Spouse Points Details in Telugu with Example

*బదిలీల్లో GO Ms.No. 5 ప్రకారం ఎవరు, ఎలా ,ఎప్పుడు SPOUSE కేటగిరీలో స్పెషల్ పాయింట్లను పొందుటకు అర్హులు?*

1. SPOUSE కేటగిరిలో ఇద్దరు టీచర్లు అయినసందర్భంలో , ఎనిమిది సంవత్సరాల పీరియడ్లో భార్యాభర్తల్లో ఒకరు మాత్రమే స్పెషల్ పాయింట్లు పొందుటకు అర్హులు.

 Case 1: 

భార్య 2018 బదిలీలో SPOUSE కేటగిరీ ఉపయోగించుకొని బదిలీ అయ్యారు. ప్రస్తుతం భర్త ఎనిమిది సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ను పూర్తి చేసుకున్నప్పటికీ SPOUSE కేటగిరి స్పెషల్ పాయింట్లు పొందడానికి వీలు లేదు.(కారణం భార్య స్పెషల్ కేటగిరీని ఉపయోగించుకొని ఎనిమిది సంవత్సరాలు పూర్తికానందున భర్తకు స్పెషల్ కేటగిరి వర్తించదు.)

Case 2:

భార్యాభర్తలు ఇరువురు 8 సంవత్సరాల లాంగ్ స్టాండింగ్ పూర్తి చేసుకున్నారు .కేవలం ఎవరో ఒకరు మాత్రమే ఈ బదిలీల్లో స్పెషల్ పాయింట్లు పొందుటకు అర్హులు .

2. భార్యాభర్తలుగా జిహెచ్ఎం మరియు టీచర్ ఉన్న సందర్భాలలో ,

టీచర్ స్పోజ్ పాయింట్లు ఉపయోగించిన తేదీ నుండి ఐదు సంవత్సరాలు పూర్తి ఐన తర్వాతనే బదిలీలో GHM స్పౌజ్ కేటగిరి స్పెషల్ పాయింట్లకి అర్హులు. 

జిహెచ్ఎం SPOUSE కేటగిరీలో బదిలీ అయిన తర్వాత తేదీ నుండి 8 సంవత్సరాలు పూర్తి ఐన తర్వాతనే టీచర్ SPOUSE కేటగిరీలో బదిలీకి అర్హులు.

Case:1

టీచర్ 2018 జులైలో స్పౌజు కేటగిరీలో బదిలీ కాబడినారు జిహెచ్ఎం కు ప్రస్తుతం లాంగ్ స్టాండింగ్ ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ టీచర్ ఉపయోగించుకొని ఐదు సంవత్సరాలు పూర్తికానందున జిహెచ్ఎం SPOUSE పాయింట్లు వాడుకొనుటకు అనర్హులు.

 Case 2:

జిహెచ్ఎం SPOUSE పాయింట్లు ఉపయోగించుకొని బదిలీ అయిన తేదీ నుండి 8 సంవత్సరాలు పూర్తి అయిన పిదప మాత్రమే టీచర్ SPOUSE పాయింట్లు వాడుకొనుటకు అర్హులు. 

స్పాంజ్ కేటగిరిలో స్పెషల్ పాయింట్స్ ను ఉపయోగించే సందర్భాలలో విద్యాశాఖ కార్యాలయాలలో ఎలాంటి పొరపాట్లు జరిగినా జీవో ప్రకారం అధికారులతో మాట్లాడి SPOUSE కేటగిరీలో వచ్చు తప్పుడు అప్లికేషన్స్ను ,తప్పుడు ధోరణీలను నిరోధించవచ్చు .అర్హులైన వారికి బదిలీలలో న్యాయం చేయవచ్చు.



*💥 *💥➡️317 అలకేషన్ లో స్పౌజ్ ప్రాధాన్యత ఉపయోగించుకున్నప్పటికీ ప్రస్తుత బదిలీల్లో స్పౌజ్ లో ఒకరు స్పెషల్ పాయింట్స్ తీసుకోవచ్చు.*




*స్ఫౌజ్ క్లారిఫికేషన్*

*నిన్న రాత్రి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 317 అలోకేషన్ కింద ఇందులో స్ఫౌజ్ కేటగిరీ కింద వచ్చిన వారు కూడా ఇద్దరిలో ఒకరు అనగా స్ఫౌజ్ ఉపయోగించని వారు నేటి బదిలీలలో స్ఫౌజ్ పాయింట్లు ఉపయోగించుకోవచ్చని, దీనికోసం ప్రధానోపాధ్యాయులు అయితే గత ఐదు సంవత్సరాల పీరియడ్ చూడాలి. ఉపాధ్యాయులైతే ఎనిమిది సంవత్సరాల సేవాకాలాన్ని చూడాలని చెప్పారు. ఉపాధ్యాయులు దీనిపై ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదు.*

 *స్ఫౌజ్ గ్రౌండ్లో 317 లో వచ్చినప్పటికీ కూడా నేటి ట్రాన్స్ఫర్ లో ఉపయోగించుకోవచ్చు.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts