Clarification on Service Register for Retirement in Telugu by Maneti Pratap Reddy RTD Gazetted Headmaster, Karimnagar

*SBలో అలా రాస్తే ఇబ్బందే!*


          ఇటీవల కాలంలో రిటైరైన పలువురు టీచర్లు పెన్షన్ మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. *ఒకట్రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టి AG ఆఫీస్ పెన్షన్ శాంక్షన్ చేస్తోంది.* దీన్ని ఏమాత్రం ఊహించని సదరు టీచర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో రిటైరైన *ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్* తదితర జిల్లాల టీచర్లు పంపించిన పెన్షన్ శాంక్షన్ పేపర్లను చూశాను. వారిలో చాలా మంది టీచర్లకు ఒకట్రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపించారు. నిన్న కూడా ఇద్దరు గెజిటెడ్ హెడ్మాస్టర్లకు ఒక్కో ఇంక్రిమెంట్ కోత పెట్టి పంపించిన పెన్షన్ పేపర్లను చూశాను. అలా ఇంక్రిమెంట్లు కట్ అయిన వారిలో మెజారిటీ టీచర్లకు వారి సర్వీస్ బుక్స్ లో ఎంట్రీలు అసంపూర్ణంగా, తప్పులతడకగా నమోదు చేయడమే ప్రధాన కారణం. ఇతర కారణాలు కూడా కొన్ని ఉన్నయ్! *అధికారుల అవగాహనారాహిత్యం, తొందరపాటు చర్యలు టీచర్లకు సమస్యగా, శాపంగా మారుతోంది*. ఇకపై రిటైరయ్యే ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్ లో కోత పడకూడదనే భావనతో ఈ పోస్టు పెడుతున్నా. 

> జూనియర్ టీచర్ తో పే స్టెప్-అప్ చేసుకున్న సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్ లో *COMPARATIVE STATEMENT అసమగ్రంగా రాయడం లేదా సరిగా రాయకపోవడం* వలన AG ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్లు కోత విధిస్తోంది.

> 398 రూపాయల మాస వేతనంపై నియామకమైన స్పెషల్ టీచర్లు.... సెకండరీ గ్రేడ్ టీచర్ గా రెగ్యులర్ స్కేల్ పొందిన తేదీ ప్రాతిపదికగా జూనియర్ టీచర్ ని గుర్తించి పే స్టెప్-అప్ చేసుకోవాలి. అలా కాకుండా, *స్పెషల్ టీచర్ నియామకపు తేదీ ప్రాతిపదికగా స్టెప్-అప్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులో కోత పడుతున్నది.* ఈ సమస్య ఎక్కువగా సోషల్ స్కూల్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్నారు. 

> జీవో 475 Edn Dept తేదీ 2.11.1998 Rule 2(b) ప్రకారం *Same Subject టీచర్లతోనే స్టెప్-అప్ చేసుకోవాలి.* సబ్జెక్టు నిబంధనను ఎత్తివేయాలని.... క్యాడర్ ప్రాతిపదికగా టీచర్లకు స్టెప్-అప్ కు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో 475 జీవో ప్రకారమే సేమ్ సబ్జెక్టు టీచర్ తోనే స్టెప్-అప్ చేయాలి. దీనికి భిన్నంగా వేరే సబ్జెక్టు టీచర్ తో స్టెప్-అప్ చేసుకున్న టీచర్ల పెన్షన్ లో ఒకట్రెండు ఇంక్రిమెంట్లు కోత పడుతున్నాయ్. 

> PRC అమలు, 6/12/18/24 ఏళ్ళ యాంత్రిక పదోన్నతి స్కేళ్ల మంజూరు, ప్రమోషన్-పే ఫిగ్జేషన్, స్టెప్పింగ్-అప్ పే, ఇంక్రిమెంట్ ప్రీపోన్ చేసుకోవడం తదితర కారణాలతో గత ఏడాదికి ఈ సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు తేడా వస్తుంది. దీనికి సంబధించిన *Remarks వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్ లో స్పష్టంగా రాయకపోవడం.*

> వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు (OCL Loss of Pay) 36 నెలల వరకు..... వైద్య ధృవీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంత కాలమైనా పెన్షన్ కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే! అయితే, *మెడికల్ సర్టిఫికెట్ ప్రాతిపదికగా తీసుకున్న OCL Loss of Payను సర్వీస్ బుక్ లో సరిగా నమోదు చేయకపోవడం.*

> వార్షిక ధృవీకరణ (Annual Attestation/ Service Verification) *నియామకమైన తేదీ నుంచి రిటైరయ్యే తేదీ వరకు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ ఉండాలి.* అలా కాకుండా గ్యాప్ ఉన్న సర్వీస్ బుక్ AG ఆఫీస్ లో గట్టిగా చూసే ఆడిటర్ దగ్గరికి వెళ్తే ఇబ్బందే. పెన్షన్ లో కోత పెడుతున్నారు.

> Spouse పేరు సర్వీస్ బుక్ లో ఒక రకంగా.... పెన్షన్ పేపర్లలో మరో విధంగా నమోదు ఉన్న ఒక టీచర్ పెన్షన్ పేపర్లను వాపస్ చేశారు. *సర్వీస్ బుక్ లో Spouse పేరు ఏ విధంగా ఉంటే పెన్షన్ పేపర్లలో కూడా ఆ విధంగానే ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.*

      AG లేవనెత్తిన అభ్యంతరాలను సరిజేసి మళ్ళీ పంపిస్తే చాలా కేసుల్లో పెన్షన్ రివైజ్ చేస్తారు. కానీ, అది పెద్ద కష్టంతో కూడుకున్న పని కదా! అందుకని, రిటైరైన వారు.... త్వరలో రిటైర్ కాబోతున్న వారు ఒకటికి రెండు సార్లు *సర్వీస్ బుక్ ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి.* ఆ తర్వాతే AGకి పెన్షన్ పేపర్స్ సమర్పించాలి. అవసరమైతే *సర్వీస్ బుక్ ఎంట్రిస్ పై అవగాహన ఉన్న వారికి ఒకసారికి చూపెట్టి.... ఆ తర్వాత AGకి పెన్షన్ పేపర్లను పంపిస్తే ఏ సమస్యా ఉండదు.*

-*మానేటి ప్రతాపరెడ్డి
టిఆర్టిఎఫ్ తెలంగాణ!*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts