1. ప్రస్తుతం తీసుకుంటున్న బేసిక్ పే ఎంట్రీ ఉండాలి.
2. ఈ ఎల్ / హెచ్ పి ఎల్ మరియు సమైక్య ఆంధ్ర ఈ ఎల్ అకౌంట్ సరి చూడాలి.
3. ఏపీ జి ఎల్ ఐ enhance చేస్తే ఎంత చేశారు ఏ నెల నుండి చేశారు వ్రాయించుకోవాలి.
4. పాత స్కూల్లో పని చేసిన పీరియడ్ వరకు జి ఐ ఎస్ ఎంట్రీలు ఉండాలి.
5. సర్వీస్ వెరిఫికేషన్ ప్రతి సంవత్సరానికి ఏప్రిల్ నుండి మార్చి వరకు మరియు మీరు ఏ రోజైతే రిలీవ్ అవుతారో ఆ రోజుటి వరకు ఎంట్రీ వేయించుకోవాలి.
6. ఎల్పీసీ లో ఉన్న ఎంట్రీలు బేసిక్ పే మరియు డిడక్షన్లు సరిపోయినదా చెక్ చేసుకోవాలి.
7. ఈ హెచ్ ఎస్ enhance చేసి ఉంటే ఎప్పుడు నుండి ఎన్హస్ చేశారు SR లో ఎంట్రీ ఉండాలి.
8. SR లో పాత స్కూలు udise కోడ్ తో సహా రిలీవింగ్ SR లో రాయాలి. మరియు ఏ స్కూలుకు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ స్కూల్ పేరు అడ్రస్ udise code కూడా వ్రాయించుకోవాలి. రిలీవింగ్ మరియు జాయినింగ్ రెండింటిలోనూ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ప్రొసీడింగ్ నంబర్ మరియు రిలీవింగ్ ప్రొసీడింగ్ నెంబర్ జాయినింగ్ ప్రొసీడింగ్ నెంబర్ రెండు మెన్షన్ చేయవలెను. మరియు ప్రిఫరెన్షియల్ క్యాటగిరి స్పోస్ వగైరాలు ఉంటే వాటిని కూడా వ్రాయవలెను.
9. హై స్కూల్ నుండి రిలీవ్ అయ్యేటప్పుడు హై స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇద్దరి డిడిఓ కోడ్లు స్కూల్ పేరుతో సహా ఎల్పీసీలో తప్పక వ్రాయించుకొనవలెను.
10. శాలరీ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ బ్రాంచ్ పేరు కూడా ఎల్పీసీలో తప్పక పొందుపరచవలెను.
11. ఎల్పీసీలో ట్రెజరీ ఐడి మరియు సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి రెండు రాయించుకొన వలెను.
12. మార్చ్ నుండి ప్రతినెల ఇన్కమ్ టాక్స్ కట్ చేస్తూ ఉంటే ఎల్పీసీలో రాయించుకొనవలెను.
13. మరియు లోన్స్ ఏవైనా కట్ చేస్తూ ఉంటే ఎన్ని కంతులు కట్టారో ఇన్స్టాల్మెంట్ లతో సహా LPC లో పొందుపరచాలి. మిగిలిన ఇన్స్టాల్మెంట్లు కూడా వ్రాయించుకోవాలి.
14.సెలవుల వివరాలు వ్రాయించుకోవాలి


Please give your comments....!!!