Type Here to Get Search Results !

All Schools All Types of Grants

💰స్కూల్ గ్రాంట్స్ (2024-2025) వివరాలు*⤵️⤵️

1. స్కూల్ గ్రాంటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా
₹12,500/-
₹25000/-
₹50,000/-
₹75000/-
₹100000/- చొప్పున రెండు విడతలుగా 100% నిధులు విడుదల చేయనైనది.
 
2. స్పోర్ట్స్ గ్రాంటు
👉ప్రాథమిక పాఠశాలలకు ₹5000/-
👉ప్రాథమికోన్నత పాఠశాలలకు ₹10000/-
 👉ఉన్నత పాఠశాలలకు ₹25000/- చొప్పున రెండు విడతలుగా 100% విడుదల చేయడమైనది.
 
3. సెల్ఫ్ డిఫెన్స్ గ్రాంటు ఉన్నత పాఠశాలలకు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ₹15000/- చొప్పున మూడు నెలలకు గాను విడుదల చేయడమైనది.
 
4. సేఫ్టీ సెక్యూరిటీ గ్రాంటు జిల్లాలోని అన్ని పాఠశాలలకు ₹500/- చొప్పున విడుదల చేయనైనది.
 
5. బడిబాట నిధులు జిల్లాలోని అన్ని పాఠశాలలకు ₹1000/- చొప్పున విడుదల చేయనైనది.
 
6. స్కూల్ కాంప్లెక్స్ గ్రాంటు ₹33000/- చొప్పున 100% విడుదల చేయనైనది.

7. MRC Grant ₹82920/- రెండు విడతలుగా అన్ని మండల కేంద్రాలకు 100% విడుదల చేయడమైనది.
 
8. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ విద్యార్థికి ₹15/- రూపాయల చొప్పున 38 రోజులకు విడుదల చేయడం జరిగింది.

9. యూత్ అండ్ ఎకో క్లబ్ నిర్వహణకు సంబంధించి ఉన్నత పాఠశాలకు ప్రాథమికోన్నత పాఠశాలకు ₹5000/- చొప్పున ప్రాథమిక పాఠశాలకు రూపాయలు 3000/- చొప్పున విడుదల చేయడమైనది.

10. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి పాఠశాలకు ₹1000/- చొప్పున విడుదల చేయడం జరిగింది.


మన పాఠశాలలకు ఏ ఏ నిధులు మంజూరు అయినాయి ? ఏవేవి కాలేదు ?

ప్రాథమిక పాఠశాల లు:

1. కాంపోసిట్ స్కూల్ గ్రాంట్స్ (రెండు విడతలుగా) విద్యార్థుల సంఖ్యను బట్టి.

2. స్పోర్ట్స్ /స్పోర్ట్స్ మెటీరీయల్ గ్రాంట్స్ (రెండు విడతలుగా) 2500 +2500=5000

3. బడిబాట రూ.1000

4. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిస్ప్లే బోర్డ్ రాయించడానికి రూ.500

5. యూత్ అండ్ ఏకొ క్లబ్ కొరకు రూ.3000

6. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ రూ.1000

7. యూనిఫాం stitching గ్రాంట్స్, ఇంకా జమ కాలేదు.

ప్రాథమికోన్నత పాఠశాలలు:

1. కాంపోసిట్ స్కూల్ గ్రాంట్స్ (రెండు విడతలుగా) విద్యార్థుల సంఖ్యను బట్టి.

2. స్పోర్ట్స్ /స్పోర్ట్స్ మెటీరీయల్ గ్రాంట్స్ (రెండు విడతలుగా) 5000+5000=10000

3. బడిబాట రూ.1000

4. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిస్ప్లే బోర్డ్ రాయించడానికి రూ.500

5. యూత్ అండ్ ఏకొ క్లబ్ కొరకు రూ.5000

6. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ రూ.1000

7. యూనిఫాం stitching గ్రాంట్స్, ఇంకా జమ కాలేదు.

ఉన్నత పాఠశాల లు:

1. కాంపోసిట్ స్కూల్ గ్రాంట్స్ (రెండు విడతలుగా) విద్యార్థుల సంఖ్యను బట్టి.

2. స్పోర్ట్స్ /స్పోర్ట్స్ మెటీరీయల్ గ్రాంట్స్ (రెండు విడతలుగా) 12500+ 12500-25000 0

3. బడిబాట రూ.1000

4. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిస్ప్లే బోర్డ్ రాయించడానికి రూ.500

5. యూత్ అండ్ ఏకొ క్లబ్ కొరకు రూ.5000

6. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ రూ.1000.

7. సెల్ఫ్ డిఫెన్స ట్రైనింగ్ (కరాటే) టు గర్ల్ చైల్డ్ అప్ టు క్లాస్ VIII రూ. 5000 X నెలలు =15000

8. స్నాక్స్ పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం అదనపు తరగతుల సమయంలో 38 రోజులకు రోజుకు రూ. 15 చొప్పున ప్రతీ విద్యార్థికి, KARLI

9. GCEC (గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమిటీ) మీటింగ్, గత సంవత్సరం జమ అయినాయి. ఈ సంవత్సరం జమకాలేదు.

10. Cyber Safety and Security ట్రైనింగ్. గత సంవత్సరం జమ అయినాయి. ఈ సంవత్సరం జమకాలేదు.

11. యూనిఫాం stitching గ్రాంట్స్. ఇంకా జమ కాలేదు.

ఇకో మరియు యూత్ క్లబ్" డబ్బులు దేనికి ఉపయోగించాలి ? “

1. ఉన్నతాధికారులు చెప్పిన విధంగా.

2. పాఠశాలలోని ఓపెన్ ప్లేస్ లలో వర్షపు నీరు, వాడిన నీరు నిల్వ ఉండకుండా చూడడం, ఇంకుడు గుంత ని ఏర్పాటు చేయడం.

3. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నీటి పరిశుభ్రత, ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించక పోవడం, చెట్లను పెంచడం మొదలగు అంశాలపై సెమినార్లు, డిబేట్లు, వ్యాస రచన, ఉపన్యాస, పెయింటింగ్ మొదలగు పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం.

4. కిచెన్ గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవడం.

5. "మియావాకి" / urban అడవులను పెంచడం.

6. పర్యావరణాన్ని సంరక్షించే ఏ పని / ప్రాజెక్ట్ కైనా,

7. పాఠశాలను అందంగా, మొక్కలతో తీర్చి దిద్దడం కోసం, పర్యావరణ పరిరక్షణ నినాదాలను గోడలపైన రాయించడం 

8. ఇతర, సంబంధిత ఏ పనికైనా.

ఏక్ భారత్ శ్రేష్ట భారత్ డబ్బులు దేనికి ఉపయోగించాలి ? (EBSB)

1. జాతీయ సమైక్యత, సమగ్రత లో భాగంగా మన రాష్ట్రానికి కేటాయించిన ఇతర జత చేయ బడిన రాష్ట్రం (paired state) యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, భాష మొ. వి విద్యార్థులచే ప్రదర్శింప జేయడం, క్విజ్ పోటీలు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు మొ. వి నిర్వహించడం.

2. Paired రాష్ట్రం యొక్క పండుగలను జరుపుకోవడం,

3. Paired రాష్ట్రం వంటలను పరిచయం చేసుకోవడం, ఎక్స్ఛేంజి చేసుకోవడం,

4. Paired రాష్ట్రం యొక్క భాష లోని పదాలని, వాటి అర్థాన్ని తెలుసుకోవడం.

5. Paired రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం మొ. వి. తెలుసుకోవడం,

6. సంబంధిత ఇతర కార్యక్రమాలు,

(తెలంగాణ రాష్ట్రానికి paired రాష్ట్రం హర్యాణ )
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.