FAQs Frequently Asked Questions on service matters

*🌷🌷సందేహాలు - సమాధానాలు*

*ప్రశ్న : వేసవి సెలవుల మధ్యలో విదేశాలకు వెళ్ళాలన్నా అధికారుల పర్మిషన్ తీసుకోవాలా?*

 జవాబు : అవును. పనిదినాలైనా, సెలవులైనా విదేశాలకు వెళ్ళాలంటే పై అధికారుల అనుమతి తప్పనిసరి.

*ప్రశ్న : ఒక ఉపాధ్యాయిని మే 28 నుండి జూన్ 28 వరకు విదేశాలకు వెళ్ళవలసి వున్నది. ఏ రకమైన సెలవు పెట్టు కోవాలి?*

జవాబు : పాఠశాల పున:ప్రారంభం తేదీ నుండి జూన్ 28 వరకు అర్ధజీతపు లేదా జీత నష్టపు లేదా సంపాదిత సెలవు పెట్టుకోవాలి. 

*ప్రశ్న : చైల్డ్ కేర్ లీవుతో జతపరిచి సిఎల్ పెట్టుకోవచ్చా?*

 జవాబు : పెట్టుకోరాదు. జిఓ ఎంఎస్ నం. 132 తేదీ. 06.07.2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవు సంపాదిత సెలవు మాదిరిగా మంజూరు చేయవలసి వుంటుంది. అందువలన సిఎల్ జతపరచి వాడుకోరాదు. , 

*ప్రశ్న : నేను రూ.398/-ల వేతనంపై పనిచేసియున్నాను. వచ్చే నెలలో పదవీ విరమణ చేయవలసి వున్నది. స్పెషల్ టీచర్ సర్వీస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఎలా లెక్కించాలి.*

జవాబు జిఓ నం.28, తేదీ. 01.03.2019 ప్రకారం రూ. 398/- వేతనంపై చేరిన రోజు నుండి స్కేలు ప్రారంభ వేతనంతో లెక్కిస్తూ పదవీ విరమణ వరకు ఇంక్రిమెంట్లు లెక్కించాలి.

*ప్రశ్న : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని 5 నెలలు జీత నష్టపు సెలవు పెట్టారు. సెలవు ఎవరు మంజూరు చేయాలి?*

జవాబు : జిఓ ఎంఎస్ నం.70 తేది. 06.07.2009 ప్రకారం 4 నెలల పైన 6 నెలల వరకు సెలవు మంజూరు చేయవలసిన అధికారం ఉపవిద్యాశాఖాధికారిది. 

*ప్రశ్న : వేసవి సెలవుల ముందురోజు ఏప్రిల్ 23న పాఠశాలకు రావడం కుదరకపోతే సెలవులు మొత్తం కోల్పోవలసిం దేనా?*

జవాబు : అవసరం లేదు. ఏ.పి. సెలవు నిబంధనల ప్రకారం వెకేషన్ కు ఏదో ఒక ప్రక్కన హాజరైతే సరిపోతుంది. కావున ఆ ఒక్కరోజుకు అర్హతగల సెలవు పెట్టుకుంటే సరిపోతుంది. 

*ప్రశ్న : ఒక మహిళా ఉపాధ్యాయిని వేసవి సెలవుల మధ్యలో ప్రసవించే అవకాశం వుంది. ఆమె ప్రసూతి సెలవు పాఠశాల ప్రారంభం అయిన దగ్గర నుండి 180 రోజులు పెట్టుకోవచ్చా?*

జవాబు : వేసవి సెలవుల మధ్యలో ప్రసవించినప్పుడు 180 రోజులలో ప్రసవించిన తేదీ నుండి వేసవి సెలవులు ముగిసే వరకు వేసవి సెలవులుగాను మిగిలిన రోజులు ప్రసూతి సెలవుగాను వాడుకోవాలి. 

*ప్రశ్న : పది రోజులు వరుసగా సెలవులో వుండి 11వ రోజు ఎన్నికలు లేదా పరీక్ష విధులకు హాజరు కావచ్చునా?*

జవాబు : హాజరుకావచ్చు. వైద్య కారణములపై సెలవు అయితే ఫిట్నె స్ సర్టిఫికెట్ పాఠశాలకు పంపవలసి వుంటుంది. 

*ప్రశ్న : పెన్షనర్ హెల్త్ కార్డుకి దరఖాస్తు చేస్తే డిడిఓ అప్రూవల్ పెండింగ్ అని వస్తోంది? ఎవరు అప్రూవల్ చేయాలి.*

జవాబు : పెన్షనర్లకు డ్రాయింగ్ అధికారిగా సంబంధిత ఖజానాధికారి అవుతారు. వారే అప్రూవల్ చేయాలి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts