100-days Reading Campaign for children studying in to Classes I to IX ,from 5thFeb 2022 to end of the academic year Proc. Rc. No. 2710/TSS/Pdg/T6/2021, Dated: 03 02.2022.

PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR, SAMAGRA SHIKSHA, TELANGANA STATE, HYDERABAD


Present: Smt. A. Sree Devasena, IAS.,

100-days Reading Campaign for children studying in to Classes I to IX ,from 5th
Feb 2022 to end of the academic year Proc. Rc. No. 2710/TSS/Pdg/T6/2021, Dated: 03 02.2022.


Sub: Samagra Shiksha, Telangana State, Hyderabad - 100-days Reading Campaign for children studying in to Classes I to IX ,from 5th
Feb 2022 to end of the academic year- Certain Instructions Issued -Reg.

Ref:
 1) D. 0. Letter No. 18-91/2021-IS-15, dated 09.12.2021 of the Secretary, Department of School Education & Literacy, MoE, GOI,
New Delhi

2) Proc. Rc. No. 2710/TSS/Pdg/T6/2021, dated: 10.01.2022 of the
SPD, TSS, Hyderabad.

3) G.0. Rt. No. 4, Education (Prog. 11) Department, dated: 16.01.2022

4) Govt. Memo No. 5536/SE-Prog.l1/A1/2021, dated: 29.01.2022

@@@@@

         In continuation of this office proceedings 2nd cited, all the District Educational
Officers in the State are informed that as per the guidelines given by the GOI, Ministry
of Education, New Delhi 100-days Reading Campaign has to be organized in all the
schools duly taking up the week wise activities.
In this connection the District Educational Officers are informed that in order to conduct the 100-days Reading Campaign programme week-wise activities in the schools, the brief guidelines in Telugu are enclosed herewith for their ready
reference. They are requested to follow these guidelines along with the GOI guidelines already communicated vide reference 2nd cited.

Further the DEOs are informed that due to increasing of Covid-19 cases in the
State and keeping in view the health of the students, Govt. of Telangana has extended
the Sankaranti holidays up to 30.01.2022 Vide G.0 3rd cited. As per the latest instructions given by the Government vide memo 4th cited the schools have been opened from 01.02.2022.
As such the following instructions are issued once again to all the District Educational officers in the State along with certain additional guidelines in Telugu to take up the activities in the Schools from Classes I to IX with effect from 5th February, 2022 to till the end of this academic year

Click here to Download PDF file Complete Proceedings







Monitoring Proforma pdf download here

*➡️100 రోజుల రీడ్ క్యాంపెయిన్ పై సూచనలు:*  

సమస్త మండల విద్యాధికారులకు,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,URS/KGBV ప్రత్యేక అధికారులకు తెలియజేయునది ఏమనగా,

 సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ గారు పాఠశాలలోని పూర్వ ప్రాథమిక తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు తేదీ 05.02. 2022 నుండి 100 రోజుల పాటు పఠన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. విద్యార్థుల్లో స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటును పెంచడానికి, వారిలో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి మరియు విమర్శనాత్మక ఆలోచనలు కలిగించడానికి పఠనం ద్వారా భాషా మరియు నైపుణ్యం పెరగడానికి కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుంది. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ధారాళంగా చదవగలగాలి. విద్యార్థులకు చదవడం ఒక అలవాటుగా మారాలి మరియు విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి.

అందువలన ఈ కార్యక్రమమును క్రింది సూచనలతో కచ్చితంగా అన్ని పాఠశాలలో నిర్వహించాలి.

 1.విద్యార్థుల కు పుస్తకాలు చదవడానికి ఒక పీరియడు కేటాయించాలి.

 2.పాఠశాల ఆవరణలో ఫ్లెక్సీ గాని పెయింటింగ్ గాని Chart పై గాని READ PROGRAMME గురించి ప్రదర్శించాలి.

3. చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.

4. పాఠశాలలోని పుస్తకములను వర్గీకరించి తరగతుల వారీగా ప్రదర్శింప చేయాలి.

5. తరగతి వారీగా విద్యార్థులచే గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేయాలి. (ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతుల నుంచి ఐదుగురు విద్యార్థులతో గ్రంథాల కమిటీ ఏర్పాటు చేయాలి)

6.పాఠశాలలో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి.

7. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.

8. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఎన్జీవోల ను, సమాజ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి.

9. ఇంటివద్ద చదవటానికి ప్రోత్సహించాలి.

10. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించాలి.

 11.ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయాలి.  

12.ప్రతి శనివారం ప్రధానోపాధ్యాయులు CRP ల ద్వారా సమాచారాన్ని సేకరించి మండల విద్యాధికారి ద్వారా ఇదివరకే సూచించిన ప్రొఫార్మా ప్రకారం వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారి కి పంపించవలెను.

 13.నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి 14 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.

 14.ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి వారిగా వారి ప్రగతిని రికార్డు చేస్తూ మరియు సమీక్షిస్తూ పనితీరు మెరుగుదలకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సూచనలు చేయవలెను .

 15.ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రధానమైనదిగా భావించ వలెను.

16.మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ తమ మండలంలో,స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో క్రమం తప్పక మానిటరింగ్ చేస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి.

*💥READ కార్యక్రమం*💥

*⭕లైబ్రరీ వారోత్సవాలు*
( *14 -02-2022 నుండి 21-02-2022* ) 

1) రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాలను అనుసరించి రీడ్ (READ-Read Enjoy And Develop) కార్యక్రమంలో భాగంగా ఈ వారం లైబ్రరీ వారోత్సవాలు నిర్వహించ వలెను.

2) ప్రతి తరగతిలో రీడింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, రీడింగ్ కార్నర్ , ప్రతీ రోజు లైబ్రరీ పీరియడ్ అమలు పరచుటకు ఇదివరకే ఆదేశించడం అయినది.

  3) ఈ వారోత్సవాల సందర్భంగా పాఠశాల లైబ్రరీలను పునరుత్తేజం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించవలెను ..

👉 కొత్త పుస్తకాలు కొనుట 
👉దాతల నుండి సేకరణ 
👉పుస్తకాల ప్రదర్శన
👉పుస్తకాల ఆవిష్కరణ
👉 పుస్తకాల సమీక్షలు
👉 ప్రముఖులచే సందేశం
👉 పుస్తక పఠనంపై పోటీలు
👉 పుస్తకాలను ఇంటికి అందించుట
👉 ఇతర విన్నూత్న కార్యక్రమాలు 

 తేదీ *21-02-2022* రోజున *మాతృభాషా దినోత్సవము* ఘనంగా నిర్వహించి వారోత్సవాలు ముగింపు చేయవలెను. 

 4) ప్రతి వారం విద్యార్థుల చదవడంపై నివేదిక ను అధికారులకు అందించాలి .

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

1 Comments

Please give your comments....!!!

Recent Posts