అధికారిణిలకు సూచన:-
1.ఇన్ స్పైర్ నామినేషన్స్ 2025-26 కొరకు మీ పాఠశాలలో ఆరు నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులలో నుండి ఐదు ప్రాజెక్టులను ఎన్నిక చేసి తేదీ 15 సెప్టెంబర్, 2025లోగా
ఆన్ లైన్ లో నామినేషన్ చేయవలసిందిగా సూచించనైనది.
2.ప్రతి పాఠశాల నుండి 5 నామినేషన్లు తప్పనిసరని గమనించగలరు.
3.నామినేషన్లు చేయుటకు ప్రతి విద్యార్థికి సంబంధించి ఈ క్రింది వివరాలు అవసరం:
1.విద్యార్థి పేరు
2.తండ్రి పేరు
3.తల్లి పేరు
4.పుట్టిన తేదీ
5.ఆధార్ నెంబర్
6.పాస్ పోర్టు సైజ్ ఫోటో
7.తరగతి
8.బ్యాంక్ అకౌంట్ నెంబర్ 9.ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్
10.బ్రాంచి పేరు
11.విద్యార్థి ఎన్నుకున్న ప్రాజెక్టు రైట్ అప్
12.ఇన్ స్పైర్ నామినేషన్ ఆన్‌లైన్ చేస్తున్న ఉపాధ్యాయుని పేరు మొబైల్ నెంబర్ మెయిల్ అడ్రస్
13.స్కూల్ హెడ్ పేరు మరియు మొబైల్ నెంబర్ మెయిల్ అడ్రస్
ఈ విషయాలను గమనించి మీ పాఠశాలకు సంబంధించిన ఇన్ స్పైర్ నామినేషన్లను సకాలంలో పూర్తి అయ్యేలా చూడగలరని సూచించనైనది.
ప్రధానోపాధ్యాయులు సంబంధిత ఉపాధ్యాయులతో నామినేషన్స్ పురోగతి గురించి ప్రతి 2 రోజులకు ఒకసారి సమీక్షించవలసిందిగా సూచించనైనది.
మిగతా వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ని సంప్రదించగలరు.


Please give your comments....!!!