Frequently Asked Questions on 317 Teachers Transfer, Transfer Points Calculator, Certificate

🔊🌈 *317 వారి బదిలీలు సందేహాలు - వివరణ* 

 *1.ప్ర: పాత స్టేషన్‌ 7 సంవత్సరాలు, కొత్త స్టేషన్‌ 1 సంవత్సరం పైబడి స్టాండిరగ్‌ సర్వీస్‌ అంటే మొత్తం 8 సంవత్సరాలకు పైబడి ఉంటే కొత్త స్టేషన్‌ క్లీయర్‌ వెకెన్సీగా చూపిస్తారా?* 
 
👉జ: కొత్త స్టేషన్‌ను క్లీయర్‌ వెకెన్సీగా చూపించరు. కోర్టు పాత స్టేషన్‌ పాయింట్లు కలపమని ఆదేశించింది.మీ కొత్త స్థానాన్ని ఎరైసింగ్‌ వెకెన్సీగానే చూపిస్తారు. 

 *2.ప్ర:పాత స్టేషన్‌లోనే 8 నుండి 11 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసుకొని 317లో కొత్త స్టేషన్‌కు వచ్చి 1సంవత్సరం పైబడి గడిచిన వారి కొత్త స్టాండిరగ్‌ స్కూల్‌ ప్లేస్‌ను క్లీయర్‌ వెకెన్సీగా చూపిస్తారా?
 
👉జ: 317లోఅలాట్‌ అయిన పాఠశాలను క్లీయర్‌ వెకెన్సీగా చూపించరు, ఎరైసింగ్‌ వెకెన్సీగా మాత్రమే చూపిస్తారు.ఎందుకంటే 317లో మీరు లోకల్‌క్యాడరైజేషన్‌లో భాగంగా కొత్త జిల్లాకు అలాట్‌ చేయబడ్డారు. పాత స్టేషన్‌ పాయింట్లు కలుపుతారు. కొత్త స్టేషన్‌లో బదిలీకి అప్లై చేసుకోవచ్చు. 

 *3. మ్యూచువల్‌ బదిలీ పొందిన వారికి బదిలీ అప్లై చేసుకునే అవకాశం ఉందా?* 
 
👉జ:మ్యూచువల్‌ బదిలీ పొందిన ఉపాధ్యాయులకు అప్లై చేసుకునే అవకాశం లేదు. అండర్‌టేకింగ్‌ ఇవ్వడం ద్వారా సర్వీస్‌ ప్రొటెక్షన్‌లేని అంతర్‌జిల్లా బదిలీని పొందినారు. సర్వీస్‌ ప్రొటెక్షన్‌ కేసు కోర్టులో ఉన్నది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts