Guruvu.In

Frequently Asked Questions Sandehaalu Samaadhaanaalu on Service Rules

*సందేహాలు - సమాధానాలు*

1. ప్రశ్న:
*APGLI నుండి పొందిన ఋణానికి వడ్డీ చెల్లించాలా?*

జవాబు:
*ఋణం మంజూరు చేసే సమయంలోనే వడ్డీ కూడా అంచనా వేసి సమాన నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు.*


2. ప్రశ్న:
*నేను 13.6.16 న విధులలో చేరాను. ట్రైనింగ్ లేదు. కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు. ఇపుడు జాయినింగ్ తేదీగా ఏది SR లో రాయాలి?*

జవాబు:
*జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 రే అవుతుంది.*


3. ప్రశ్న:
*నేను cps ఉద్యోగిని. సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. Cps మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ ఫారం లో ఎలా చూపాలి?*

జవాబు:
*30,000/- వరకు 80ccd(1) కింద, మిగిలిన 23,000/- ను 80ccd(1బి)కింద చూయించి పన్ను మినహాయింపు పొందవచ్చు.*


4. ప్రశ్న:
*ఈ సంవత్సరం రెండు da లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది. 20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు da లు గత సంవత్సరం ఆదాయంలో చూయించుకోవచ్చా?*

జవాబు:
*చూపించుకోవచ్చు. గత సంవత్సరంనకు చెందిన బకాయిలను ఆయా సంవత్సరాలలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 10-E సమర్పించాలి.*


5. ప్రశ్న:
*నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను. నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను. నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా?*

జవాబు:
*ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హత లతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.*

6. ప్రశ్న:
*ఒక ఉద్యోగి ప్రభుత్వ విధానాలను, పాలనను విమర్శించడం చేయకూడదంటారు కదా ! మరి అందుకు సంబంధించిన జీవో కానీ ఉత్తర్వులు కానీ ఉన్నాయా? తెలుపగలరు.*

జవాబు:
*రూల్ 17 AP CS (conduct) రూల్స్ ప్రకారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ విధానాలను, పాలనని విమర్శించే అవకాశం లేదు. కేవలం ఉద్యోగులు మాత్రమే ఉండే వేదికలపై ఉద్యోగుల సమస్యల గురించి చర్చించవచ్చు.*


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts