BC Creamy layer Conditions details in Telugu

తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బి.సి. రిజర్వేషన్లు - 

క్రీమీలేయర్ సర్యులర్ నెం . 3/424/2014 , తేది : 28 , 07 , 2014

 విషయము : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ - తెలంగాణ రాష్ట్రం - వెనుకబడిన తరగతుల వారికి వర్తించు క్రిమిలేయర్ నిబంధనలు వివరణ - గురించి ,

 సూచిక :
 1 ) ఆఫీస్ మెమోరెండమ్ . నెం .36012 / 22 / 93 Estt . ( SCT ) , తేది : 08.09.1993 , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా , మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్సెస్ మరియు పెన్షన్స్ ( డిపార్ట్మెంట్ అఫ్ పర్సనల్ & ట్రైనింగ్ ) న్యూ ఢిల్లీ , సెక్రెటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా , మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్సెస్ మరియు పెన్షన్స్ ( డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ ) న్యూ ఢిల్లీ , ఆఫీస్ మెమోరెండమ్ . నెం . 36033 / 13 - Estt . ( Res . ) , తేది : 27.05.2013 . 2 ) 3 ) జి.ఒ.ఎమ్.ఎస్.నెం . 26 వెనుకబడిన తరగతుల సంక్షేమ ( సి ) శాఖ , తేది : 09.12.2013 .

 *** సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో సామాజికంగా , విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగంలో పొందుపరచబడిన నిబంధనల ప్రకారం " రిజర్వేషన్ " సౌకర్యం కల్పించబడినది . ఆ మేరకు షెడ్యూల్డు కులాలు , షెడ్యూల్డు తెగలు ఇత్యాది వెనుకబడిన తరగతులకు చెందినవారికి రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేయబడినది . వెనుకబడిన తరగతులకు ( BC ) రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ సౌకర్యమును 1970 వ సంవత్సరంలో జీ.ఓ.యం.యస్.నెం . 1793 ద్వారా కల్పించినది . కేంద్రస్థాయిలో మండల్ కమీషన్ సిఫారసుల మేరకు 1993 వ సంవత్సరం నుండి రిజర్వేషన్ కల్పించబడినది . కేంద్రస్థాయిలో వెనుకబడిన తరగతుల వారిని OBC లుగా ( Other Backward Classes ) పిలుస్తారు . 

కానీ , ఇతర వెనుకబడిన తరగతులకు ( OBC ) రిజర్వేషన్లు అమలు చేయుటకు వారిలోని క్రిమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను మినహాయించాలని సుప్రీం కోర్టు ఇందిరా సహానీ VS యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును వెలువరించినది . సుప్రీం కోర్టు తీర్చు మేరకు ఇతర వెనుకబడిన తరగతులలో క్రిమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని చేయడం జరిగినది . ఆ కమిటీ చేసిన సూచనల మేరకు వెనుకబడిన తరగతులలో క్రిమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను గుర్తించడం జరుగుతుంది . సంపన్నశ్రేణి ( క్రిమీలేయర్ ) అనగానేమి ? . వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో ఆర్ధికంగా , విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని '

 సంపన్నశ్రేణిని ఈ క్రింద తెలియ జేయబడిన విధంగా గుర్తిస్తారు

 . ఈ క్రిందకెల్పిన వర్గాలు క్రిమిలేయర్ క్రిందికి వస్తారు .

 I. రాజ్యాంగంలో పొందుపరచబడిన పోస్టులలో ఉన్న వారి పిల్లలు : గాజ్యాంగంలో పొందుపరచబడి క్రింద తెలియజేయబడిన పోస్టులలో ఉన్న వారి పిల్లలు బ్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) గా పరిగణించబడతారు .
 1 . రాష్ట్రపతి . 
2 ఉపరాష్ట్రపతి .
 3 సుప్రీంకోర్టు , హైకోర్టు మరియు పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు . 
4 . UPSC & PSC అధ్యక్షులు మరియు సభ్యులు .
 6 . చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ( CEC ) .
 6 . కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( CAG ) . . 
7 . అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ .
 8 అధికార భాషా సంఘ సభ్యులు 
. 9 . కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు , MP , MLA & MLC ఎగువ చట్టసభల చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్లు . రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర పోస్టులలో ఉన్నవారు 

ఉద్యోగు క్రింద తెలియజేయచిన రేటగిరీలకు చెందిన సివిల్ ఉద్యోగుల పిల్లలు క్రిమీలేయర్ ( సంపన్నురేట్ గా పరిగణించబడతారు

1 2 తల్లి దండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీసులలో ( IAS , IPS and IFS ) డైరక్టుగా నియామకం పొందినవారు . తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు . తల్లిదండ్రులిదువురూ గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు . 3 . 4 . తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం కాబడి . 40 సం॥ల లోపు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు . 40 సం॥ల తర్వాత గ్రూప్ -1 స్థాయికి ప్రమోషన్ పొందినవారు క్రిమీలేయర్కు చెందరు .

 పైన తెలియజేయబడిన కేటగిరీలకు చెందిన ఉద్యోగస్థులు సర్వీసులో ఉన్నా , రిటైనైనా లేక మరణించినా వారి పిల్లలు శ్రీమీలేయర్ ( సంపస్కృశ్రేణి ) గా పరిగణించబడతారు . అలా గాక , తల్లిదండ్రులివురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్ -3 లేక గ్రూప్ -4 స్థాయిలో తొలుత నియామకం పొందియుండిన ఎడల వారి పిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ సంపన్నశ్రేణిగా పరిగణించబడదు . ఒక వేళ గ్రూప్ -4 స్థాయిలో తొలుత నియమింపబడి , 40 ఏళ్ళలోపే గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినప్పటికి వారి పిల్లలు ' సంపన్నశ్రే ' క్రిందకు రారు . 

సివిల్ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా గమనించవలసిన అంశమేమిటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంపన్నశ్రేణి క్రిందకు వస్తారా ? రారా ? అన్న విషయం నిర్ణయించబడుతుంది . అంతేకానీ , వారు పొందు జీతభత్యములను బట్టి మాత్రం కాదు . ఈ విషయమును మరింత స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి క్రింది ఉదాహరణలను పరిశీలించండి . 

గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమైన జిల్లా బి.సి. సంక్షేమాధికారి ( DBCWO ) పోస్టులో డైరక్టుగా నియామాకం పొందిన వ్యక్తి మూల వేతనం రూ ॥ 10,285 / - DA , HRA , IR మొ ॥ వాటిని కలుపుకొన్న మెడల , జిల్లా బి.వి , సంక్షేమాధికారి ( DBCWC ) యొక్క జీతం నెలకు సుమారు రూ ॥21,000 / - ఆ ప్రకారం వార్షిక జీతం సుమారు రూ . 2,50,000 / జిల్లా బి.సి. సంక్షేమాధికారి ( DSCWO ) గా తొలి నియమాకం పొందిన వ్యక్తి జీతభత్యముల ద్వారా పొందు వార్షికాదాయం ప్రస్తుతం క్రీమీలేయరుగా పరిగణింపబడుటకు ఉన్న ఆదాయపరిమితి రూ ॥6.00 లక్షలు ( కేంద్ర ప్రభుత్వం OBC ) / 6.00 లక్షలు ( రాష్ట్ర ప్రభుత్వం- BC ) కన్నా తక్కువే అయినప్పటికీ , తు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియమాకం పొందిన వ్యక్తి కనుక అతని జీత భత్యములతో సంబంధంలేక అతని తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి అతని పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడతారు . ఈ ఉదాహరణనే ఇతర గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలైన RDO , DSP , CTO , DPO , DSWO , ATO . District Registrar MPDO మొదలగు వాటికి కూడా వర్తిస్తుంది .

 2 ) అదే విధంగా Hostel Welfare Officer ( HW0 ) ఒక స్థాయిలో తొలుత ఉద్యోగంలో నియమింపబడి , తదుపరి ప్రమోషన్ ద్వారా DBCWO స్థాయికి చేరుకున్న వ్యక్తి నెలకు రూ ॥ 40,000 / - జీతం పొందుతూ ఉండవచ్చు . HWO అన్నది గ్రూప్ -3 స్థాయి ఉద్యోగం , DBCWO అన్నది గ్రూప్ -1 స్థాయి ఉద్యోగం . ఆ వ్యక్తి ప్రస్తుత జీతం నెలకు రూ ॥ 52,000 చొ॥న అనుకున్నా . ఒక సంవత్సరపు జీతం రూ ॥ 6,24,000 / - అవుతుంది . అనగా అతని సంవత్సర జీతం క్రీమీలేయర్ పరిగణించబడడానికి ఉండ వలసిన ఆదాయపరిమితి కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ అతని తొలి నియామకం గ్రూప్ -3 స్థాయి ఉద్యోగంలో జరిగినందువలన అతని పిల్లలు క్రిమిలేయర్గా పరిగణించబడరు . ఇచ్చట గుర్తించుకోవలసిన మరో ముఖ్యమైన అంశమేమంటే , ఉద్యోగులు అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు మాత్రమే . ప్రైవేటు సంస్థలలో పనిచేయు ఉద్యోగులు ఈ కేటగిరీ క్రిందకు రారు .

 III మిలిటరీ మరియు పారామిలిటరీ దళాలు : మిలిటరీ ( Army , Navy and Alr Force ) మరియు పారా మిలిటరీ దళాలలో పనిచేయుచున్న తల్లిదండ్రులలో ఏ ఒక్కరు గానీ లేక ఇద్దరూ ' కల్నల్ ' స్థాయి ఉద్యోగంలో యున్న యెడల వారి పిల్లలు సంపనుశ్రేణిగా గుర్తించబడతారు . ఆ తక్కువ స్థాయిలో ఉన్నవారికి సంపన్నశ్రేణి వర్తించదు . 

IV . ప్రొఫెషనల్స్ , వాణిజ్య మరియు వ్యాపార వక్తాలు : ( ప్రైవేటుగా ప్రాక్టీసు వేస్తున్న డాక్టర్లు , ఇంజనీర్లు , లాయర్లు , చార్టర్డ్ అకౌంటెంట్లు , ఇన్కంటాక్స్ కన్సల్టెంట్లు , ఆర్కిటెక్టులు , కంప్యూటర్ ప్రొఫెషనల్స్ , సినీ ఆర్టిస్టులు , రచయితలు , జర్నలిస్టులు , క్రీడాకారులు మొదలగుచారు . వారి ఆదాయాన్ని బట్టి సంపన్నశ్రేణిగా గుర్తించబడతారు . అనగా , మూడు సంవత్సరాల పాటు వరుసగా వారి వార్షికాదాయం నిర్దేశించబడిన ఆదాయ

పరిమితిని దాటితే అట్టి వారి పిల్లలు ' సంపన్నశ్రేణి'గా గుర్తించబడతారు . ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన వార్షికాదాయ పరిమితి రూ ॥ 6.00 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన వార్షికాదాయ పరిమితి కూడ రూ ॥ 6.00 లక్షలు , కేంద్ర ప్రభుత్వముతో సమానంగా ఉంది . ( జి.ఓ.యం.యస్.నెం . 26 వెనుకబడిన తరగన లు సంక్షేను ( సి ) డిపార్టమెంట్ తేది . 09.12 2013 )

 V. ఆస్తిదారులు 

ఎ . వ్యవసాయ భూమి : 1 . సాగునీటి సౌకర్యం కలిగి , ( Wet , ) Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 85 % భూమి ఉన్నయెల , వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు . 
2 ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం కలది ( Wet ) కొంత సాగునీటి సౌకర్యం లేనిది ( Dry ) అయిన యెడల , సాగునీటి సౌకర్యం గల భూమి Land Celling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో కనీసం 40 % కంటే ఎక్కువగా ఉన్నప్పుడే , మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మార్చి , రెంటినీ కలిపి చూసి , Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 80 % కన్నా ఎక్కుగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు .
 3 . ఒక వేళ ఉన్న భూమి అంతా మెట్టభూమియే అయినప్పుడు , ఎంత భూమి ఉన్నప్పటికీ వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడదు . ఇచ్చట గుర్తించవలసిన ముఖ్యమైన అంశమేమనగా , భూమి పరిమాణమును బట్టి మాత్రమే సంపన్నశ్రేణి నిర్ణయిస్తారు . ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయంలో ఏ మాత్రం సంబంధంలేదు . ఉండవలసిన భూపరిమాణం కంటే తక్కువగా భూమిని కలిగి , ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయం సంపన్నశ్రేణి ఆదాయ పరిమితి కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ , అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించరాదు .

 బి .1 ) మామిడి , బత్తాయి , నిమ్మ మొ || తోటలు : L ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో , నీటిని మామూలు సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తించడం జరుగుతుంది . అంటే , Land Ceiling Act ప్రకారం 85 % కంటే ఎక్కువగా భూమిని కలిగి , ఆ భూమిలో పైన తెలిపిన తోటలు ఉన్నయెడల , అట్టివారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించబడటం జరుగుతుంది .

 2 ) కాఫీ , టీ , రబ్బరు మొ ॥ తోటలు : ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తొటలైనచో , వాటిపై వచ్చు ఆదాయమును బట్టి క్రిమిలేయర్ నిర్ణయం జరుగుతుంది . అనగా , పైన తెలియజేయబడిన విధముగా నిర్దేశించబడిన ఆదాయ పరిమితి కన్నా .. మించిన ఆదాయమును మూడు సం॥లు వరుసగా పొందిన యెడల , అట్టివారి పిల్లలు శ్రీమీలేయర్ గా పరిగణించబడతారు . సి ) పట్టణాలలో ఖాళీ స్థలం / భవనములు : Wealth Tax వర్తింపజేయబడి , పరిమితికి మించిన ఆస్తిని కలిగిన వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడతారు . క్రీమీలేయర్కు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు పైన తెలియజేయబడిన వివిధ అంశాల ద్వారా క్రిమీలేయర్ క్రిందకు ఎవరెవరు వస్తారన్నది నిర్ణయించడం జరుగుతుంది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన పేర్కొన అంశాలలో ఒక్క ఆదాయ పరిమితి విషయాన్ని మినహాయించి మిగతా అన్నింటినీ రాష్ట్ర స్థాయిలో వెనుకబడిన తరగతులలో క్రిమీలేయర్ గుర్తింపునకు ఆచరించాలని జి.ఓ.యం.యస్.నెం . 26 వెనుకబడిన తరగతులు సంక్షేమ ( సి ) డిపార్టమెంట్ తేది . 09.12.2013 ద్వారా తగు ఉత్తర్వులను ఇవ్వడం జరిగినది .

 డ్రీమీలేయర్ అంశాన్ని మరింత స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి మరి కొన్ని వివరణలు :
 1 . క్రీమీలేయర్ అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు , విద్యా సంస్థల్లో ప్రవేశానికి మాత్రమే వర్తింపచేయాలి . 
2 గుల విషయంలో క్రిమీలేయర్ ను వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగుస్తాయిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు . వారు పొందు జీతభత్యాలతో ఏ మాత్రం సంబంధం లేదు . 
3 . ఒక్కొక్కసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా వుండవచ్చు . అట్టి పరిస్థితులలో వారు క్రీమీలేయరు క్రిందకు వస్తారా ? రారా ? అన్న విషయాన్ని వేరువేరుగా పరిశీలించాలి . ఒకవేళ , వారి తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను

బట్టి శ్రీమీలేయరు క్రిందకు రాని వారు వారికున్న వ్యవసాయ భూపరిమితిని బట్టి క్రీమీలేయరు క్రిందకు రావచ్చు . వ్యవసాయ భూమి విషయంలో పైన తెలియజేసిన విధంగా ఎంత పరిమాణం ఉన్నది అన్నదే ముఖ్యంగానీ , ఆ భూమి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నదని కాదు . జీత భాత్యాలను , వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి శ్రీమీలేయరు నిర్ణయించరాదు . 

4 ) జీత భత్యాలు , వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయము కాక ఇతర సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్యం లాంటి ఇతర ఉండ వలసిన ఆదాయాన్ని మించిన యెడల , అప్పుడే వారి పిల్లలు క్రీమీలేయర్గా పరిగణించబడతారు . వివిధ సేవా వృత్తుల ద్వారా మరియు వ్యాపార , వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం పొందుచున్న వారికి మాత్రమే ఆదాయ పరిమితి పరీక్ష వర్తింపజేసి , శ్రీమీలేయర్ క్రిందకు వస్తారా ? రారా ? నిర్ణయించాలి . 

6 ) ఎవరైనా కొందరు ఉద్యోగులు కొంత వ్యవసాయ భూమితో పాటు ఇతర రంగాలనుంచి కూడా ఆదాయాన్ని పొందుచున్నప్పుడు వారికి ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని బట్టి మాత్రమే వారి డ్రీమీలేయర్ స్టేటస్ ను నిర్ణయించాలి . అంతే కానీ , వేర్వేరు రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి చూసి క్రిమీలేయర్ స్టేటను నిర్ణయించరాదు . చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బి.సి. / ఒ.బి.సి శ్రీమీలేయర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకొనపుడు , ఒకవేల తహసిల్దార్ గారికి అవగాహన లేనపుడు ఇబ్బంది పడాల్సివస్తుంది ) . 

7 ) కొందరు Land Celling Act ప్రకారం వుండవలసిన భూమిలో 85 % కన్నా తక్కువ భూమి వున్నందువలన , ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయం ఆదాయ పరిమితి కన్నా తక్కువగా వున్నందువలన శ్రీమీలేయడు క్రిందకు రాక పోయినప్పటికీ , వారికి పట్టణాలలో వున్న సంపదను బట్టి వారు శ్రీమీలేయరు క్రిందకు వచ్చు అవకాశం కలగు ఇది ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది , 

8 ) ఒక వ్యక్తి క్రీమీలేయర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటస్ను బట్టి మాత్రమే నిర్ణయించాలి . తన స్టేటల్తో సంబంధం లేదు . అనగా ఎవరైనా గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ఎంపిక కాబడి , మళ్ళీ గ్రూప్ -1 స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగము కొరకు గ్రూప్ -1 పరీక్షలకు గానీ , సివిల్ సర్వీసు పరీక్షలకు గానీ ప్రయత్నం చేసినప్పుడు , అతని స్టేటస్ ను బట్టి అతన్ని క్రిమీలేయర్ పరిగణించరాదు . అలాగే స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి క్రిమీలేయర్ స్టేటస్ ను నిర్ణయించాలే గానీ , ఆమె భర్త స్టేటస్ ను బట్టి కాదు , పై వివరణలను బట్టి డ్రీమీలేయరు ఎవరెవరికి వర్తిస్తుందో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు . ఇది అందరు ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి వర్తిస్తుంది అని అనుకోవడం సరికాదు . ( ఎ ) ఒక ఉద్యోగి తొలి నియమాకపు స్టేటస్ ( బి ) ఉన్న భూమి యొక్క పరిమాణం , ( సి ) ప్రైవేట్ సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్య రంగాల ద్వారా వచ్చు ఆదాయం మరియు పట్టణాలలో ఉన్న ఆస్థి ద్వారా వచ్చు ఆదాయం ( డి ) సంపద పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లించడం ( రూ . 30.00 లక్షల ఆస్థి వరకు సంపద పన్ను మినహాయింపు కలదు ) లాంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకొని , ఏ కేటగిరి క్రిందనూ క్రీమీలేయర్ పరిగణించబడడానికి వీలులేనప్పుడు అట్టి వారి పిల్లలు క్రీమీలేయర్ క్రిందకు రాను , వేరువేరు కేటగిరీల క్రింద పొందు ఆదాయాన్ని కలిపి చూడరాదు . అలా కలిపి చూసి , క్రీమీలేయర్ స్టేటస్ ను నిర్ణయించరాదు . ఈ పైన తెలిపిన విషయాలను రైతులు , వ్యాపారస్తులు , ఉద్యోగులు , ముఖ్యముగ దృవీకరణ పత్రము జారీ చేయు తహసిల్దారులు చదివి అర్హులైన లబ్దిదారులకు సమయము లోపల OBC క్రిమీలేయర్ ధృవికరణ పత్రము అందేటట్టు చర్యలు తీసుకోవాలి . ( డైరెక్టర్ , వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ( పూ.అ.ఐ ) , తెలంగాణ వారి అనుమతితో ) ilman సంయుక్త సంచాలకులు , వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ , తెలంగాణ రాష్ట్రము . జిల్లా కలెక్టర్లు అందరికి . డిప్యూటీ డైరెక్టర్లు / జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు అందరికి ..

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts