👉రెండు రకాల పీటేషన్స్ దాఖలు అయినాయి.
*🏵️A కేటగిరీ..*
GO 317 ద్వారా వేరే జిల్లాలో అలాట్ అయి న్నాము. GO 5 ప్రకారం బదిలీ కావటానికి కొత్త స్టేషనులో 2 ఇయర్స్ మినిమం సర్వీస్ ఉండాలి అని నిబంధనతో మాకు అవకాశం లేదు. కావున గతంలో GO 610 ద్వారా బదిలీ చేయబడ్డ టీచర్సుకు బదిలీ, పదోన్నతులకు సర్వీస్ కౌంట్ చేశారు. వారి లాగే మా ఓల్డ్ స్కూల్ పాయింట్ సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీ అవకాశం ఇవ్వాలి.
*🏵️B. కేటగిరీ.*
GO 317 మరియు తదుపరి memoల ప్రకారం అలాట్మెంటులో తిరిగి ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాకు అలాట్ అయి అదే స్టేషనులో పనిచేస్తున్నాము. మేము అందరం కూడా కొత్తగా మళ్ళీ జాయిన్ అయి నట్లే. కావున లాంగ్ స్టాండింగ్ కోసం 5/8 సర్వీస్ కోసం కొత్తగా అలాట్ అయిన తేదీ నుండి పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో దీనిపై interim ఆర్డర్స్ ఇచ్ఛిన్నారు.దానిని పొడిగింపు చేయండి.
*వాదనల అనంతరం కోర్ట్ directions.*
*🏵️A-వారికి*
A బ్యాచులో ఉన్న *కేసు వేసినా వారికి* ఓల్డ్ స్టేషన్ సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీ పాయింట్స్ ఇవ్వవలెను.
*🏵️B వారికి..*
👉 గతంలో ఇచ్చిన IR కు ప్రభుత్వం సరి అయిన జవాబు ప్రభుత్వం ఇచ్చినది. వారి సమాధానంతో ఏకీభవిస్తూ.. IR పొడగించలేము.
కావున ఈ రోజు నుండి వారం లోగా బదిలీ షెడ్యూలును రీ షెడ్యూల్ చేయండి.
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గారు ఇచ్చిన సమాధానాలు
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ఈ సందర్భంగా
1. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జీవో 317 అమలు ద్వారా ట్రాన్ఫర్స్ రీ-షెడ్యూల్ ఈ రోజు రాత్రి వరకు విడుదల చేస్తామని,
2. ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్ట్ పదోన్నతులకు అర్హతలున్నచో వారిని ముందే ఆప్షన్ అడగడం వల్ల కోరుకున్న సబ్జెక్ట్ లలో పదోన్నతి రానప్పుడు మిగతా అవకాశాలు దక్కవని అడగగా... ఆలాంటి ఆప్షన్ ఇప్పుడే అడగ కూడదని DEO లకు ఆదేశాలు ఇస్తామని,
3. గతంలో SGT లుగా పనిచేసి విద్యా శాఖ అనుమతితో రిక్రూట్మెంట్ ద్వారా SA లుగా ఎన్నికైన వారి పాత సర్వీస్ ను మొత్తం సర్వీస్ కు లెక్కించాలని కోరగా, అది రూల్స్ కు విరుద్ధమని, సాధ్యం కాదని;
4. పదోన్నతులు నిరాకరించినా, పదోన్నతి పొంది పదవిలో చేరక పోయిన సందర్భాలలో ఆయా ఖాళీలలోకి ఈ బదిలీల ప్రక్రియ అనంతరం మరోసారి పదోన్నతులు పరిశీలిస్తామని
5. TRT 2017 ఇంగ్లీష్ మీడియంలో నియామకమైన ఎస్జీటీలకు, ఇంగ్లీష్ మీడియం ప్రత్యేక సీనియార్టీ తయారు చేయాలని, అట్లే బదిలీలలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లోకి అనుమతించాలని కోరగా ప్రస్తుతం తెలంగాణలో అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం లోకి మారుతున్నాయని, వారికి ప్రత్యేక లిస్టులు తయారు చేయడం ద్వారా భవిష్యత్తులో పదోన్నతుల్లో వారికే నష్టమని అన్నారు.
6. పదోన్నతుల మల్టీ జోన్ సీనియారిటీ లిస్టుల లో అనేక తప్పులు జరుగుతున్నాయని కొన్ని ఉదాహరణలు తెలుపగా అవి ఆర్జేడీ స్థాయిలో పరిష్కరిస్తారని, DSE స్థాయిలో వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో విద్యా కార్యదర్శి వాకాటి కరుణ మేడం, సంయుక్త కార్యదర్శి హరిత మేడం మరియు పాఠశాల విద్య అదనపు సంచాలకులు లింగయ్య గారు ఉన్నారు.
0 Comments
Please give your comments....!!!