TET / DSC Psychology Study Materials: Children Stage: Methods used to collect children's data

సైకాలజీ పాఠం : 1. బాల్యదశ
1.4 అంశం : పిల్లల దత్తాంశాన్ని సేకరించడానికి వాడే పద్ధతులు:


1. సహజ పరిశీలన
2. పరిపుర్చ
3. ప్రతిస్పందన పత్రికలు
4. సంఘటన రచనాత్మక రికార్డు
5. నిరంతర నమోదు పద్ధతి
6. ప్రయోగ పద్ధతి
7. ప్రశ్నావళి
8. వ్యక్తి అధ్యయన పద్ధతి
9. నిర్ధారణ మాపణాలు

1. సహజ పరిశీలన:

  • ముందుగా నిర్ణయించుకున్న అంశాలను సన్నతతో స్పష్టంగా నిశితంగా చూడడం
  • సహజ పరిస్థితుల్లో పరిశీలనా చేయడం
  • బాహ్య ప్రవర్తనను పరిశీలించవచ్చు
  • అంతర్గత ప్రవర్తనను మానసిక ప్రక్రియలను పరిశీలించలేము
  • ఇది సులభమైన పద్ధతి
  • పరిశీలనకు కొద్దిపాటి శిక్షణ సరిపోతుంది
  • పరిశీలన అంశాలపై కచ్చితమైన అవగాహన వస్తుంది
  • పరిశీలన చేసే వ్యక్తి తన సొంత ఇష్టాలను నమోదు చేసే ప్రమాదం ఉన్నది
  • దీనివలన బాహ్య ప్రవర్తన తెలుసుకోవచ్చు కానీ అంతర్గత ప్రవర్తన తెలుసుకోలేము

2. పరిపుచ్చ ఇంటర్వ్యూ

  • వ్యక్తి ఇంటర్వ్యూను తెలుసుకోవడాన్ని ఇంటర్వ్యూ అంటారు
  • దీని ద్వారా అంతర్గత భావాలను కూడా తెలుసుకోవచ్చు
  • వ్యక్తి యొక్క లక్షణాంశాలు అభిప్రాయాలను వైఖరులను తెలుసుకోవచ్చు
  • ఇవి రెండు రకాలు
సంరచిత పరిపుచ్ఛ:
  • మొదట ప్రశ్నలను తయారు చేసుకుంటారు
  • దీనిలో విశ్లేషణ చేయడం సులభం అవుతుంది
  • తక్కువ సమయంలో ఎక్కువ మందిని చేయవచ్చు
  • సులభమైన పద్ధతి ఖర్చు తక్కువ సమయము ఆదా అవుతుంది
  • చిన్నపిల్లలు మరియు నిరక్షరాసిలకు ఈ విధానము వర్తించదు
  • విద్యార్థుల్లో అనుమానాలను నివృత్తి చేయలేము
  • శారీరక చేష్టలు అనగా హావాభావాలు బాడీ లాంగ్వేజ్ ను గుర్తించలేము
  • ఇది మూగవారి కూడా ఉపయోగించవచ్చు 
  • సంకోచించే వారికి పనికి వస్తుంది
ఆసంరచిత పరిపుచ్ఛ:

  • సందర్భానుసారం ప్రశ్నలు వేయవచ్చు
  • పరిశీలకునికి స్వేచ్ఛ ఉంటుంది
  • ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టవచ్చు
  • నిరక్షరాసులు చిన్న పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు
  • ఒకసారి ఒకరికే చేయవచ్చు
  • సమయము ఎక్కువ తీసుకుంటుంది
  • ఖర్చు ఎక్కువవుతుంది
  • అభ్యర్థులకు అనుమానాలను తీర్చవచ్చు.
  • అపార్థాలకు చోటు లేదు
  • మూగవారికి మతిస్థిమితం లేని వారికి పనికిరాదు
  • సంకోచించే గుణం ఉన్నవారికి పనికిరాదు
  • విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది

3. ప్రతిస్పందన పత్రికలు:


  • అభ్యసనా అనుభవాల వ్యక్తిగత రికార్డులు
  • విమర్శనాత్మకంగా నమోదు చేయవచ్చు
  • విశ్లేషణాత్మకంగా ఆలోచన నమోదు చేయవచ్చు
  • వ్యక్తి తన టాస్క్ ను ఏ కారణం చేత పూర్తి చేయలేదో మరియు ఎలా పూర్తి చేయాలో ఆలోచనలు కూడా నమోదు చేయవచ్చు
  • విద్యార్థి రాసిన సొంత ఆలోచనలు భావనలు ప్రతిస్పందనను రాసిన నోట్ బుక్స్
  • వీటిని పరిశీలించేవారు పరిశీలించబడే వారు ఇద్దరూ వాడుకోవచ్చు
  • అనుమానాలను నమోదు చేసుకుని నివృత్తి చేసుకునేందుకు ఉపయోగపడతాయి
  • పరిశీలకు తన వృత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు
  • ఇవి రాతపూర్వకంగానూ మౌఖింగాను వాడుకోవచ్చు
  • అక్షరాసులకు నిరక్షరాశులకు వాడవచ్చు

4. సంఘటన రజనాత్మక రికార్డు

  • ఉపఖ్యాన రికార్డు అని కూడా అంటారు
  • ముఖ్య సంఘటనలను రికార్డు చేయాలి
  • బాయ ప్రపంచంలో ఓపెన్ ఏరియాలో చేస్తారు
  • రికార్డులో నమోదు చేసే తేదీ సమయం స్థలము సంఘటనను సెట్టింగ్ అంటారు
  • సంఘటనను పరిశీలించేటప్పుడు ప్రతి చిన్న విషయము ప్రవర్తనను రాయవలెను
  • ఇష్టమైన చర్యలను రాయాలి
  • దీనికి ఎలాంటి మాపనలు అవసరం లేదు
  • ఇది సులభమైన పద్ధతి
  • పరిశీలకులు కల్పించి రాసే ప్రమాదం ఉంది
  • సాధారణ సంఘటనలను కూడా నమోదు చేసే ప్రమాదముంది
  • ఈ కారణంగా కొన్ని అంశాలు వదిలే అవకాశం ఉంది

5. నిరంతర నమోదు పద్ధతి

  • ఒక సంఘటనకు ప్రవర్తన నమోదు చేస్తారు
  • ప్రామాణికత గలది
  • సమగ్రమైనది
  • సమయం ఎక్కువగా తీసుకుంటుంది
  • పరిమితిని విధించడం కష్టం
  • ఉదాహరణ ఎఫ్ ఏ వన్ పరీక్షలు

6. ప్రయోగ పద్ధతి

  • నియంత్రిత సన్నివేశంలో ఎక్కువ చరాల మధ్య సంబంధాలను కనుక్కుంటారు
  • తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • ఖర్చు నిర్వహణ ఎక్కువ సమయం కూడా ఎక్కువగా తీసుకుంటుంది
  • క్రమబద్ధమైన పద్ధతి
  • వస్తునిష్టత ఎక్కువ
  • నూతన ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగం పడుతుంది
  • మళ్లీ మళ్లీ ఫలితాలను నిరూపించవచ్చు
  • కారణాలకు ఫలితాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవచ్చు
  • పరిస్థితులను నియంత్రించడం కష్టం
  • జోకే చేరాలను నియంత్రించడం కష్టం
  • అన్ని రకాల ప్రవర్తనను అధ్యయనం చేయలేము
  • ఉద్వేగాలను కల్పించడం కష్టం
  • దీనికి పరిశీలకులు శిక్షణ అవసరం
  • కొంతకాలం తర్వాత ఫలితాలు మారవచ్చు
  • ఉదాహరణ బిగ్ బాస్ లోని టాస్కులు

7. ప్రశ్నావళి


  • ఇది రాతపూర్వకంగా ఉంటుంది 
  • నిరక్షరాశులకు పనికిరాదు 
  • ఇది రెండు పద్ధతులు 
  • ఒకటోది ప్రశ్న రూపంలో ఉండేవి. వీటిని క్లోజ్డ్ ఎండెడ్ పద్ధతి అంటారు. ఉదా ఆబ్జెక్టివ్ క్యూస్షన్స్ వీటి ద్వారా విశ్లేషణ చేయడం చాలా సులభం
  • రెండవది వాక్య రూపంలో ఉండేవి. వీటిని ఓపెన్ ఎండెడ్ పద్ధతి అంటారు ఉదాహరణ ఖాళీలను పూజించడం కొద్దిగా కష్టం
  • ఈ ప్రశ్నావళి పద్ధతి ద్వారా వ్యక్తులను ఎక్కడ ఉండను వాడవచ్చు
  • విద్యార్థుల సందేహాలకు నివృత్తి దొరకదు
  • ఉదాహరణ ఆన్లైన్ టెస్టులు

8. వ్యక్తి అధ్యయన పద్ధతి

  • వ్యక్తిని సమగ్రంగా మరియు లోతుగా అధ్యయనం చేయవచ్చు
  • ఈ పద్ధతి ద్వారా ఒక వ్యక్తిని గాని మరియు సంస్థను గాని అధ్యయనం చేయవచ్చు
  • ఈ పద్ధతి ద్వారా ఒక సంస్థ యొక్క లేదా వ్యక్తి యొక్క సమస్యకు కారణాలు తెలుసుకొని పరిష్కారము చూపించవచ్చు
  • ఉత్తమ ఫలితాలు ఎలా సాధించారో ఆ పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు
  • సమగ్ర సమాచారాన్ని సేకరించి విశ్లేషించి సమస్యకు గల కారణాలు కనుక్కొని పరిష్కారం చేయడం
  • దీనివల్ల వ్యక్తుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి
  • సమయము చాలా తీసుకుంటుంది

9. నిర్ధారణ మాపనాలు 

  • ఐదు లేదా ఏడు బిందువుల ద్వారా చేస్తారు
  • ఇందులో రెండు రకాలు గ్రాఫిక్ నిర్ధారణ మాపని ఇందులో వర్ణాలు ఉంటాయి దానిమీద క్లిక్ చేయాల్సి ఉంటుంది
  • రెండవది కోటికరణ మా పని ఇందులో చుక్కలు సంఖ్యలు బొమ్మలు లాంటి ఉంటాయి
  • ఇది సులభమైన పద్ధతి
  • పరిమాణాత్మక మరియు గుణాత్మక దత్తాంశాన్ని సేకరించవచ్చు
  • ఒకేసారి ఎక్కువమందికి ఉపయోగించవచ్చు
  • ఖచ్చితమైన సమాచారము పొందవచ్చు
  • పక్షపాతానికి స్థానము కలదు
  • నిష్ణాతులు కాని వారు కూడా వాడవచ్చు




How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts