Guruvu.In

Absentee s Register Guidelines, Pro forma

Absentee Register Guidelines

ముందుగా, గైర్హాజరు అయ్యే విద్యార్థులను రెండు రకాలుగా గుర్తించాలి

1. వారం కన్న తక్కువ గా లేదా తరచూ గా గైర్హాజరు అయ్యే విద్యార్థులు ( వీరిని ఫోన్ చేసి వివరాలు సేకరించవచ్చు ).

2. ఎక్కువ గా లేదా చాలా రోజులు గైర్హాజరు అయ్యే విద్యార్థులు ( వీరి ఇంటికి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా వెళ్లి వివరాలు సేకరించాలి. వారి సంతకాలు తీసుకోవాలి )

3. ఒక వేళ విద్యార్థి వేరే పాఠశాల లో చదువుతున్నట్లు అయితే ఆ పాఠశాల పేరు ప్రధానోపాధ్యాయులు సెల్ ఫోన్ నం సేకరించాలి. ఈ వివరాలు కూడా కారణం లో రాసుకోవాలి. ఆ ప్రధానోపాధ్యాయులు కు ఫోన్ చేసి స్కూల్ edu వెబ్ సైట్ లో రిక్వెస్ట్ పంపమని చెప్పాలి. లేదా మనమే మన స్కూల్ edu వెబ్ సైట్ నుండి డ్రాప్ బాక్స్ లో వేయాలి. వెంటనే మన పేరు తీసివేయాలి.

4. విద్యార్థుల గైర్హాజరు పై బాధ్యత తరగతి ఉపాధ్యాయుడి దే ఉంటుంది. ఈ గైర్హాజరు రిజిస్టర్ నిర్వహణ, విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూసుకోవడం, గైర్హాజరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, వారి ఇంటికి వెళ్ళి పిల్లలను తీసుకు రావడం తరగతి ఉపాధ్యాయుడి చేయవలసి ఉంటుంది.


1. పాఠాశాల కు వారం రోజుల పాటు విద్యార్థి రాకపోతే ఆ విద్యార్థుల బడికి రాకపోవడానికి గల కారణాలు ఒక రిజిస్టర్ లో రాయవలసి ఉంటుంది. ఈ వివరాలు ఆ విద్యార్థి తల్లి దండ్రులు కు ఫోన్ చేసి సేకరించవచ్చు.

రిజిస్టర్ లో నమోదు చేయవలసిన అంశాలు:

వరుస సంఖ్య
ఫోన్ చేసిన తేదీ
తరగతి
అడ్మిన్ నం
విద్యార్థి పేరు
తండ్రి పేరు
సెల్ ఫోన్ నం
రాకపోవడానికి గల కారణాలు
తరగతి ఉపాధ్యాయుని సంతకం


2. చాలా రోజులు బడికి రాక పోయినా ఎడల ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి వా రి తల్లిదండ్రులు ను కలిసి బడికి పంపాలని ఒప్పించాలి 
రిజిస్టర్ లో నమోదు చేయవలసిన అంశాలు:

వరుస సంఖ్య
ఫోన్ చేసిన తేదీ
తరగతి
అడ్మిన్ నం
విద్యార్థి పేరు
తండ్రి పేరు
సెల్ ఫోన్ నం
రాకపోవడానికి గల కారణాలు
తల్లిదండ్రులు సంతకాలు
తరగతి ఉపాధ్యాయుని సంతకం


Click here to Download PDF  Absentee Register 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts