Doubts and Clarifications Frequently Asked Questions Sandehaalu Samaadhaanaalu

*సందేహాలు - సమాధానాలు*


1. ప్రశ్న:

*నేను, నా భర్త టీచర్లం. నా భర్త మరణించిన పిదప నాకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నారు. దీనికి DA ఇవ్వరా?*

జవాబు:

*జీఓ.51, తేదీ:30.4.15 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వారికి మాత్రమే DA ఇవ్వరు. మీకు కుటుంబ పెన్షన్ పై DA చెల్లిస్తారు.*


2. ప్రశ్న:

*నేను డ్రాయింగ్ టీచర్ ని. PAT పాస్ అయ్యాను. B. Com పాస్ అయ్యాను. B. ed లేదు. నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా?*

జవాబు:

*24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ & బీ.ఎడ్ ఉండాలి.*


3. ప్రశ్న:

*నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను. అలవెన్సు ఇచ్చారు. పెరిగిన DA తేడా ఇవ్వరా?*

జవాబు:

*FAC కాలానికి, సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.*


4. ప్రశ్న:

*ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఇంక్రిమెంట్ ఆపారు. అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా?*

జవాబు:

*మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.*


5. ప్రశ్న:

*నేను శనివారం, సోమవారం సెలవు పెట్టాలి. రెండు CL లెటర్లు ఇవ్వాలా?*

జవాబు:

*అవసరం లేదు. ఒక లెటర్ పై రాసి ఆదివారం అనుమతి అని రాయండి సరిపోతుంది.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

1 Comments

  1. మా స్కూల్ యొక్క అటెండెన్స్ రిజిస్టర్ లో ఒకే డీఎస్సీ కి చెందిన వేరువేరు సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ లను డేట్ అఫ్ బర్త్ ప్రకారం సీనియార్టీ రాస్తున్నారు నాది ఫస్ట్ Rank కానీ నన్ను కింద రాస్తున్నారు ఇది కరెక్టేనా?

    ReplyDelete

Please give your comments....!!!

Recent Posts