TS TET Paper I Psychology రక్షణ తంత్రాలు బిట్స్

*📕TS TET SPECIAL🌐*
                   Dt:25.04.2022
*🧠PSYCHOLOGY TOPIC-4️⃣*

*🔮రక్షణ తంత్రాలు(Defence Mecha nisms)*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*♦️1)హేతువాద వితరణ( Rationalisation)*
👉తమని తాము సమర్థించుకోవడం .
👉నక్క ద్రాక్షా పళ్ళ కథ 
👉అందని ద్రాక్షాపండ్లు పుల్లన.
👉పోలీస్ జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా సాధించ లేని వ్యక్తి .. ఎందుకులే అది చాలా రిస్క్ తో కూడిన జాబ్ అని అనుకోవడం.

*♦️2)విస్థాపనం(Displacement)*
👉ఒక వ్యక్తి తన కోపతాపాలను ఇతరుల పై చూపడం.
👉ఆఫీసులో తన పై అధికారి పై చీవాట్లు తిన్న ఉద్యోగి ఇంటికి వచ్చాక తన భార్య పై అరవడం.
👉క్రికెట్ లో బంతిని సరిగా కొట్టకుండా అవుటయిన వ్యక్తి బ్యాట్ ను నేలకేసి కొట్టడం
👉అత్తమీద కోపం దుత్త మీద చూపడం.

*♦️3)ప్రక్షేపణం(Projection)*
👉తనలోని ప్రేరణలను సంఘర్షణలను ఉద్వేగాలను ఇతరులకు ఆపాదించడం
👉ఒక వ్యక్తి అవినీతి పరుడు అయితే లోకంలో అందరూ అవినీతి పరులుగా భావించడం
👉కాపీ కొడుతూ పట్ట బడ్డ విద్యార్థి నేనొక్కణ్ణే కాదు అందరూ కాపీ కొట్టారు అని చెప్పడం
👉పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా అనిపించినట్లు

*♦️4)దమనం(Repression)* 
👉విచార కరమైన విషయాలను అచేతనంలోకి పంపడం.
👉అచేతనం లోకి పంపబడ్డ విషయాలు కలల ద్వారా మానసిక వ్యాధుల ద్వారా బయట పడతాయి.
👉చేదు అనుభవాలను మర్చిపోవాలి అనుకోవడం

*♦️5)స్వైర కల్పన(Fantasy)*
👉పగటి కలలు కనడం
👉ఊహా లోకంలో విహరించడం.
👉ఇది ఎక్కువగా ఉపయోగిస్తే అనర్థదాయకం అవుతుంది

*♦️6)పరిహారం(Compensation)*
 👉ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగంలో రాణించడం.
👉చదువులో రాణించలేని వ్యక్తి ఆటలో ఉన్నత స్థాయికి ఎదగడం.

*♦️7)ప్రతిగమనం(Regression)*
👉కుంఠనం చెందిన వ్యక్తులు పెద్దవారైనా చిన్నపిల్లలా ప్రవర్తించడం
👉20 సం.వ్యక్తి 2 సం.వ్యక్తిలా ప్రవర్తించడం...ఏడవడం అలగడం

*♦️8)తాదాత్మీకరణం(Identification)*
👉తాను సాధించలేనిది ఇతరులు సాధించినపుడు సంతృప్తి పడడం
👉తాను IAS కాలేక పోయిన వ్యక్తి తన కొడుకు/కూతురు సాధిస్తే దాన్ని తానే సాధించినట్లు సంతృప్తి పడడం.
👉 సంగీతం నేర్చుకోలేని వ్యక్తి తన పిల్లలు నెర్చుకునేలా ప్రోత్సహించడం.



                *..✍🏻G.SURESH*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts