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాను ఎంపిక చేసుకొని దానిని పొందితే మళ్ళీ పోస్టింగ్ ఇస్తారా...?*


 ఇవ్వరు. మీరు ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాలో, పనిచేస్తున్న స్థానంలోనే ఉండవలసి ఉంటుంది...

*10. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులై చెరో జిల్లాకు వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి...?*


 ఇలాంటి సందర్భంలో మీ సీనియారిటీని బట్టి ఇద్దరు ఒకే జిల్లా ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చెరో జిల్లా వెళ్ళిపోతే పోస్టింగ్ పొందిన తర్వాత మళ్లీ స్పౌజ్ కేటగిరి అవకాశం ఇవ్వవచ్చు కానీ అది ఎప్పటికి అవుతుందో చెప్పలేం. అందుకే ముందుగా ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ స్పౌజ్ కేటగిరీ కింద భార్య వద్దకు భర్త లేదా భర్త వద్దకు భార్యను పంపించే ప్రయత్నంలో డిమాండ్ ఉన్న జిల్లాకు అవకాశం ఉండకపోవచ్చు. ఖాళీల లభ్యతను బట్టి అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా మన సీనియారిటీని బట్టి ప్రణాళిక వేసుకోవలసిన అవసరం ఉంది...

 *11. నేను జూనియర్ ని, నా సొంత జిల్లా మంచి పట్టణం, అందరూ అదే కోరుకుంటారు, నాకు నా సొంత జిల్లా వెళ్లడానికి అవకాశం ఉండదా...?*


 ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత మీ సొంత జిల్లా అలాట్ కాకపోతే మీరు ఏ జిల్లాకు అలాట్ అవుతారో అదే జిల్లాలో పనిచేయవలసి ఉంటుంది...

 *12. నా స్థానిక జిల్లా అలాట్ కాకపోతే వేరే జిల్లాలో శాశ్వతంగా పని చేయవలసిందేనా...?*


అవును. తప్పనిసరిగా మనం ఎన్నుకున్న జిల్లానే మనకు శాశ్వత జిల్లా అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో పరస్పర బదిలీలకు అవకాశం ఇస్తే చెప్పలేం కానీ అది కేడర్ వారీగానే ఉంటుంది ఉదాహరణకు విద్యాశాఖ అయితే కేడర్, సబ్జెక్టు, మీడియం, మేనేజ్మెంట్... వీటి ఆధారంగానే జరుగుతుంది...

 *13. నేను ఎంపిక అయిన డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్లో ఫారిన్ సర్వీస్ కింద పని చేస్తున్నాను. నాకు జిల్లా ఎలా కేటాయిస్తారు...?*


 తప్పనిసరిగా అందరికీ జిల్లాలు కేటాయించడం జరుగుతుంది. మీరు ఎంపిక అయిన డిపార్ట్మెంట్లో సీనియారిటీ జాబితాలో మీరు కూడా ఉంటారు. మీరు ఇచ్చే ఆప్షన్స్ బట్టి జిల్లా కేటాయించడం జరుగుతుంది. ఫారిన్ సర్వీస్ కాలం ముగిసిన తర్వాత పేరెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్ళినప్పుడు మీకు ఏ జిల్లా అయితే కేటాయించబడుతుందో ఆ జిల్లాలో వెళ్లి పని చేయవలసి ఉంటుంది...

*14. సీనియర్లు అందరూ మంచి జిల్లాకు వెళ్లిపోతే రెండు, మూడు సంవత్సరాలలో ఆ జిల్లాలో రిటైర్మెంట్ ద్వారా ఖాళీలు ఏర్పడతాయి కదా, అప్పుడు ఆ జిల్లా స్థానికత కలిగిన జూనియర్లను ఆ జిల్లాలకు బదిలీ చేస్తారా...?*


 చేయరు, ఆ జిల్లాలో రిక్రూట్మెంట్ ద్వారా నింపుకుంటారు కానీ ప్రస్తుతం మనం పనిచేస్తున్న జిల్లా నుండి ఇంకో జిల్లాకు బదిలీ అనేది ఉండదు. స్థానిక వాసులు అయినా సరే.

 *15. ఇలా అయితే జూనియర్లు అందరికీ అన్యాయం జరిగినట్టే కదా...?*


అలా అనుకోవడం తప్పు. ఉత్తరుల ప్రకారం విభజన జరుగుతుంది తప్ప స్థానికత ఆధారంగా జరగదు. ఖాళీల లభ్యతను బట్టి జూనియర్లు కూడా తమ సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉంటుంది...

*16. నేను 2007 లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయినాను. 2021 లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినాను. జిల్లా కేటాయింపు లో నా కేడర్ సీనియారిటీ ఏది అవుతుంది...?*


 మీరు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కేడర్ సీనియారిటీ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు...

*17. 2007లో సెలెక్ట్ అయిన సెకండరీ గ్రేడ్ టీచర్ కు ఇంకా ప్రమోషన్ రాలేదు. అలాంటప్పుడు కేడర్ సీనియారిటీ ఏది తీసుకుంటారు...?*


 ప్రస్తుతం తను పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ సీనియారిటీని తీసుకుంటారు...
Utf

*18. అలా అయితే 2021లో ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్ తన కేడర్లో జూనియర్ అవుతాడు కదా...?*


 అవును ఒకే సంవత్సరంలో ఒకే కేడర్లో నియామకం అయినా వారిలో ఎవరైనా ఒకరు ముందే ప్రమోషన్ పొందితే ప్రమోషన్ కేడర్ లో వాళ్ళు జూనియర్లు గానే ఉంటారు, ప్రమోషన్ రానివాళ్లు వాళ్ల పాత కేడర్ లో సీనియర్లుగానే ఉంటారు. ఇక్కడ జిల్లాల పంపకం విషయంలో కేవలం కేడర్ సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు అంతేకానీ మొదటి నియామకపు తేదీ కాదు...

 మొత్తం మీద ఉద్యోగులను ఆలోచింపజేస్తున్న జిల్లాల కేటాయింపు విషయంలో ఆలోచించవలసినది ఏమిటంటే... కేవలం కేడర్ సీనియారిటీ ఆధారంగానే ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా ఏ పూర్వపు జిల్లాలో ఉందో ఆ జిల్లాలకు మాత్రమే అవకాశం ఉంటుంది కానీ స్థానిక జిల్లాకు కాదు స్థానికత అనే పదాన్ని ఇక్కడ వదిలివేయండి. మన సొంత జిల్లాకి మనల్ని పంపడం కాదు కేవలం మనం పని చేస్తున్న జిల్లా ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఏ పూర్వపు జిల్లాలో ఉందో ఆ పూర్వపు జిల్లా ఎన్ని జిల్లాలుగా విభజన చెందిందో ఆ జిల్లాలకు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కేవలం సీనియారిటీ, ప్రిఫరెన్షియల్ కేటగిరీల ఆధారంగానే విభజన జరుగుతుంది. తప్పనిసరిగా అందరు ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చుకోవాల్సిందే. ఇదే ప్రక్రియ జోనల్ విషయంలో మరియు మల్టీ జోనల్ విషయంలో కూడా జరుగుతుంది.


*ఉద్యోగుల జిల్లా విభజన (Bifurcation of Employees) – ముఖ్యాంశాలు* 


జిల్లా కేటాయింపు అనేది "స్థానిక జిల్లా" ఆధారంగా కాదు. ప్రస్తుతం పనిచేస్తున్న కేడర్‌లోని సీనియారిటీ, ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్యతా కేటగిరీలు, రిజర్వేషన్ నిబంధనలు మరియు ఉద్యోగి ఇచ్చిన ఆప్షన్లు ఆధారంగానే జరుగుతుంది. అందువల్ల ప్రతి ఉద్యోగి అధికారిక మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని, ఆలోచించి ఆప్షన్లు నమోదు చేయడం అత్యంత అవసరం.

🔹 జిల్లాల కేటాయింపు అంటే సొంత జిల్లాకు పంపించడం కాదు. ప్రస్తుతం మీరు పనిచేస్తున్న జిల్లా ఏ పూర్వపు ఉమ్మడి జిల్లాలో ఉందో, ఆ ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పడిన కొత్త జిల్లాల మధ్య మాత్రమే కేటాయింపు జరుగుతుంది.

ముఖ్యమైన అంశాలు:


1. కేడర్ సీనియారిటీనే ప్రధాన ఆధారం. మొదటి నియామక తేదీ కాదు, ప్రస్తుతం పనిచేస్తున్న కేడర్‌లోని సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటారు.

2. ఉమ్మడి జిల్లా ఆధారంగా సీనియారిటీ జాబితా తయారు చేసి, అదే ఆధారంగా జిల్లాల కేటాయింపు జరుగుతుంది.

3. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆప్షన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖాళీ ఉన్న జిల్లాకు ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుంది.

4. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరియు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు ప్రాధాన్యత ఉంటుంది.

5. సీనియారిటీ ప్రకారం జిల్లాలు అలాట్ అవుతాయి. అందరికీ కోరుకున్న జిల్లా రావడం తప్పనిసరి కాదు.

6. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లానే అలాట్ అయితే మళ్లీ పోస్టింగ్ ఉండదు. అదే స్థానంలో కొనసాగుతారు.

7. వేరే జిల్లా అలాట్ అయితే ఆ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చి విధుల్లో చేరాల్సి ఉంటుంది.

8. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ముందుగానే ప్రణాళికతో ఒకే జిల్లాను ప్రాధాన్యంగా ఎంచుకోవడం మంచిది.

9. స్థానిక జిల్లా (Native District) ఆధారంగా కేటాయింపు ఉండదు. కేవలం కేడర్ సీనియారిటీ, ఆప్షన్లు, రిజర్వేషన్లు మరియు ప్రిఫరెన్షియల్ కేటగిరీల ఆధారంగానే కేటాయింపు జరుగుతుంది.

10. ఒకసారి జిల్లా కేటాయింపు పూర్తయితే అదే శాశ్వత జిల్లా అవుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తే మాత్రమే పరస్పర బదిలీల అవకాశం ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం


✅ జిల్లా విభజనలో "స్థానికత" (Local District) కాదు, " *కేడర్ సీనియారిటీ* "నే నిర్ణయాత్మక అంశం.

✅ ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ఏ పూర్వపు ఉమ్మడి జిల్లాలో ఉందో, ఆ ఉమ్మడి జిల్లా నుంచి ఏర్పడిన జిల్లాల మధ్య మాత్రమే కేటాయింపు జరుగుతుంది.

✅ అందరూ తప్పనిసరిగా ఆప్షన్లు సమర్పించాలి.


Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.