Guruvu.In

ELECTIONS: Job Chart of PO, APO, and OPOs in Telugu

🔥 *ఎలక్షన్ ఆఫీసర్ విధులు బాధ్యతలు*

*ఈ ఎలక్షన్లో ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి (PO) + APO + 2 OP0s లు విధులు నిర్వర్తిస్తారు.*

అనగా 1+3 సిస్టం లో మనం ఎన్నికల విధులు చేయాలి.

👉 PO = ప్రిసైడింగ్ అధికారి
👉 APO = అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి (1st PO= మొదటి పోలింగ్ అధికారి )
👉 OPOs = OTHER POLLING OFFICERS (2ND PO, 3RD PO = రెండవ, మూడవ పోలింగ్ అధికారి)

👉 *వీరి విధులను మనం ఇక్కడ తెలుసుకుందాం!*


👤 *1ST PO భాధ్యతలు:-


* ఇతను మార్కుడ్ కాపీ భాధ్యుడు.

🟢మార్కుడ్ కాపీ అంటే ఇచ్చిన Electoral Roll ( ఓటర్ల జాబితా ) లో మార్క్ చేయడానికి వాడేది.

🟢ఓటర్ల గుర్తింపు మరియు సీరియల్ నెంబర్ పేరు గట్టిగా 🗣️ చదవడం చేస్తారు

🟢ఓటరు నిజమని పోలింగ్ ఏజెంట్లను అడిగాక, ఒకసారి ఎడమ చేతి చూపుడు వేలు👇ని చెక్ చేయాలి.

🟢ఓటర్ తెచ్చిన డాక్యుమెంట్ ( EPIC CARD/ AADHAR CARD Etc.,) ని వెరిఫై చేయాలి.

🟢కేవలం ఓటర్ స్లిప్ తొ ఓటు ఇవ్వరాదు. (EPIC CARD ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇతర డాక్యుమెంట్లు తెస్తే తర్వాత scrutiny కి అవకాశం ఉంటుంది.)

🟢ఏజెంట్ల ని అడగాలి. ఏజెంట్లు సరేనని అంటే మార్కుడ్ కాపీలో ఓటర్ కి సంబంధించిన బాక్స్ లో ఎర్ర పెన్ను తో క్రాస్ లైన్ (DIAGONAL LINE) గీయాలి.

🟢ఒక వేళ ఓటర్ - 🙋‍♀️మహిళా ఓటర్ అయితే ఆ సీరియల్ నెంబర్ కు రౌండప్ చేయాలి.

🟢ఒకవేళ ఓటర్ –🧏🏻 ట్రాన్స్ జెండర్ అయితే సీరియల్ నెంబర్ కి స్టార్ గుర్తు వేయాలి

(*Note-* ఏ ఓటరుకైన క్రాస్ లైన్ తప్పనిసరి.)

👤 *2ND PO భాధ్యతలు:-*


రెండవ పోలింగ్ అధికారి(PO-2) కి 3 పనులు ఉంటాయి.

👉1- ఓటర్లకు చెరగని సిరా ( INDELIBLE INK) వేయడం
👉2- 17A రిజిస్టార్ లో వివరాల నమోదు
👉3- ఓటర్ స్లిప్ వ్రాయడం

🟢వచ్చిన ఓటర్ కి ఎడమ చేతి చూపుడు వ్రేలికి ఇంక్ వేయాలి.

🟢తర్వాత 17A రిజిష్టర్ లో వివరాలు రాయాలి.

🔥 *17A రిజిష్టర్ రాసే విధానం:-*

🟢ఇందులో మొదటి కాలమ్ లో సీరియల్ నెంబర్ (1,2,3...) రాయాలి.

🟢రెండవ కాలమ్ లో Electoral Roll ( ఓటర్ల జాబితా ) లోని వరుస సంఖ్య రాయాలి.

🟢మూడవ కాలమ్ లో వచ్చిన ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకోవాలి.

*NOTE:-* AGE డిక్లరేషన్ తో ఓటు వేసే ఓటర్ వేలి ముద్ర మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత వెరిఫై అయిన వేలి ముద్ర ఉంటే అతను అవునా, కదా అని బలం ఉంటుంది.

*ముఖ్యమైన అంశం :-* వేలి ముద్ర వేసిన తర్వాత ఓటర్ ని అతని వేలిని బట్ట తో తుడుచుకోమని కోరాలి. ఎందుకంటే వేలి ముద్ర ఇంకు బ్యాలెట్ మిషన్ పై పడే ప్రమాదం ఉంటుంది. కావున కచ్చితంగా అక్కడే తుడుచుకోమని చెప్పాలి.

🟢నాల్గవ రిమార్క్స్ కాలమ్ లో a,b,c,d కాలమ్ లు ఉంటాయి.

⭐a వద్ద ఓటర్ తెచ్చిన డాక్యుమెంట్ పేరు రాయాలి. అది ఎలాగంటే EPIC CARD అయితే EP అని, ఇతర డాక్యుమెంట్ లు (OTHER DOCUMENTS) అయితే OD అని రాసి......

⭐తెచ్చిన డాక్యుమెంట్ యొక్క చివరి 4 నెంబర్లు b వద్ద రాయాలి. (EPIC CARD అయితే EP రాయాలి అంతే దాని నెంబర్ రాయనవసరం లేదు.)

⭐C వద్ద Mismatch of Image, if any అని ఉంటుంది అందులోఅవసరం అయితేనే ఫోటో సరిగ్గా ఉందో లేదో రాయాలి, లేకుంటే వదిలేయాలి.

⭐d వద్ద ఇతర రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయాలి.


🔥 *ఓటర్ స్లిప్ రాయడం:-*


ఓటర్ స్లిప్ లో మొదటి వరుసలో- 17A రిజిష్టర్ లోని కాలమ్-1 లోని నెంబర్ ని రాయాలి.

⭐రెండవ వరుసలో-Electoral Roll ( ఓటర్ల జాబితా) లోని వరుస సంఖ్య రాయాలి.

⭐మూడవ వరుసలో-ఓటర్ స్లిప్ రాసే పోలింగ్ అధికారి సంతకం చేయాలి. సంతకం చేసిన ఓటర్ స్లిప్ ని కౌంటర్ ఫైల్ నుండి వేరు చేసి ఓటర్ కి ఇయ్యాలి.

👤 *3rd PO భాధ్యతలు:-*


ఓటర్ ఇచ్చినఓటర్ స్లిప్ ని తీసుకొని CU లో BALLOT పై క్లిక్ చేసి ఓటు ని ఇవ్వాలి.

🟢ఓటర్ ని కంపార్ట్ మెంట్ లోకి వెళ్లి ఓటు వేయుమని చెప్పాలి.

🟢BALLOT ఇచ్చినపుడు CU లో రెడ్ లైట్ వస్తుంది. ఓటర్ ఓటు వేశాక బీప్ సౌండ్ వచ్చి రెడ్ లైట్ పోతుంది.

🟢ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటర్ ఓటు వేశాడా లేదా అని కచ్చితంగా నిర్ధారించుకోవాలి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts