How file e filing in Income tax website Step by Step Process in Telugu

*E-Filing చేసుకొనుటకు సూచనలు:*

*ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కోసం జూన్ 7  నుంచి ప్రారంభమైన కొత్త సైట్ ఇప్పటివరకు అవాంతరాలతో నడిచింది. ప్రస్తుతం  బాగానే పనిచేస్తుంది. వాస్తవానికి మనం ఈ ఫైలింగ్ ప్రతీ సంవత్సరం జులై 31 లోగా  సబ్మిట్ చేయాల్సి నప్పటికీ  ప్రస్తుత  కరోనా నేపథ్యంలో  ఈ గడువు సెప్టెంబర్ 31 వరకు పెంచడం జరిగింది. గత రెండున్నర నెలలగా కొత్తసైట్ సరిగా పని చేయనందున  ప్రస్తుతం ఈ గడువు  చాలదని డిసెంబర్ 31 వరకు పెంచాలని చాలామంది కోరుతున్నారు.

ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఈ - ఫైలింగ్) అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000  పైబడిఆదాయం  కలిగిన వారందరూ  *ఇన్కమ్ టాక్స్  పడనప్పటికీ*  తప్పనిసరిగా  ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 
75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్  వారి ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్  చేయడం నుండి మిన హాయింప బడ్డారు.

కారణం ఏదైనా ఎవరేని ఈ-ఫైలింగ్ చేయని వారికి రెండు మూడు సంవత్సరాల తరువాత కూడా నోటీసులు రావడం గమనించుకోవలసిన విషయం.

కొత్తగా ప్రారంభమైన ఇన్కమ్ టాక్స్  సైట్ లో మనం ఈ ఫైలింగ్  ఎలా చేయాలో పరిశీలించుదాం.
గతంలో మనం  www.incometaxindiaefiling.gov.in   సైట్ ద్వారా ఈ ఫైలింగ్ చేసేవాళ్ళం. ప్రస్తుతం www.incometax.gov.in.
సైట్ లో ఇన్కమ్ టాక్స్ రిటరన్స్ ఈ ఫైలింగ్ ద్వారా చేసుకోవాలి. 

వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి , రిఫండ్ కోరడానికి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ సైట్ అభివృద్దిచేసారు.
ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కు పాన్ నెంబర్ గానీ ఆధార్ నెంబరు గానీ యూజర్ ఐడి గాఉపయోగించాలి. పాస్వర్డ్ సహాయంతో మనం ఈ ఫైలింగ్ పేజీలో ప్రవేశించ గలుగుతాం.

పాస్ వర్డ్ మరచిపోయిన సందర్భంలో forget పాస్ వర్డు ఆప్షన్  ద్వారా  ఇ మెయిల్, ఫోన్ నెంబరు సహాయంతో దిగ్విజయంగా ఈ ఫైలింగ్  సైట్ లోకి ప్రవేశించవచ్చు.

ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడానికి  మనం ముందుగా గమనించాల్సినవి.

1.పాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉండాలి.
2. ఆధార్ మన  మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడి ఉండాలి.
3.  మన బ్యాంకు ఖాతా కు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉండాలి. 
4. గమనిక- ఈ మూడు అంశాలు లో  ఏది లేకపోయినా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయలేము.
5.  మన జీతం/  పెన్షన్  వివరాలతో డి డి ఓ ఇచ్చిన ఫారం16 / పెన్షనర్లు ఫిబ్రవరి పేస్లిప్  దగ్గర ఉంచుకోవాలి.టేక్స్ పే చేసిన పెన్షనర్లకు సంబంధిత ట్రెజరీలలో Form 16 ఇస్తున్నారు.
6.  లింక్ అయిన మొబైల్ దగ్గర ఉండాలి.
7.
ప్రస్తుతం  I T ఈ ఫైలింగ్ పేజీలో  పాన్ ,ఆధార్ లింక్ అవ్వడం ద్వారా మన వివరాలు ఉంటాయి.వాటిని  ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. మన ఫోటో కూడా ఆధార్ సైట్  నుండి కానీ  నేరుగా గాని  ఇక్కడ అప్డేట్ చేయ వచ్చు.

New users అయితే మనం  individual tax payer  దగ్గర క్లిక్ చేసి
1. బేసిక్ డీటెయిల్స్ లో పాన్ నెంబర్,  నేమ్, డేట్ అఫ్ బర్త్, జెండర్,  రెసిడెన్షియల్ స్టేటస్  ఫిల్ చేయడంకానీ ఉన్న వివరాలను అప్డేట్ చేయడం గానీ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకొనే అవకాశం ఉంది.
2. కాంటాక్ట్ డీటెయిల్స్ లో సెల్ నెంబర్, అడ్రస్ వివరాలు  పూర్తి చేయాలి.  మన మొబైల్ ఓటీపీ ద్వారా వాలిడేట్ చేయాలి.
3.  బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి..
గతంనుండి ఐటి ఫైల్ చేస్తున్న ఎక్సిస్టింగ్ యూసర్స్ వివరాలు ప్రీఫిల్ చేసిఉంటాయి .. సరిచూసుకోవడం అవసరమైతే ఎడిట్ చేయడం చేయవచ్చు.

మనం ఇపుడు ఐటి రిటరన్ ఫిల్ చేయడం గురించి చూద్దాం!!
లాగిన్ అయి  అసెసెమెంట్ ఇయర్ ఎంటర్ చేసి  Online filling  ఆప్షన్ ఎంపిక చేసి  Status లో individual  సెలక్ట్ చేసి మనకు వర్తించే ఐ టి ఆర్ ఫారం సెలక్ట్ చేయాలి. మనం ITR 1 ఎంచుకోవాలి.

ఇక్కడ మనం 3 steps follow కావాల్సి ఉంటుంది.
1 Validate Your returns
2Conform your return summery
3.Verify and submit  your return అనేవి.

1 Validate your return లో 5 అంశాలు ఉంటాయి.
1. Personal information
2.Gross total Income
3.Total deductions
4. Taxes paid
5.  Total Tax Liability లను ఒకటి పూర్తి చేసిన తరువాత మరొకటి క్లిక్ చేసి ఓపన్ చేసి ఫిల్ చేసుకోవాలి.
6. Personal information దగ్గర ఒక ముఖ్యమైన విషయం....
7. Are you opting for New Regime U/s 115BAC?  
8. Old regime పద్దతి ద్వారా 1,50,000వరకూ సేవింగ్స్ , గృహఋణాలు ఉన్నవారు No పై క్లిక్ చేయడం వల్ల ఉపయోగం. ఏవిధమైన సేవింగ్స్ లేని 5లక్షల పై బడి ఆదాయం ఉన్నవారు New regime ఎంచుకుంటే Yes క్లిక్ చేసిముందుకు వెళ్ళాలి.

Bank details లో మన పేరున ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలవివరాలు అప్డేట్ చేసినప్పటికి ఏదో ఒక ఖాతాను .టేక్స్ రిఫండ్ కోసం సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది.ఈ ఖాతాకు ఆధార్ , పాన్ , ఫోన్ లింక్ అయిఉండాలి.

2.Gross total Income దగ్గర ఇవ్వబడ్డ  మనసేవింగ్స్  అన్నింటి పై సెక్షన్ల వారీగా Yes or No జవాబులతో  ఫిల్ చేసిన తరువాత మన ఆదాయానికి, డిడక్షన్స్ కు సంబందించిన వివరాల పేజీ ఓపన్ అవుతుంది. అక్కడ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను అంకెలరూపంలో నింపి సేవ్ చేయాలి.కన్పర్మ్ చేయాలి.

ఇక్కడ మన అకౌంట్ కు బ్యాంకు చెల్లించిన వడ్డీ ని కూడా చూపవలసిఉంటుంది.

మన ఆధార్ తో లింక్ అయ్యి, వివిధ బ్యాంకులలో మనకి ఏవేని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లయితె వాటికి బ్యాంకు చెల్లించె వడ్డీలకు సదరు బ్యాంకు IT ని cut చేసిందీ,లేనిదీ ధృవీకరించు కోవలసి యుంటుంది.

3.Total deductions
మనం సేవ్ చేసిన మొత్తం ఏఏ సెక్షన్లలో ఎంత  అనే అంశాలను ఇక్కడ Yes or No ద్వారా చూపి కంటీన్యూ చేసి ఓపన్ అయిన విండోలో ఎడిట్ ఆప్షన్ ద్వారా  అంకెల రూపంలో నింపాలి.

4 Taxes paid మనం కట్టిన టేక్స్ వివరాలు ఇక్కడ సంబందిత కాలమ్ లో నింపాలి.కన్ఫర్మ్ చేయాలి. మనం ఇప్పటికే టేక్స్ కన్నా  అదనంగా ఐటి కి చెల్లించి ఉంటే ఫారం16 ప్రకారం ఇక్కడ చూపుతాం.

5. Total Tax Liability పై క్లిక్ చేసి మనం ఇప్పటి వరకూ నింపిన వివరాలన్నింటిని సరిచూసుకొని కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి.
6.మనం అదనంగా కట్టిన మొత్తం రిఫండ్ క్లైమ్ చేయాలి.

ఇపుడు మన టేక్స్ రిటరన్ అన్నివివరాలు కనిపిస్తాయి వాటి ప్రివ్యూ పై క్లిక్ చేయండి . ఓపన్ అయిన విండోలో వివరాలను సరిచూసుకొని ... Proceed to Validation - ఆపై Proceed to Verifcation కు వెళ్ళండి.(ఈ వివరాలన్నింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు.) ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మీ మొబైల్ ఓటిపి ద్వారా వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకొండి. తరువాత వచ్చే Acknowledgement Print తీసుకొండి.
వివిధ కారణాల రీత్యా మొబైల్ OTP రాని పక్షంలో వెరిఫికెషన్ పూర్తికావడానికి అకనాలెడ్జ్ మెంట్ ను అకనాలెడ్జ్ మెంట్ లో సూచించబడిన బెంగళూరు అడ్రస్ కు పోస్ట్ చేయవలసియుంటుంది.



*💐 Income Tax 10e Form ను ఆన్లైన్ లో సబ్మిట్ చేసే పూర్తి విధానం వీడియో*




*◆మొబైల్ లో e ఫైలింగ్ చేసే లైవ్ వీడియో*


*◆ మన Income Tax e Filing ను కొత్త Income Tax Site లో ఆన్లైన్ లో సబ్మిట్ చేసే పూర్తి విధానం వీడియో*



*◆Annual Information Statement (AIS) ను ఎలా చెక్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి,పూర్తి విధానం*ICIkfyqSGU

*◆ e Pay Tax Pay చేసే పూర్తి విధానం వీడియో*



*◆Income Tax e Filing కొత్త వెబ్ సైట్ లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే పూర్తి విధానం వీడియో*



*◆Income Tax e Filing కొత్త వెబ్ సైట్ లో Password మరిచిపోతే తిరిగి పొందే పూర్తి విధానం వీడియో*


*◆మన PAN అకౌంట్ లో ఇప్పటి వరకు మనం కట్టిన టాక్స్ అమౌంట్ క్రెడిట్ అయ్యిందో లేదో చెక్ చేసే పూర్తి విధానం (TDS చేశారో లేదో చెక్ చేసే విధానం) వీడియో* 


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts