Guruvu.In

AP - Changing of Formative Assessments Details in Telugu

*🌈F.A - 1*

1. ఫార్మేటివ్ ఎసెస్మెంట్ పేరు సెల్ఫ్ ఎసెస్మెంట్గా (Self Assessment) గా మార్పు జరిగింది.

2. ఈ నెల 27 నుండి Self Assessment పరీక్షల నిమిత్తం టైమ్ టేబుల్ విడుదల చేయడం జరిగింది. ఇందులో గమనించవలసిన అంశం రోజుకు ఒక పరీక్ష చొప్పున జరుగుతుంది.

3. 1 నుండి 8వ తరగతులకు CBA పద్ధతిలో OMR లతో పరీక్ష జరుగుతుంది. 9, 10 తరగతులకు రెగ్యులర్ పద్ధతిలో Non CBA పరీక్షలు జరుగుతాయి.

4. పరీక్ష పేపర్లు ఈ పరీక్షకు మండలాల వారీగా ప్యాకింగ్ వస్తుంది. 1 నుండి 5వ తరగతి వరకు ఒక బండిల్, 6 నుండి 10వ తరగతి వరకు ఒక బండిల్ వస్తుంది. సదరు బండిల్ను DCEB నుండి రిసీవ్ చేసుకున్న వెంటనే మండల కమిటీ MEO 1 & 2 / 2 HS HMs/ 1 ELE SCHOOL HMS పకట్బందీగా పేపర్ బండిల్ను రిసీవ్ చేసుకుని ట్రంకు బాక్సులో భద్రపరిచి పరీక్ష రోజున ఒక గంట ముందుగా మాత్రమే ప్యాకెట్లను ఓపెన్ చేసి కమిటీ ఆధ్వర్యంలో Closed Packet పాఠశాలలకు అందించాలి.

5. ఏ లెవెల్లో అయినా పేపర్ వాట్సాప్ లో గాని ఇతర రూపాలలో లీక్ అయితే తీవ్రమైన చర్యలు సంబంధిత అధికారులు/ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని Commissioner of School Education వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కావున రేపు, ఎల్లుండిలో మండలస్థాయి సెల్ఫ్ ఎసెస్మెంట్ ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం పైన పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి లీకేజీలకు తావులేకుండా జిల్లా /మండల / పాఠశాల స్థాయిలో అత్యంత పగడ్బందీగా ఈ పరీక్షలను నిర్వహించవలెను.

6. Question Bundle 1 to 5 & 6 to 10, OMR PACKETS SAME (1 to 5), 6 to X Bulk OMR ex సరఫరా చేయబడతాయి.

7. ఈ పరీక్షలలో గమనించవలసిన ముఖ్యమైన విషయములు :

పరీక్షా పేపర్లు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఇవ్వబడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ఏవిధమైన Question పేపర్స్ ఈసారి ఇవ్వడంలేదు. సదరు విషయాన్ని జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలవారికి ముందుగా తెలియజేయవలెను.

8. Question papers 2 spells . 3+3 2 2 Question papers వచ్చుసమయంలో మండల కమిటీ అందరూ రిసీవ్ చేసుకుని వెంటనే Safe Custody నందు ట్రంక్ బాక్సులో పెట్టి సీల్ చేయవలెను. రిజిష్టర్ మెయిటేన్ చేయడం పరీక్ష రోజున ఆధరైజ్డ్ పర్షన్ కి మాత్రమే సీల్ చేసిన పేపర్స్ ఇవ్వవలెను.
కావున గౌరవ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ వారి ఆదేశానుసారం ఈ Self Assesment పరీక్షలను నిర్ణీత టైమ్ టేబుల్స్ మరియు నిబంధనల ప్రకారం నిర్వహించవలసినదిగా అందరి మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమైనది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts