Unnathi Baseline Test Guidelines in Telugu

🌹 *ఉన్నతి సూచనలు:*🌹

👉 *25న ప్రారంభ పరీక్ష నిర్వహించాలి* 
👉-26 నుంచి నమోదు చేయాలి, మూల్యాంకనను సూచికలు ఆధారంగా చేయాలి . 
ప్రగతి నమోదు చేయాలి.
👉4/8 వాక్యాలు సరిగా రాస్తే రాయగలిగిన వారు అని ✓పెట్టండి      
👉స్థాయి నిర్ధారణ చేసుకోండి. 
  👉1. విషయం 2 వాక్య నిర్మాణం 3. పదాలు 4. అక్షర దోషాలు లేకుండా రాయడం 
 👉september 30 వరకు school edn.app update అవుతుంది
👉 పీరియడ్ ప్రణాళిక సోపానాలపై పట్టు ఉండడం అవసరం. 
👉సోపానాలు తరగతిలో ప్రదర్శన చేసుకుంటే పట్టు లభిస్తుంది. 
✍️ *డైరీ తప్పక రాయాలి*
✍️ సోపానాలు తప్పక పాటించాలి
✍️సోపానాలు దృష్టిలో పెట్టుకొని బోధించాలి
✍️ State Educational Achievement Survey ను నిర్వహించాలి
✍️ అభ్యాస పరీక్షలు శ్రద్ధగా నిర్వహించండి
✍️ లక్ష్య ఆధారంగా బోధనా పీరియడ్ నిర్వహణ, అభ్యాస పీరియడ్స్ నిర్వహణ సక్రమంగా చేయాలి
✍️ అన్ని పాఠశాలల్లో ఉన్నతి అమలు జరగాలి
✍️ *29 నుండి state monitoring ఉంటుంది*
✍️ డైరీ కనపడాలి
 Baseline టెస్ట్ నిర్వహణ పేపర్లు దిద్దడం, ప్రగతి నమోదు చేయబడి ఉండాలి
✍️ CPD జిల్లా స్థాయిలో మూల్యాంకనం చేస్తుంది
✍️ Guidelins వివరించాలి
✍️ *ప్రతి నెలా ఉపాధ్యాయులు స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. ప్రతినెల 30 వరకు చేసుకోవాలి*
✍️ నోట్ బుక్స్ దిద్ది ఉండాలి 
✍️ బోధనలో తప్పనిసరిగా అక్షర గుర్తింపు, ధ్వని గుర్తింపు చేర్చి బోధించాలి.
✍️ *ఇప్పటికే baseline పెట్టుకున్నా మళ్లీ ఇప్పుడు ఈ ప్రశ్నా పత్రాలతో పరీక్ష నిర్వహించాలి నమోదు చేయాలి*
✍️ ఆయా నెలల్లో నిర్వహించుకునే ఉన్నతి పరీక్షను FA పరీక్షగా పరిగణించవచ్చును.
✍️ నోడల్ టీమ్స్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి శ్రద్ధగా ఉన్నతిని అమలు చేయాలి 
ఇవి ఈ రోజు జూమ్ మీటింగ్ ద్వారా శ్రీ సువర్ణ వినాయక్ సార్ తెలియజేసిన సూచనలు


 1. Preparation of Question Paper:

ఉన్నతి కార్యక్రమం అమలు, పిల్లల ప్రఅభ్యసన ప్రగతిని అంచనా వేయుటకు ప్రతీ మాసాంతములో పరీక్షను నిర్వహించుకుంటాము. దీనికంటే ముందు ఒక స్థాయి నిర్ధారణ పరీక్షను (BASELINE TEST) నిర్వహించుకుంటాము.
 ✔️గణితంలో పరీక్షాంశాలుగా చదవడం, రాయడం, కనీస సామర్థ్యాలు, పూర్వ భావనలు మరియు పాఠ్యాంశ భావనల అవగాహన కొరకు విద్యార్థుల యొక్క ప్రగతిని తెలుసుకోవలసి ఉంటుంది.
 ✔️చదవడం, రాయడం మరియు పూర్వ భావనలపై అవగాహనను బోధనాభ్యసన కార్యక్రమంలో భాగంగా పరిశీలిస్తూ విద్యార్థుల యొక్క ప్రగతిని అంచనా వేయాలి. దీనికి ప్రత్యేక రాత పరీక్ష ఉండదు.
✔️ప్రాథమిక గణిత సామర్థ్యాల సాధన విషయంలో సంఖ్యా భావనకు సంబంధించిన ఒక సమస్యతో పాటు చతుర్విధ ప్రక్రియలలో కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగహారం అంశాలలో ప్రతీ అంశం నందు 5 సమస్యలు ఇవ్వాలి.
 ✔️తరగతి వారీ సామర్థ్యాల సాధన/అభ్యసన ఫలితాల సాధన విషయంలో పాఠ్యాంశం లోని భావనలకు సంబంధించినవి 5 ప్రశ్నలు ఇవ్వాలి.
పరీక్ష నిర్వహణ కోసం ఒక గంట సమయం కేటాయించాలి.

2. How to conduct Baseline Test:


ప్రాథమిక గణిత సామర్థ్యాలపై దృష్టి సారిస్తూ తరగతి వారీగా పాఠ్యాంశములకు సంబంధించిన పూర్వ భావనలపై అవగాహన కలిపించి తద్వారా ఆశించిన అభ్యసన ఫలితాలను సాధింపచేయడమే ఉన్నతి కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం. 
 ✔️6 నుండి 9 వ తరగతి వరకు జరిగే ఉన్నతి కార్యక్రమంలో భాగంగా స్థాయి నిర్థారణ పరీక్ష నిర్వహించి పిల్లల స్థాయిని అంచనా వేయవలసి ఉంటుంది. దీనితో పాటు ప్రతీ మాసాంతములో పరీక్ష నిర్వహించాలి.
✔️Baseline Test ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభంలో 6 నుండి 9వ తరగతుల విద్యార్థులకు నిర్వహించాలి. 
✔️ఈ విద్యా సంవత్సరం మాత్రం సెప్టెంబర్ మాసంలో నిర్వహించాలి. 
 ✔️ఇట్టి పరీక్షలో చదవడం, రాయడం, పూర్వ భావనలు, బోధనాభ్యసన సమయంలోనే విద్యార్థుల యొక్క ప్రగతిని అంచనా వేయాలి. 
✔️కనీస సామర్థ్యాలు మరియు తరగతి వారీ అభ్యసన ఫలితాల సాధనను మదింపు చేయాలి. 
✔️కనీస సామర్థ్యాల మదింపులో సంఖ్యాభావనకు సంబంధించిన ఒక ప్రశ్న మరియు చతుర్విధ ప్రక్రియలలో ప్రతీ ప్రక్రియకు సంబంధించి 5 ప్రశ్నలు ఇవ్వాలి.
✔️తరగతి వారీ అభ్యసన ఫలితాల సాధన కొరకు 5 ప్రశ్నలు ఇవ్వాలి. 
✔️పై అంశాలు తరగతిలోని ప్రతి విద్యార్థిని బోధనాభ్యసనలో మరియు రాత పరీక్షల ద్వారా పరీక్షించి విద్యార్థులు ఏ మేరకు ప్రగతి సాధించినారో తెలుసుకుని ఉపాధ్యాయులు బోధనాభ్యసన ప్రక్రియలలో మార్పులు చేసుకోవాలి.
✔️BASELINE TEST పరీక్షా పత్రం మాదిరిగానే ప్రతీ మాసం నిర్వహించే పరీక్షా పత్రం తయారు చేసుకోవాలి. 
✔️ప్రతీ మాసాంతములో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత సామర్థ్యాల సాధన, పూర్వ భావనలు మరియు ఆశించిన అభ్యసన ఫలితాల సాధన అంశాలపై విద్యార్థుల యొక్క ప్రగతిని పరిశీలించి నిర్దేశిత పట్టికలలో నమోదు చేయాలి. 
✔️పిల్లల ప్రగతి రికార్డును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూల్ కాంప్లెక్స్ , మండల స్థాయిలో అందచేయాలి.

3. Indicators of Evaluation:


 ఉన్నతి పరీక్ష ఆధారంగా విద్యార్థులలో చదవడం, రాయడం కోసం ఆయా తరగతులకు చెందిన సిలబస్ ఆధారంగా కీలక పదాలు, భావనలు, సూత్రాలు, నిర్వచనాలు, గణిత వాక్యాలు, గణిత నిరూపణలు మొదలగునవి ఎంచుకొని పిల్లలు ఎంత మేరకు చదవడం, రాయడంలో సామర్థ్యాలను కలిగి ఉన్నారో అంచనా వేయాలి.
✔️గణితంలో భాషా సామర్థ్యాలు అనగా పాఠ్యాంశం లోని పూర్వ భావనలు, భావనలకు చెందిన పదాలు, వాక్యాలు, నిర్వచనాలు, సూత్రాలు మరియు సమస్యలను చదివి అర్థం చేసుకోవడం, స్వంతంగా రాయగలగడంగా భావించాలి.
✔️పూర్వ భావనలు అనగా ఏ భావనను బోధిస్తున్నామో, ఆ భావనల అవగాహన కొరకు అవసరమయ్యే పూర్వ తరగతుల భావనలను పిల్లలు ఎంత మేరకు కలిగి ఉన్నారో మదింపు చేయాలి.
 ✔️పై మూడు అంశాలు చదవడం, రాయడం మరియు పూర్వ భావనలపై ఆయా తరగతులలో బోధనాభ్యసన ప్రక్రియల ఆధారంగా పిల్లల ప్రగతిని అంచనా వేయాలి. పిల్లలు ఆయా సామర్థ్యాలను కలిగి ఉంటేనే, చేయగలుగుతున్నట్లుగా భావించాలి. ఆయా సామర్థ్యాలు లేకపోతే చేయలేనివారిగా గుర్తించాలి. 
✔️సంఖ్యా భావనకు సంబంధించి ఇవ్వబడిన ప్రశ్నను తప్పనిసరిగా సాధిస్తేనే, సంఖ్యా భావనపై అవగాహన ఉన్నట్లుగా భావించాలి.
✔️చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి (కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగహారాలు) ఒక్కొక్క ప్రక్రియకు 5 సమస్యల చొప్పున ఉంటాయి. వీటిలో ప్రతీ ప్రక్రియకు సంబంధించి కనీసం నాలుగు సమస్యలు సాధిస్తేనే ఆ సామర్థ్యం సాధించబడినట్లుగా భావించాలి.
 ✔️మిగతా 5 ప్రశ్నలలో (తరగతి వారీ సామర్థ్యాలకు సంబంధించినవి) కనీసం నాలుగు సమస్యలు సాధిస్తేనే తరగతి వారీ సామర్థ్యాలు సాధించినట్లు భావించాలి.
✔️ఈ పరీక్షను FA లోని slip test కు తీసుకునే క్రమంలో ఈ క్రింది సూచనలు పాటించాలి. 
(i) ఈ ప్రశ్నాపత్రం లోని తరగతి వారీ సామర్థ్యాలకు సంబంధించిన ఐదు ప్రశ్నలకు ప్రతీ ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులను పరిగణన లోకి తీసుకోవలయును. 
(ii) ప్రతీ సమస్యా సాధనకు సోపానాల వారీగా మార్కులు విభజించుకోవాలి. కేటాయించబడిన మొత్తం నాలుగు మార్కులలో 
25% మార్కులు దత్తాంశం గుర్తించి రాసినందుకు,
25% మార్కులు భావనను గుర్తిస్తూ సూత్రం / ప్రక్రియను ఎన్నుకున్నందుకు 
25% మార్కులు విలువలను ప్రతిక్షేపించడం / ప్రక్రియ కొనసాగించినందుకు  
25% మార్కులు సూక్ష్మీకరించి సరియైన ఫలితాన్ని రాబట్టినందుకు కేటాయించాలి.

4. Way forward:


✔️Baseline Test పూర్తి కాగానే తరగతి వారీగా గణితంలో విద్యార్థుల స్థాయిని గుర్తించాలి. 
 ✔️ప్రగతిని/స్థాయిని పట్టికలో నమోదు చేసిన తరువాత ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించుకోవాలి. ఈ సమావేశంలో పిల్లల స్థాయిని విశ్లేషించుకోవాలి. 
✔️పిల్లల యొక్క అభ్యసనను మెరుగు పరచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
✔️పిల్లల స్థాయికి అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియలలో చేసుకోవాల్సిన మార్పులను గుర్తించాలి. 
✔️బోధనాభ్యసన ప్రక్రియలలో మార్పు అనగా అనుగుణ్యమైన ఉపగమము (approach), బోధనాభ్యసన కృత్యాల సరళి, బోధనా వ్యూహాలు మొదలగు వాటిలో తగిన మార్పులు చేసుకోవాలి. 
✔️ఉపాధ్యాయుడు బోధనా సమయానికి ముందు గానే పూర్తి సంసిద్ధతతో (పాఠ్యాంశమును పూర్తిగా చదివి అవగాహన చేసుకోవడం, పాఠ్య పుస్తకం లోని భావనల అవగాహన కృత్యాలపై దృష్టి సారించడం, అన్ని అభ్యాసాలను సాధించి ఉండడం, పిల్లల స్థాయికి అనుగుణంగా భావనల అవగాహనను పెంపొందించే దిశలో వ్యూహాలు (strategies), ఉపగమాలు (approaches), బోధనాభ్యసన సామాగ్రి, అవసరమైన డిజిటల్ వనరులు సిద్ధం చేసుకోవడం, అభ్యసన కృత్యాలు, అదనపు కృత్యాలు రూపొందించుకోవడం, అర్ధవంతమైన బోధనాభ్యసన ప్రణాళికలను రూపొందించుకోవడం) తరగతి గదికి వెళ్ళాలి.
✔️బోధనాభ్యసన ప్రక్రియల సమయంలో గణిత భాషా సామర్థ్యాలపై దృష్టి సారించాలి. 
✔️భావనల అవగాహనకు సంబంధించిన పూర్వ భావనలను పునర్బలనం కావించాలి. 
 ✔️బోధనా పీరియడ్ లో జట్టు కృత్యాల నిర్వహణలో విభిన్న స్థాయి గల పిల్లలను జట్లుగా ఏర్పరచాలి. 
✔️అభ్యాస పీరియడ్ లో performers, peer support learners, teacher support learners గా విద్యార్థులను విభజించుకోవాలి. 
 ✔️తరగతి లోని అందరు విద్యార్థులపై దృష్టి సారిస్తూ వారి యొక్క అభ్యసనను మెరుగు పరచుకొనే విధంగా సహకరించాలి. 
✔️అర్థవంతమైన ప్రణాళికా బద్ధంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించి నిర్దేశించుకున్న అభ్యసన ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులకు సహకారం అందించాలి. 
✔️ఎప్పటికప్పుడు తల్లి దండ్రులతో పిల్లల అభ్యసన ప్రగతిని చర్చిస్తూ, తల్లి దండ్రుల బాధ్యతను గుర్తించేలా చూడాలి. 
✔️స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో విద్యార్థుల ప్రగతిని విశ్లేషించుకోవాలి. మంచి బోధనా వ్యూహాలను, ఇతరులు చేసిన మంచి ప్రయత్నాలను గ్రహించి తరగతిలో అమలు పరచాలి. 
 ✔️పిల్లల ప్రగతిని ప్రతీ మాసంలో నమోదు చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts