Guruvu.In

Do-It-Your self (DIY) Science Hackathon , FAQs, Model Science Projects

DEPARTMENT OF SCHOOL EDUCATION, TELANGANA

DO-IT-YOURSELF (DIY) SCIENCE HACKATHON


VENUE: IN THEIR RESPECTIVE SCHOOLS

MODE ONLINE

Eligibility: All students of class 8-10 A from Govt. schools.

oncepts from Select the concepts from official website from 12th June, 2023

• Take 2 minute video explaining your concept

• Upload the video in YouTube channel

• Paste the video link in the website on 20th June, 2023 before 4.00 p.m

For more details please visit: https://schooledu.telangana.gov.in.



*💥సందేహాలు - సమాధానాలు*(FAQs) సైన్స్ హ్యకథాన్


*1. హ్యకథాన్ కోసం తయారు చేసుకున్న వీడియోస్ ను జూన్ 20 కంటే ముందు youtube లో అప్లోడ్ చేయవచ్చా?

జ: ఔను. చేసుకోవచ్చు. యూట్యూబ్ లో జూన్20 లోపు ఏ రోజైనా కూడా చేయవచ్చు కాని student లేదా group ను నామినేట్ చేసే ప్రక్రియ అయినటువంటి *Submit Project* ప్రక్రియ మాత్రం జూన్ 20 న 10am to 4pm మధ్యలో చేయాల్సి ఉంటుంది.

*2. హ్యకథాన్ కోసం ఇవ్వబడిన 77 concepts మరియు ఇతర guidelines ఎక్కడ నుండి పొందవచ్చు?*

జ: ఈ కింది లింక్ ఓపెన్ చేసి పోర్టల్ లో చివరి కింది భాగం వరకు scroll చేస్తే మీకు How to upload in YouTube, List of concepts, Guideline etc డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి. Pdf ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్





*3. Submit Project ఎక్కడ చేయాలి?*

జ: పైన తెలిపిన లింక్ లోనే ఆ option ఉంటుంది.

*4. మా పాఠశాలలో 10 projects (10 videos) తయారయ్యాయి. ఇవ్వబడిన పోర్టల్ లో Submit Project అనే ఆప్షన్ తీసుకుని form ను 10 సార్లు (ఒక్కోక్క ప్రాజెక్ట్/వీడియో కోసం ఒక్కొక్కసారి) fill up చేయాలా?*

జ: ఔను

*5. మా పాఠశాలలో లో ఒకే గ్రూప్ విద్యార్థులు నాలుగు విభిన్న projects/videos చేశారు, అప్పుడు ఎలా?*

జ: నాలుగు సార్లు fill up చేయాలి.

*6. వీడియో ఎలా ఉండాలి అని కొంత అవగాహన ఇచ్చే Sample Videos ఎక్కడ చూడాలి?*

జ: ఈ కింది లింక్స్ క్లిక్ చేసి ఈ రెండు sample videos ను యూట్యూబ్ లో చూడండి


మరియు


మీరు ఇంతకంటే స్పష్టంగా, బెటర్ గా కూడా చేయవచ్చు.

*7. ఒక స్కూల్ నుండి గరిష్టంగా ఎన్ని ప్రాజెక్టులు/విడీయోలు సబ్మిట్ చెయ్యొచ్చు?

జ: ఎన్నైనా చేయవచ్చు. పరిమితి లేదు. 8th, 9th మరియు 10th విద్యార్థులను ఒక్కొక్క గ్రూపులో నలుగురికి మించకుండా, ఒక్కొక్క ప్రాజెక్ట్/వీడియో లో ఉపయోగించిన DIY కిట్ పరికరాల మొత్తం 200రూపాయలకు మించకుండా ఉంటే చాలు.

8. *నాకు/మా ఫ్రెండ్ కి YouTube channel ఉంది. దాంట్లో హకథాన్ వీడియోస్ అప్లోడ్ చేసి ఆ లింక్స్ ను సబ్మిట్ చేయవచ్చా?*

జ: ఇబ్బందికర కంటెంట్ లేకుండా ఉండే చానల్స్ కనుక అయితే వాటిలో కూడా అప్లోడ్ చేయవచ్చు.

*9. Videos యొక్క Evaluation Criteria ఏంటి?*

వీడియో క్వాలిటీ & వివరణకు 10 పాయింట్లు, DIY kit లోని పరికరాలకు 30, ప్రాజెక్ట్ యొక్క ఒరిజినాలిటి, సృజనాత్మకత, ప్రత్యేకతలకు 30, ఆ గ్రూప్ వారు సబ్మిట్ చేసిన ప్రాజెక్టుల సంఖ్యకు 30 పాయింట్లు.

10. *హ్యకథాన్ మరిన్ని వివరాలకు సమాచారం?

జ: ఈ కింది ppt presentation ను వీక్షించండి.


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts