కమిషన్ చేసిన సిఫార్సులు
పరిగణనలోకి తీసుకున్న అంశాలు
- పిల్లవాడు/విద్యార్థి కేంద్ర బిందువు గా (Child centric) ఉండాలి.
- అన్ని సిఫార్సులు ఆచరణాత్మకమైనవి (Practical) మరియు అమలు చేయదగినవి (Implementable).
- విస్తృత స్థాయి భాగస్వామ్యులతో సంప్రదింపుల అనంతరం మాత్రమే సమస్యలను గుర్తించి సిఫార్సు చేయబడినవి
- జాతీయ, అంతర్జాతీయ విద్యా రంగములో అమలు చేస్తున్న విదానాలు
Pre-primary Education- Recommendations
పూర్వ- ప్రాథమిక విద్య (నర్సరీ, ఎల్కేజీ మరియు యూకేజీ) ను ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేయాలి.
పాఠశాల విద్య-సిఫార్సులు
- 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) లను స్థాపించాలి: నర్సరీ నుండి 12వ తరగతి వరకు 1,500 విద్యార్థుల సామర్థ్యంతో, అన్నీ మౌలిక సదుపాయాలు కలిగిన క్యాంపస్ మరియు బస్ సౌకర్యం కల్పించడము తో పాటు బ్రేక్ ఫాస్ట్, మద్యాహ్న భోజనము మరియు సాయత్రం స్నాక్స్ ఇవ్వడము
- ఇది మల్టీ గ్రేడ్ టీచింగ్ మరియు ఉపాధ్యాయుల కొరతను తొలగిస్తుంది; ఆహ్లాదకరమైన విద్యా, వాతావరణం, మెరుగైన బాధ్యతాయుత, తద్వారా మెరుగైన విద్యా ఫలితాలను సాదిస్తుంది .
- # "తెలంగాణ పబ్లిక్ స్కూల్ బిల్లు, 2026 (ముసాయిదా)”ను సిద్ధం చేసి కమిషన్ నివేదికకు అనుబంధంగా జతచేయబడింది.
- 'తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం ఆపరేషనల్ మాన్యువల్ సిద్ధం చేసి కమిషన్ నివేదికకు అనుబంధంగా జతచేయబడింది.
- స్కూల్ డిస్ట్రిక్ట్ లను ఏర్పాటు చేయాలి హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలలో ప్రతి ఒక్కటిలో 3 చొప్పున, ఇతర జిల్లాలలో ప్రతి ఒక్కటిలో 1 చొప్పున.
- విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, మౌలిక వసతులు మరియు నాణ్యతా చర్యలను పర్యవేక్షించడానికి స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండాలి.
- ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు ( future recruitments).
- "మూడు భాషల విధానాన్ని ఒకటవ తరగతి నుండే అమలు చేయాలి:
- తెలుగు/ఉర్దూ
- ఇంగ్లీష్
- హిందీ
- - నర్సరీ నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధన మాధ్యమం English లోనే ఉండాలి.
- డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) రద్దువేయాలి.
బి.ఎడ్. పునర్వ్యవస్థీకరణ( Restructuring)
- * బి.ఎడ్. (ప్రైమరీ ) – నర్సరీ నుండి 5వ తరగతి వరకు
- * బి.ఎడ్. (సెకండరీ ) - 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు
- * బి.ఎడ్. విద్యార్థులకు బడిలో 150 రోజుల బోధన అభ్యాసము ను తప్పనిసరి చేయాలి
విద్యా అర్హతలు
ఇంటర్మీడియట్ విద్య: సిఫార్సులు
- * IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు మరియు హాస్టళ్లను నియంత్రించేందుకు చట్టాలలో సవరణలు చేయాలి
- ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు తప్పుదారి పట్టించే ప్రకటనల పై నియంత్రణ అవసరము.
- ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుండి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్ను వేరు చేయాలి.
- ప్రైవేట్ జూనియర్ కళాశాల పేరుతో నిర్వహించే కోచింగ్ ను (వ్యాపారాన్ని) నిషేధించాలి
- 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ ను నిర్వహించాలి
- * EAPCET రద్దు చేయాలి; ఇంజినీరింగ్, వ్యవసాయం & ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి
- SSC బోర్డు మరియు ఇంటర్మీడియట్ విద్యా బోర్డును విలీనం చేయాలి
- విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45%కు పెంచాలి
తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ (TESA) ఏర్పాటు
ఉద్దేశ్యం:
. పాఠశాల & ఉన్నత విద్య సంస్థల ర్యాంకింగ్ లు(Standards) మరియు విద్యార్థుల సామర్థ్య అంచనాల (Third Party Assessment) . (Schools own assessments are becoming a farce)
కవరేజ్:
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు & రెసిడెన్షియల్ పాఠశాలలు (2-12 తరగతి, 10వ & 12వ తరగతి మినహాయించి ) మరియు అన్ని ఉన్నత విద్యా సంస్థలు.
స్వతంత్రత :
- విద్యా శాఖ నియంత్రణ నుండి వేరుగా పనిచేస్తుంది;
- చాలా దేశాలలో ఇటువంటి స్వతంత్ర సంస్థలు పనిచేస్తున్నాయి మరియు NEP-2020 లో కూడా నిర్దేశించబడింది
- తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ, 2026 (ముసాయిదా బిల్లు)” ను సిద్ధం చేసి కమిషన్ నివేదికకు అనుబంధంగా జతచేయబడింది.
ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల ఫీజు నియంత్రణ
- ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల ఫీజులను నియంత్రించాలి.
- ఫీజుల నియంత్రణ కి సంబందించి క్రింది ప్రమాణాల ఆధారంగా ప్రైవేట్ పాఠశాలలను 5 లేదా 6 వర్గీకరించాలి:
- లొకేషన్, భూవిస్తీర్ణం, మౌలిక వసతులు, extra-curricular activities, ఉపాధ్యాయుల అర్హతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొదలైనవి
- ప్రతి వర్గానికి గరిష్ట ఫీజును నిర్ణయించాలి.
- చట్టబద్ధ ఫీజు నియంత్రణ కమిషన్ను ఏర్పాటు చేయాలి.
- "తెలంగాణ ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల ఫీజు నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు, 2026 (ముసాయిదా బిల్లు)" సిద్ధం చేసి కమిషన్ నివేదికకు అనుబంధంగా సమర్పించబడింది.

Please give your comments....!!!