Important Notes while giving option form to allocation

 *జిల్లా ఆప్షన్స్ ఇచ్చేప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు*

1.ఇదే శాశ్వత కేటాయింపు సో ఆదర బాదర పడకుండా సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో చర్చించి, మీ స్థిర నివాసం నుంచి సులభంగా ఉద్యోగం చేసుకునే విధంగా, మీ సొంత ఇంటి నుంచి ఉరుకులు పరుగులు లేకుండా ఉండేలా నిర్ణీత దూరంలో ఉన్న జిల్లా లేదా మీరు సెటిల్ కావాలనుకున్న డిస్ట్రిక్ట్ మొదటి ఆప్షన్ ఇవ్వండి.
2.ప్రస్తుత up&down దృష్టిలో ఉంచుకొని కాదు,రేపటి నాటికి ఆ జిల్లాలో మీకు ఎంత దూరం స్కూల్ ట్రాన్స్ఫర్ అయినా ఉద్యోగం చేయాల్సి వస్తుంది.
3.మొదటి ఆప్షన్ ఇచ్చిన జిల్లాలో మీ పిల్లల చదువుల ఖర్చు,అక్కడి cost of living ను ప్రస్తుతం మీరు నివాసం ఉంటున్న జిల్లాలోనిది ఒకసారి బేరీజు వేసుకోండి.
4.కరోన లాంటి మహమ్మారి మున్ముందు కూడా రావచ్చు,అలాంటి పరిస్థితే గనక వస్తే ఏ జిల్లా కు మొదటి ఆప్షన్ ఇస్తే బాగుంటుందో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచించుకోవలసి వస్తుంది.
5.అన్నిటి కంటే ముఖ్యమైనది ఆరోగ్యం ,ప్రశాంత జీవనము అల్టిమేట్ కావున ఆ దిశగా మీకు ఏది అనుకూలమో చూసుకోండి.
6.మీరు మొదటి ఆప్షన్ ఇచ్చిన జిల్లాలో రేపటి మీ ప్రమోషన్ గురించి కూడా ఆలోచించండి,పొరపాటున confuse అయితే ఎలాంటి ప్రమోషన్ లేకుండానే రిటైర్ కావలసిన పరిస్థితి వస్తుందేమో..?
7.మీరు బోధించాల్సిన మీడియం, ఒక తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్య మీకు అనుకూలమేనా ఆలోచించండి.
8.కొత్త జిల్లాలో ఉండాల్సిన పరిస్థితే వస్తే మీ పేరెంట్స్, భాగస్వామి, మీ కుటుంబం, వారి చదువులు ఉద్యోగాలు, సర్దుబాటు అవ్వగలరా ఆలోచించండి.
9.ఆప్షన్ ఫారం acknowledgement(received copy) తప్పక తీసుకోండి
10.మీ ఉమ్మడి జిల్లా 3 జిల్లాలుగా విభజించబడింది అనుకుంటే ,3 జిల్లాలకు ఆప్షన్ ఇవ్వండి,ఒకటే జిల్లాకు ఆప్షన్ ఇస్తే అందులో అలాట్ కాకపోతే ఖాళీలు ఎక్కువున్న మరో జిల్లాకు నిన్ను తప్పనిసరిగా పంపిస్తారు..నేను ఆ జిల్లాకు ఆప్షన్ ఇవ్వలేదుగా అనడానికి అవకాశం లేదు.
*ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అయి ఉండాలి. మనం,మన కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి👍, వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు కాకుండా, మీరే స్వయంగా ‌పై పది అంశాలు నిజాయితీ గా ఎవ్వరికి వారు విశ్లేషించుకుంటే ఆప్షన్స్ ఇవ్వడం మీకే అర్థమౌతుంది లేదంటే గత Web counseling లో  కొందరికి జరిగినట్టుగా సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తు అయిష్టంగానే ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి పని చేయాల్సి వస్తుంది* 



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts