i) వారి పిల్లల విద్యాపరంగా ఎదుగుదలకు తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదిగా ఉండేలా తల్లిదండ్రులు 100% భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి PTM కోసం వారిని ఆహ్వానించడానికి HMలు చాలా ముందుగానే పాఠశాల విద్యార్థుల ద్వారా వ్రాతపూర్వకంగా ఆహ్వానం పంపడం ద్వారా తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం.
ii) పాఠశాలను సాధారణంగా సమాజంతో మరియు ముఖ్యంగా పాఠశాల యొక్క ప్రధాన వాటాదారులతో అంటే తల్లిదండ్రులతో అనుసంధానించడం.
నమోదును మెరుగుపరచడానికి తల్లిదండ్రుల మద్దతు పొందడానికి.
iv) పాఠశాల అభివృద్ధి కార్యకలాపాలలో మరియు విద్యార్థులు మరియు సంస్థ యొక్క విద్యాపరమైన వృద్ధికి తల్లిదండ్రులను కీలక వాటాదారులుగా చేర్చడం.
v) HMలు PTMలకు ఇప్పటివరకు రాని తల్లిదండ్రులపై మరియు వారి హాజరును నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.
vi) పేటీఎం సమయం మరియు తేదీని సూచిస్తూ తల్లిదండ్రులకు ఆహ్వానాన్ని పంపండి, సమావేశానికి వారి ఫోన్‌లను తీసుకురావాలని తల్లిదండ్రులను అభ్యర్థించండి.
vii) పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమయంలో హెడ్ మాస్టర్లు/ఉపాధ్యాయులు వివరాలను పంచుకుంటారు మరియు తల్లిదండ్రుల మొబైల్‌లలో ఇంటింటా చదువుల పంట (ICP) యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
viii) హెడ్ మాస్టర్లు/ఉపాధ్యాయులు కూడా యాప్‌లో స్కూల్ UDISE కోడ్‌ని ఉపయోగించి విద్యార్థులను నమోదు చేసుకోవాలి.
ix) గ్రామీణ ప్రాంతంలోని చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులు మరియు పట్టణ ప్రాంతాల్లో ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నందున, తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావడానికి అనుకూలమైన సమయంలో పేటీఎమ్ నిర్వహించవచ్చని సూచించబడింది.
x) HMలు సమావేశ నిమిషాలను రికార్డ్ చేయాలి.
[*19 ఆగస్ట్ రోజున జరిగే PTM* పై *సెక్రెటరీ మేడం గారు, C&DSE గారితో* ఈ రోజు 9.30 గంటలకు జరిగిన *zoom సమావేశంలో చర్చించిన అంశాలు.*
1.ప్రతీ నెలకు జరిగే PTM కి ఒక థీమ్ ని ఇవ్వడం జరిగింది.
2.ప్రతీ Parent కి ఆహ్వానం పంపించాలి., Acknowledge తీసుకోవాలి.
3.పేరెంట్స్ ని మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలి (అందుబాటులో ఉన్న పూల తో బొకే లాంటివి చేసి).
ఒకరికి ఒకరు పరిచయం చేసుకునేలా అవకాశం ఇవ్వాలి.
4.Quality Education పై చర్చ జరగాలి.
పిల్లల ప్రగతి ప్రదర్శన జరగాలి.
పిల్లల్లో ఉన్న Positive energies ని ప్రోత్సహించేలా ఉండాలి.
5.One to one Conversation జరగాలి.
6.No Complaints-Only Complements అనే అంశాన్ని అనుసరిస్తూ పోషకులతో చర్చ జరగాలి.
7.Positive parenting అంశంపై పై అవగాహన కల్పించాలి.
మండల విద్యాశాఖాధికారులు/ ప్రధానోపాధ్యాయులు ZPHS/UPS/PS ( GOVT AND LOCAL BODY) ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడల్ స్కూల్స్ , స్పెషల్ ఆఫీసర్స్ ఆఫ్ KGBV అందరికి తెలియపరచునది ఏమనగా...
రేపు అనగా 19-08-2023 రోజున మన పాఠశాలలో విధిగా *2వ తల్లిదండ్రుల సమావేశం* ఎజెండా ప్రకారం నిర్వహించ వలసి యున్నది .కావున ప్రతిపాఠశాలలో PTM నిర్వహించ వలసినదిగా తెలియ జేయుచున్నాము .
ఇట్టి సమావేశములపై స్టేట్/డిస్ట్రిక్ట్ అధికారుల పర్యవేక్షణ కలదు . అజెండా ను అనుసరించి PTM నిర్వహించవలసినదిగా తెలియజేయుచున్నాము .
క్రింది పాయింట్స్ తప్పని సరిగా అమలు చేయాలి
1. తల్లిదండ్రులను పిల్లలచే డాన్స్ తో కానీ ఒక పుష్పం తో కానీ గౌరవంగా పాఠశాలకు వెల్కమ్ తెలపాలి
2. *ప్రతి క్లాస్ టీచర్ చే పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేయించి సమావేశమును తప్పనిసరిగా వచ్చునట్లు చూడాలి.*
3. *ఈరోజు తప్పనిసరిగా పేరెంట్స్ కి ఇన్విటేషన్ వెళ్ళాలి.*
4. తల్లిదండ్రులతో ఒక్కొక్కరితో ముఖాముఖి మాట్లాడాలి.
5. పిల్లల పై కంప్లైంట్స్ చేయకుండా *compliments* ఉండాలి
6 . పిల్లలచే పేరెంట్స్ ముందు వివిధ ఆక్టివిటీస్ చేయించాలి.
Eg.: బాలసభ.
7. తల్లిదండ్రులకు ఆటలు నిర్వహించాలి.
8. పేరెంట్స్ ని సెల్ ఫోన్ తెచ్చుకోమని చెప్పండి.
*చదువుల పంట ఆప్* ప్రతి తల్లిదండ్రి సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేయించండి.
9. మనం ఇచ్చే వర్క్ బుక్ ప్రాధాన్యతను వివరించండి. తొలిమెట్టు గురించి వివరించండి. మీరు వినియోగించే TLM ను ప్రదర్శించండి
10.సమావేశము ను ఆహ్లాదకర వాతావరణం లో నిర్వహించండి
11. ఎక్కువ శాతం తల్లిదండ్రులు హాజరయ్యే విధంగా చూడడం బాధ్యత మీదే. తరగతి వారి సమావేశం నిర్వహించండి
*🏵️ఈ రోజటి PTM సమావేశం నకు మాడల్ మినిట్స్*
ఈ రోజు అనగా తేదీ 19.08.2023 శనివారం రోజున ఉదయం 9:30 లకు మన బడి లో తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం ను ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశం నకు అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ / శ్రీమతి_____________గారు ముఖ్య అతిథులుగా పాఠశాల నిర్వాహణ కమిటీ చైర్మన్ శ్రీ / శ్రీమతి ______________॥గారు తో పాటి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం నందు చర్చించిన ముఖ్యాంశాలు :
▪️ఈ సమావేశమును తరగతి వారీగా తరగతి ఉపాధ్యాయులు నిర్వహించారు. .
▪️ఈ నెలలో జరిగిన ఫార్మాటివ్ టెస్ట్ ఫలితాలను తల్లిదండ్రులకు తరగతి ఉపాధ్యాయులు వివరించారు.
▪️నుతనంగా వచ్చిన వర్కుబుక్స్ గూర్చి వివరించాము.
▪️తొలిమెట్టు లో విద్యార్ధులు సాధించిన ప్రగతి ఫలితాలను తల్లిదండ్రులకు తరగతి ఉపాధ్యాయులు వివరించారు.
▪️గత విద్యా సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరించాము.
▪️రాబోయే సమావేశానికి తల్లిదండ్రుల అంచనాలు, ఉపాధ్యాయుల అంచనాలుపై చర్చ జరిపాము.
▪️రాగి జావ వారం లో మూడు రోజులు అదిస్తున్నమని తెలిపాము .
0 Comments
Please give your comments....!!!