Telugu Online Quiz to SSC Students

రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణాసంస్థ , తెలంగాణ రాష్ట్రం , హైదరాబాదు . శ్రీమతి యం . రాధారెడ్డి , సంచాలకులు గారి ఉత్తర్వులు తేది : 18-11-2021 పాఠశాల విద్యాశాఖ ,

విషయం 

తెలంగాణ రాష్ట్రం - ఎస్.సి.ఇ.ఆర్.టి. ' దాసుభాషితం ' వారి ప్రతిపాదస - విద్యార్థుల్లో మాతృభాష మీద మక్కువ పెంపొందించడం ద్వారా తెలుగు భాషా పరిరక్షణ - 10 వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్విజ్ నిర్వహణ విద్యార్థులు పాల్గొనడానికి ఉత్తర్వులిచ్చుట గురించి - 


సందర్భం 

ఉత్తర్సు సంఖ్య : 1964 / భాషా విభాగం / ఎస్.సి.ఇ.ఆర్.టి. / 18  :  : ' దాసుభాషితం ' వారి లేఖ , తేది : 16-11--2 ( 21 


@@@ పై విషయం పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖాధికారులకు తెలియజేయునది ఏమనగా పై సందర్భంలోని లేఖ ద్వారా ' దాసుభాషితం ' సంస్థవారు అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లోని 10 వ తరగతి విద్యార్థులకు తెలుగు భాషపైన మక్కువ పెంపొందించడానికి , భాషాపరిరక్షణ కోసం తేది : 05-12-2021 నాడు ఆన్లైన్ ద్వారా క్విజ్ పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఇందుకోసం తేది : 04-12-2021 లోగా పాఠశాల పక్షాన 9849136617 నెంబరుకు ' potec 2021 ' అని వాట్సాప్ మెసేజ్ ద్వారాగాని లేదా www.dasubhashitary.com లో గాని దరఖాస్తు చేసుకోవాలి . ఈ క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు , ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు నగదు బహుమతిని అందజేస్తారు . 

కాబట్టి జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల 10 వ తరగతి విద్యార్థులు ఆన్లైన్ క్విజ్లో పాల్గొనడానికి వీలుగా అవసరమైన చర్యలు చేపట్టగలరని కోరనైనది .

 గమనిక : అనుబంధంలో పోటీ నిర్వహణ వివరాలు , నమూనా పోస్టరు జతచేయనైనది .

 సంచాలకులు , ఎస్.సి.ఇ.ఆర్.టి. తెలంగాణ , హైదరాబాద్ . దీని ప్రతులు రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరికి తగు సమాచార నిమిత్తం . 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts