Procedure
Step 1
పైన ఫోటోలో చూపించిన విధముగా లాగిన్ పైన క్లిక్ చేయండి
Select Others
తర్వాత పైన ఫోటోలు చూపించిన విధంగా అదర్స్ పైన క్లిక్ చేయండి
ఆ తర్వాత లాగిన్ పేజీలో మీ స్కూల్ కాంప్లెక్స్ యొక్క టుడేస్ కోడ్ మరియు పాస్వర్డ్ ను నమోదు చేయండి
గమనిక
స్కూల్ కాంప్లెక్స్ కోడ్ మాత్రమే నమోదు చేయండి మీ బడిది చేయవద్దు.
ఉపాధ్యాయుల సెలవుల వివరాలు నమోదు చేయడం స్కూల్ కాంప్లెక్స్ లాగిన్ లో మాత్రమే వస్తుంది.
Step 2:
స్కూల్ కాంప్లెక్స్ లాగిన్ వివరాలతో లాగిన్ అయిన తర్వాత పైన చూపిన విధంగా teachers information system పైన క్లిక్ చేయండి
తర్వాత సర్వీసెస్ పైన క్లిక్ చేయండి అప్పుడు మొదటగా వచ్చే టీచర్స్ లీవ్స్ పైన క్లిక్ చేయండి
ప్రస్తుతం తమ కాంప్లెక్స్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరి అన్ని రకాల సెలవులను జనవరి నెల నుంచి ఇప్పటివరకు వాడుకున్న అన్ని రకాల సెలవులను నమోదు చేయాల్సి ఉంటుంది మొదటగా జనవరి నెల అయ్యి ఆ తర్వాత ఫిబ్రవరి నెల తర్వాత మార్చి నెల తర్వాత ఏప్రిల్ తర్వాత జూన్ నమోదు చేయాల్సి ఉంటుంది ఏ నెలది అయితే నమోదు చేయాలనుకుంటున్నామో ఆ నెలను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
మనం నమోదు చేయవలసిన నేలను ఎన్నుకున్న తర్వాత తమ కాంప్లెక్స్ పరిధిలో పనిచేస్తున్న అందరి పేర్లు అక్కడ కనబడతాయి సంబంధిత నెలలో వారు వాడుకున్న మొత్తం సెలవుల సంఖ్య ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది వాళ్లు వాడుకున్న సెలవులు సంబంధిత తేదీలను నమోదు చేయాల్సిన అవసరం లేదు కేవలం సెలవుల సంఖ్య నమోదు చేస్తే సరిపోతుంది.
పై ఫోటోలో చూపించిన విధంగా అందరి సెలవులు అన్ని రకాల సెలవులు నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
గమనిక:
ఇలా ప్రతి నెల 5వ తేదీ లోపు గడిచిపోయిన నెల యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది దీని కొరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి ఒక ప్రొఫార్మాలో సెలవుల వివరాలు తెప్పించుకోవాలి ఆ ప్రొఫార్మర్ ఈ క్రింద ఉన్నది.
తమ పరిధిలోని ఉపాధ్యాయుల సెలవుల రిజిస్టర్ను ఆటోమేటిగ్గా ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని రిజిస్టర్ గా పెట్టుకోవాలి దీనికి కొరకు ఈ క్రింద ఫోటోలు చూపిన విధంగా డౌన్లోడ్ చేసుకోగలరు
0 Comments
Please give your comments....!!!